Just In
- 10 hrs ago
ఉత్పత్తిలో '100 మిలియన్' రికార్డ్ కైవసం : హీరోమోటోకార్ప్
- 12 hrs ago
హ్యుందాయ్ నుండి మరో కొత్త ఎస్యూవీ వస్తోంది, టీజర్ విడుదల
- 13 hrs ago
పూర్తి చార్జ్‌పై 500 కి.మీ ప్రయాణించే మెర్సిడెస్ బెంజ్ ఈక్యూఏ ఎలక్ట్రిక్!
- 13 hrs ago
మాట నిలబెట్టుకున్న జగన్మోహన్రెడ్డి.. రేషన్ డోర్ డెలివరీకి సర్వం సిద్ధం
Don't Miss
- Lifestyle
శుక్రవారం దినఫలాలు : జాబ్ కోసం నిరుద్యోగులు అకస్మాత్తుగా జర్నీ చేయొచ్చు...!
- News
శివమొగ్గలో భారీ పేలుడు: 15 మంది మృతి?, భూమి కంపించడంతో భయంతో జనం పరుగులు
- Finance
తగ్గిన బంగారం ధర, పెరిగిన వెండి ధర: రూ.50,000 దిగువనే బంగారం
- Sports
సొంతగడ్డపై భారత్‌ను ఓడించడం కష్టమే: జోరూట్
- Movies
ఎంతటి రాకీ భాయ్ అయినా కూడా అది తప్పదు.. మాల్దీవుల్లో యశ్ రచ్చ
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
లాక్ డౌన్ సమయంలో ఎమ్మెల్యే స్టిక్కర్ తో పట్టుబడ్డ వాహనం, తర్వాత ఏంజరిగిందో తెలుసా.. !
భారతదేశంలో కరోనా వ్యాప్తి రోజు రోజుకి అధికంగా ఉంది. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా భారత ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటున్నది. కరోనా వైరస్ నివారణకు ఇప్పుడు దెస వ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించబడింది. ఈ లాక్ డౌన్ లో భాగంగా దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాలు తమ సరిహద్దులను కూడా మూసివేసాయి. కరోనావైరస్ సంక్రమణ ఎక్కువగా ఉన్న జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించబడింది.

లాక్ డౌన్ కారణంగా ఇప్పుడు రహదారులన్నీ నిర్మానుష్యంగా మారాయి. భారతదేశంలో కరోనా వైరస్ ప్రభావాన్ని అరికట్టడానికి లాక్ డౌన్ ప్రకటించారు. కానీ చాలామంది ఇప్పటికి లాక్ డౌన్ కి వ్యతిరేఖంగా రోడ్లపై తిరుగుతూ ఉన్నారు. పోలీసులు ఎన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నప్పటికీ దీనిని పూర్తిగా నిలువరించలేకపోతుంది. ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటకు రాకూడదని నిబంధనలను కూడా విధించారు.

భారత్ లాక్ డౌన్ వల్ల పెద్ద సంఖ్యలో ప్రజలు ఇంట్లోనే ఉండి ప్రభుత్వాలకు మద్దతు ప్రకటిస్తున్నారు. కానీ కొంతమంది వీటికి వ్యతిరేఖంగా వీధుల్లో తిరుగుతున్నారు. ఈ విధంగా తిరుగుతున్న వారిని పోలీసులు చాల కఠినంగా శిక్షిస్తున్నారు.

లాక్ డౌన్ నిబంధనలకు వ్యతిరేఖంగా ఉత్తర భారతదేశంలో ఒక సంఘటన వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటనలో తెల్లటి టయోటా ఫార్చ్యూనర్ కారును చట్టసభ సభ్యుల ఉపయోగించే స్టిక్కర్లు వేసుకుని రోడ్డుపై తిరుగుతున్నారు. ఈ కారులో ఇద్దరు యువకులు ప్రయాణిస్తున్నారు. పోలీసుల కన్ను కప్పి విచ్చలవిడిగా రోడ్లపై తిరుగుతున్నారు. పోలీసుల కథనం మేరకు కారుకు స్టిక్కర్ అతికించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.

పోలీసులకు దొరికిన ఆ యువకులు చట్టసభ సభ్యుల బంధువులు అని చెప్పుకుంటున్నారు. బయట తిరగడానికి ప్రత్యేక పాస్ ఇచ్చినట్లు కూడా చెప్పారు. పోలీసుల ప్రశ్నలకు ఆ యువకులు సరైన సమాధానాలు ఇవ్వలేదు. పోలీసులు ఆ యువకులకు రూ. 10,500 జరిమానా విధించారు. పోలీసుల కథనం మేరకు ఈ సంఘటన ఢిల్లీ ప్రక్కనే ఉన్న హర్యానా రాష్ట్రంలో జరిగింది.

నేడు కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా నిరోధించడం ప్రతి పౌరుడి కర్తవ్యం. ఈ భయంకరమైన వైరస్ ఒక వ్యక్తి నుండి మరొకరికి సులభంగా వ్యాపిస్తుంది. ఈ కారణంగా ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలి అంతే కాకుండా ఒకవేళా అత్యవసర పరిస్థితుల్లో వచ్చినట్లైతే కూడా సామజిక దూరం పాటించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను విజ్ఞప్తి చేస్తున్నాయి.

ప్రభుత్వ నిబంధనలను లెక్కచేయకుండా కొంత మంది ఆకతాయిలు హాలిడే ట్రిప్ లాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ విధంగా చేయడం వల్ల వీరు కరోనా భారిన పడే అవకాశం ఉంది. ఇది చాలా వేగంగా వ్యాపిస్తున్న కారణంగా వీటిని పూర్తిగా నివారించడానికి ఇంట్లోనే ఉండాలి. అప్పుడే ఈ వైరస్ నుండి మనల్ని మనం కాపాడుకోగలుగుతాము.

కరోనా లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించే వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవడం ప్రారంభించారు. జరిమానాలు విధించడమే కాకుండా వాహనాలను నిర్బంధిస్తున్నారు. ఇటీవల తమిళనాడులో దాదాపు 1000 కి పైగా వాహనాలను సీజ్ చేయడం కూడా జరిగింది. ఇప్పుడు లాక్ డౌన్ నిబంధనలు మరీ ఎక్కువయ్యే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలందరూ దీనికి మద్దతుగా వ్యవహరించాలి.
Source: Amar Ujala