రెప్పపాటులో తప్పిన ప్రమాదం.. వేగంగా వెళ్తున్న బస్సు కింద పడబోయిన బాలిక.. ఎలా తప్పించుకుందంటే..

దేశంలో రోడ్లపై ప్రతిరోజూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. మృతుల సంఖ్య, క్షతగాత్రుల సంఖ్య చాలా ఎక్కువగా నమోదవుతోంది. భారతదేశంలో ఏటా దాదాపు 1.50 లక్షల మంది రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఈ రోడ్డు ప్రమాదాల్లో చాలా వరకు నిర్లక్ష్యం కారణంగానే జరుగుతున్నాయి.

ముఖ్యంగా పాఠశాల విద్యార్థుల నిర్లక్ష్యం కారణంగా వాహనాలు పడి మృతి చెందడం చాలా బాధాకరమైన విషయం. రోడ్డు ప్రమాదాల పట్ల వారిలో తగినంత అవగాహన లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. ఇటీవల ఓ పాఠశాల విద్యార్థిని రోడ్డు దాటుతుండగా తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకుంది.

School-Girl-Escapes-Accident

రోడ్డు దాటుతున్న సమయంలో కొద్దిపాటి నిర్లక్ష్యంగా వ్యవహరించినా అది ప్రాణాలకే ముప్పు. హైదరాబాద్ లాంటి మహానగరంలో రద్దీగా ఉండే రోడ్లపై దాటేటప్పుడు చాలా అప్రమత్తంగా ఉండాలి. లేదంటే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఇటీవల సైబరాబాద్ పోలీసులు విడుదల చేసిన వీడియోను చూస్తే ఒక్కసారిగా మీకు గూస్ బంప్స్ రావడం ఖాయం.

రాష్ట్రంలో ప్రమాదాల నివారణకు ప్రజల్లో అవగాహన తెప్పించేదుకు సైబరాబాద్(CYBERABAD) ట్రాఫిక్ పోలీసులు తీవ్రంగా కృషి చేస్తున్నారు. అందుకు సీసీ కెమెరాల ద్వారా రికార్డయిన పలు యాక్సిడెంట్ విజువల్స్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ప్రజల్లో అవగాహన కల్పించేందుకు యత్నిస్తున్నారు. తాజాగా సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఓ వీడియోను పోస్ట్ చేశారు.

School-Girl-Escapes-Accident

రోడ్డుపై నుంచి ఓ స్కూలు బస్సు వెళ్తుంది. ఆ బస్సు వెనకాల నుంచి ఓ బాలిక రోడ్డు దాటే ప్రయత్నం చేస్తోంది. ఆ బస్సు అడ్డుగా ఉండటంతో రోడ్డుపై మరో వాహనం వస్తుందా.. లేదా.. అన్న విషయాన్ని ఆ బాలిక గ్రహించలేకపోయింది. ఈ క్రమంలో అకస్మాత్తుగా ఆ బస్సుకి అపోజిట్ డైరెక్షన్లో రోడ్డుకి ఎడమవైపు నుంచి మరో స్కూలు బస్సు వస్తోంది.

అయితే ఆ బస్సును చూసుకోకుండా బాలిక రోడ్డు దాటే ప్రయత్నం చేస్తుండగా.. ఒక్కసారిగా తన ముందు కనపడిన బస్సుని చూసి ఆ బాలిక వెంటనే ఆగిపోయి.. క్షణకాలంలో వెనక్కి వచ్చింది. దీంతో రెప్పపాటులో బస్సు ప్రమాదం నుంచి తప్పించుకుంది. దీంతో ఆ బాలిక రోడ్డు దాటుతుండగా చూస్తున్న వారు ఊపిరి పీల్చుకున్నారు.

సైబరాబాద్ పోలీసులు ఈ వీడియోను షేర్ చేస్తూ.. మీ పిల్లలు రోడ్డు దాటేటప్పుడు అప్రమత్తంగా ఉండేలా జాగ్రత్తలు చెప్పాలని తల్లిదండ్రులకు సూచించారు. కొన్ని బ్లైండ్ స్పాట్ లను గుర్తించడం కష్టమని.. ఆలస్యమైనా నిదానంగా రోడ్డు దాటాలని పేర్కొన్నారు. ఏదైనా భారీ వాహనం రోడ్డుపై వెళ్తున్న సమయంలో దాని వెనకాల నుంచి పాదచారులు రోడ్డును దాటే ప్రయత్నం చేయొద్దని సైబరాబాద్ పోలీసులు సూచించారు.

చిన్నపాటి నిర్లక్ష్యం కూడా తీవ్ర పరిణామాలకు దారితీస్తుందని అందరూ గుర్తించాలి. ముఖ్యంగా రోడ్లు దాటేందుకు అండర్‌పాస్‌లు లేదా ఫుట్‌బ్రిడ్జ్‌లు ఉంటే వాటిని వినియోగించుకోవాలని తల్లిదండ్రులు పిల్లలను ప్రోత్సహించాలి. అప్పుడే రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చు. లేదంటే ఏ మాత్రం ఏమరపాటుగా ఉన్నా.. తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది.

దేశంలో వివిధ ప్రాంతాల్లో రోడ్డు దాటేందుకు అండర్‌పాస్‌లు మరియు ఫ్లైఓవర్‌లు నిర్మించారు. కానీ చాలా మంది వాటిని ఉపయోగించడం లేదు. బదులుగా కొన్ని చోట్ల వీటిని వ్యాపార సముదాయాలుగా మార్చేశారు. ఆఫీస్ కి, స్కూల్ కి ఆలస్యమవుతుందని ముందూ వెనుకా చూసుకోకుండా రోడ్డు దాటడం కారణంగానే ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయి. కాబట్టి సమయం కన్నా ప్రాణం ముఖ్యమని గుర్తుంచుకోవాలి.

More from DriveSpark

Article Published On: Saturday, September 2, 2023, 15:30 [IST]
English summary
School girl escaped from road accident cyberabad police released cctv visual
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+