హవ్వ ఇదేం వింత..! ఫైవ్ స్టార్ రైల్వే స్టేషనా?
ఐదు నక్షత్రాల (ఫైవ్ స్టార్) హోటల్ గురించి విన్నాం కానీ ఐదు నక్షత్రాల రైల్వేస్టేషన్ ఏంటా అని అనుకుంటున్నారా..? అవును, బాగా డబ్బున్నోళ్ల దేశమైన సౌదీ అరేబియాలో ఓ ఫైవ్ స్టార్ రైల్వే స్టేషన్‌ను నిర్మించాలని ఆ దేశపు రాజు అబ్ధుల్లా ఆదేశాలు జారీ చేశాడు. రానున్న నాలుగేళ్లలో ఆరు లైన్లతో, ఫైవ్ స్టార్ వసతులతో కూడిన అధునాతన రైల్వే స్టేషన్‌ను సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లో నిర్మించాలని యోచిస్తున్నారు.
లండన్‌లో నిర్మించిన జహా హాదిద్ ఆర్కిటెక్చర్ నుంచి స్ఫూర్తి పొంది ఈ ఫైవ్ స్టార్ రైల్వే స్టేషన్‌ను డిజైన్ చేయనున్నారు. ఈ రైల్వే స్టేషన్ ఫైవ్ స్టార్ హోటల్‌కు ఏ మాత్రం తీసిపోదు. సౌదీ అరేబియాలో ఎండ వేడిమి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని మార్బల్ ఫ్లోర్స్, గోల్డ్ ప్లేటెడ్ గోడలు తదితర అంశాలతో ఈ రైల్వే స్టేషన్‌ను నిర్మించనున్నారు.
ఈ సిక్స్ లైన్ నెట్‌వర్క్‌ను రాజుగోరి ఆదేశాల మేరకు రెట్టింపు వేగంతో కేవలం నాలుగేళ్లలోనే ఈ ప్రాజెక్టును పూర్తి చేయనున్నారు. న్యూయార్క్‌లో ఒక్క స్టేషన్‌ను నిర్మించడానికి కూడా ఇంతే సమయం పడుతుంది. స్టేషన్‌లో ప్రతిచోటా ఎస్కలేటర్స్, పూర్తి ఎయిర్ కండిషనింగ్, అన్ని రకాల లగ్జరీ విలాసాలను కూడా ఏర్పాటు చేయనున్నారు. మరి ఈ ఫైవ్ స్టార్ రైల్వే స్టేషన్ మోడల్‌పై ఓ కన్నేసొద్దామా..?

సౌదీ అరేబియాలో ఫైవ్ స్టార్ రైల్వే స్టేషన్

Click it and Unblock the Notifications