అర్ధరాత్రి సైంటిస్ట్‌పై దాడి.. కత్తులతో వెంబడించి కారు అద్దాలు పగలగొట్టిన దుండగులు..
ఇటీవల రోడ్ రేజ్ ఘటనలు దేశవ్యాప్తంగా ఎక్కడో ఓ చోట నమోదవుతూనే ఉన్నాయి. వాహనాల్లో వెళ్తున్న వారిని కొందరు దుండగులు వెంబడించి దాడి చేస్తుండగా.. మరికొందరు రోడ్డుపైనే ఆవేశంతో తోటి వాహనదారులతో గొడవకు దిగుతున్నారు. ఇటీవల రోడ్ రేజ్ ఘటన ఒకటి బెంగళూరులో చోటుచేసుకుంది.
కర్ణాటక రాజధాని బెంగళూరులో ఆదివారం జరిగిన మరో రోడ్ రేజ్ ఘటన ఆందోళన కలిగిస్తోంది. దుండగులు వెంబడించి దాడికి పాల్పడింది మరెవరో కాదు ఓ శాస్త్రవేత్తపై.. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఘటనపై ఆవేదన వ్యక్తం చేస్తూ పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

సెంటర్ ఫర్ నానో అండ్ సాఫ్ట్ మేటర్ సైన్సెస్ లో పని చేస్తున్న సైంటిస్ట్ అశుతోష్ సింగ్.. బెంగళూరులోని రౌతనహల్లి ఏరియాలో కారులో వెళుతుండగా కొందరు గూండాలు తనను వెంబడించి దాడికి పాల్పడినట్లు ఆయన చెప్పారు. దుండగులు తన కారును ధ్వంసం చేశారని, ఆ తర్వాత వారు కత్తులతో వెంబడించారని అశుతోష్ ఎక్స్X(ట్విట్టర్) వేదికగా పేర్కొన్నారు.
"ఆగస్టు 24, 12:45 AM సమయంలో రౌతనహళ్లి ప్రధాన రహదారి వద్ద స్థానిక గూండాలు నన్ను వెంబడించారు. వారి నుంచి తృటిలో తప్పించుకున్నాను. వారు నా కారును ఆపడానికి ప్రయత్నించారు. కత్తులతో నన్ను వెంబడించారు. అంతేకాకుండా కారు వెనుక అద్దాన్ని పగులగొట్టారు'. అని Xలో పేర్కొన్నారు.
కాగా దుండగులు వెంబడిస్తుండటంతో పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సైంటిస్ట్ తెలిపారు. కానీ వారు చాలా ఆలస్యంగా స్పందించారని వెల్లడించారు. న్యాయం చేయాలని కోరుతూ సోమవారం మదనాయకనహళ్లి పీఎస్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు వెల్లడించారు. తక్షణ చర్య అవసరమన్నారు.
ఘటనపై కర్నాటక అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ట్రాఫిక్ అండ్ సేఫ్టీ) అలోక్ కుమార్ దీనిని 'తీవ్రమైన సంఘటన' గా పేర్కొన్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కాగా దీనిపై బెంగళూరు పోలీస్ కమిషనర్ బి. దయానంద మాట్లాడారు.
కర్నాటక రాజధానిలో ఇలాంటి ఘటనలకు పాల్పడిన నిందితులపై రౌడీషీట్‌ను తెరుస్తామని సీపీ అన్నారు. గత కొన్ని నెలలుగా, సోషల్ మీడియా ద్వారా అనేక రోడ్ రేజ్ సంఘటనలు వెలుగులోకి వచ్చాయని తెలిపారు. నిందితులను పట్టించడంలో కారు లోపల ఉన్న డాష్ కెమెరాలు దోహదపడుతున్నాయని వెల్లడించారు.
అంతకుముందు ట్విట్టర్లో నెటిజన్లతో దయానంద చాట్ చేస్తూ.. చట్ట విరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడే పోకిరీలను ట్రాక్ చేస్తున్నట్లు తెలిపారు. రోడ్డు రేజ్ సంఘటనలు ఎక్కువయ్యాయని, ఎక్కడెక్కడ ఇలాంటి సంఘటనలు జరిగినా పోలీసులు నిందితులను గుర్తించి కేసులు పెడుతున్నట్లు తెలిపారు. అంతేకాకుండా ఇలాంటి పోకిరీలపై నిఘా పెట్టేందుకు సంబంధిత పోలీస్ స్టేషన్లలో రౌడీషీట్లు తెరుస్తున్నట్లు చెప్పారు.
బెంగుళూరు నగరంలో రోడ్ రేజ్ సంఘటనలకు సహించేది లేదని ఆయన ట్వీట్ చేశారు. ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో 112కు కాల్ చేయాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పౌరులు అటువంటి పరిస్థితిలో చిక్కుకున్నట్లయితే #Namma112 డయల్ చేయవలసిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తాము ఉన్నామని నిశ్చింతగా ఉండాలని ట్వీట్ చేశారు.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్ కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








