లక్ ఇచ్చిన సత్యసాయిబాబా పాత కారు: యజమాని

Sathya Sai Baba
ఆధ్యాత్మిక గురువు భగవాన్ శ్రీ సత్య సాయి బాబా అద్భుతాలకు ఈ సంఘటన ఓ నిలువెత్తు నిదర్శనం.

చూడటానికి అదో పాత కారే కావచ్చు, కానీ ఆ కారు యజమాని మాత్రం ప్రత్యకమైన వారు. 1971వ కాలానికి చెందిన రోల్స్ రాయిస్ శాలూన్ కారు రిజిస్ట్రేన్ నంబర్ కూడా విశిష్టమైనదే - 'DNA 8888'. ఈ కారు తొలి యజమాని మరెవరో కాదు సాక్షాత్తు సత్య సాయి బాబానే. బాబా సర్గస్తులైన తర్వాత అతనితో తమకు ఉన్న అనుంబంధాలను, అనుభవాలను కోట్లాది మంది అభిమానులు వివిధ ప్రసార మాధ్యమాల ద్వారా వ్యక్తపరుస్తున్నారు. ఈ నేపథ్యంలో ముంబైలోని బాంద్రా ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి సత్య సాయి బాబాతో తనకున్న అనుబంధాన్ని వివరించారు.

నెమలి వర్ణంలో ఉండే ఈ రాయల్ కారు బాంద్రాకు చెందిన ఇర్ఫాన్ మొఘల్ గ్యారేజ్‌లో కొలువుదీరి ఉంది. టొయోటా టెక్ (ఓ హై-ప్రొఫైల్ కార్ మెకానిక్) యజమాని అయిన ఇర్ఫాన్ ఈ సందర్భంగా ఓ ఆంగ్ల వార్తా పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. "ఈ కారు తొలి యజమాని సత్య సాయి బాబా, 1972లో బాబా ఈ కారును కౌలాలంపూర్ నుంచి తెప్పించారు. ఈ కారును ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపూర్ జిల్లా, ప్రశాంతి నిలయానిక చెందిన అతని స్కూల్ పేరు "శ్రీ సత్య సాయి ఇన్సిట్యూట్ ఆఫ్ హైయర్ లెర్నింగ్"తో రిజిస్టర్ అయ్యింది. తర్వాతి కాలంలో ఆ కారును ఢిల్లీకు చెందిన ఓ వ్యాపారవేత్త వివేక్ బర్మన్‌కు 1984లో అమ్మేశారు. ఆ తర్వాత 1996లో మా నాన్నగారు అమన్ మొఘల్ ఈ కారును కొనుగోలు చేశారు. అప్పటి నుండి అది మాతోనే ఉంది" అని చెప్పారు.

ఇంకా.. "ఈ కారును మేం కొనేటప్పుడు వాళ్లు చెప్పిన ధరకు కొనేందుకు అంగీకరించలేదు. కానీ ఈ కారు తొలి యజమాని సత్య సాయి బాబా అని తెలియడంతో తర్వాత ఆయన అంగీకరించారు. కొన్ని సంవత్సరాలుగా ఆయన సత్య సాయి బాబాకు భక్తుడు" అని ఇర్ఫాన్ చెప్పారు. మొట్టమొదటిసారి ఈ కారును తెచ్చినపుడు దీని రిజిస్ట్రేషన్ నంబర్ వేరుగా ఉన్నది. "ఈ కారు మొదటి నంబర్ ADA 9, కానీ తర్వాత ఈ కారు సత్య సాయి ఇన్సిట్యూట్‌ నుంచి న్యూఢిల్లీకి వెళ్లిన తర్వాత 'DNA 8888'గా మారిపోయింది.

అయితే.. ఈ కారు గురించి చెప్పుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే.. ఇది మా వ్యాపారానికి ఎంతో కలిసి వచ్చింది. దీని ఇంటికి తెచ్చుకున్న తర్వాత మా వ్యాపారం అంచెలంచెలు ఎదిగింది. బాబా రోజూ కూర్చుని తిరిగే ఈ రోల్స్ రాయిస్ శాలూన్ యజమానిగా ఉండటం నాకెంతో గర్వంగా ఉంది" అని ఆయన తన అనుభవాన్ని పంచుకున్నారు. బాబా జ్ఞాపకంగా ఈ కారు ఎప్పటికీ తమతోనే ఉంటుందని ఇర్ఫాన్ చెప్పారు. బాబా మృతి పట్ల ఇర్ఫాన్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.

More from DriveSpark

Article Published On: Tuesday, April 26, 2011, 14:53 [IST]
English summary
Bandra based high-profile car mechanic, the owner of Toyota Tech Mr. Irphan Mogul has shared his relation with Sathya Sai Baba's vintage car. The 1971 Rolls Royce Saloon car has originally belongs to Sathya Sai Baba.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+