రూ.12 కోట్లు విలువ చేసే మెక్‌లారెన్‌ కారుని వెంబడించిన కుర్రాళ్లు.. కట్‌ చేస్తే సీన్‌ రివర్స్‌!!

మెక్‌లారెన్‌ 765 ఎల్‌టీ కూపే లగ్జరీ కారుని స్కూటర్‌ ఢీకొట్టింది. దీనికి సంబధించిన వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. సాధారణంగా కోట్లాది రూపాయల విలువైన సూపర్‌కార్లను ఎవరైనా చూసినప్పుడు ఆశ్యర్యపోవడం సర్వసాధారణం. ఇలాంటి కార్లు కనిపిస్తే బైకర్లు ఇంకా రెచ్చిపోయి వెంబడిస్తారు.

అయితే, కొన్ని సందర్భాల్లో బైకర్లు లేదా ఇతర వాహనదారులు సూపర్‌ లగ్జరీ కార్లను వెంబడించడం వల్ల ఆ యజమానులకు ఇబ్బందిగా ఉంటుంది. అందుకే వారు ఎక్కువగా సెక్యూరిటీ గార్డులతో కలిసి రోడ్లపై దర్శనమిస్తారు. ఇటీవల, ఓ సూపర్‌కార్ యజమాని బెంగళూరు నగరంలో ప్రయాణిస్తుండగా ఊహించని విధంగా యాక్సిడెంట్‌ జరిగింది. సదరు లగ్జరీ కారుని ఓ స్కూటర్ రైడర్‌ వెనక నుంచి ఢీ కొట్టాడు.

Scooter--Crashes-Into-MCLaren

ఆ కారు యొక్క ఖరీదు అక్షరాల రూ. 12 కోట్లు. అంతటి విలువైన కారుని రెప్పపాటులో కారు వెనకే ఫాలో అవుతున్న వ్యక్తి స్కూటర్‌తో ఢీకొట్టాడు. అయితే ఈ ప్రమాదానికి ముఖ్య కారణం స్కూటర్‌ వెనకాలే వస్తున్న KTM బైక్‌ అతివేగంగా వచ్చి ఢీ కొడుతుంది. వెంటనే స్కూటర్‌ సూపర్‌ లగ్జరీ కారుని తాకిన విజువల్స్‌ గమనించవచ్చు. ఈ వీడియోను విహాన్ రామచంద్ర అనే వ్యక్తి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశాడు.

కేవలం మూడు సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోలో మెక్‌లారెన్ 765 ఎల్‌టి (McLaren 765 LT) సూపర్‌కార్‌ సింగిల్-లేన్ రోడ్‌లో వెళ్తున్నట్లు గమనించవచ్చు. కానీ ఆ రోడ్డు చాలా రద్దీగా ఉండటంతో స్కూటర్ రైడర్ సూపర్ కార్ వెనుక భాగాన్ని ఢీకొడతాడు. కుర్రాళ్ల అత్యుత్సాహం ఈ ప్రమాదానికి కారణం అని అక్కడి వారు విమర్శించారు. ఆ కారుని వెంబడించడం వల్లే ప్రమాదం జరిగినట్లు వారు తెలియజేశారు.

Scooter--Crashes-Into-MCLaren

మెక్‌లారెన్ 765 LT యజమాని రంజిత్ సుందర్‌మూర్తిని సాధారణంగా RSM అని పిలుస్తారు. కర్నాటకలోని బెంగళూరులో నివసించే వ్యాపారవేత్త. ప్రస్తుతం అతను దుబాయ్‌కి షిఫ్ట్ అయ్యాడు. కొన్న ప్రత్యేక సందర్భాల్లో తన గ్యాలరీలోని సూపర్ కార్లతో బెంగళూరులో దర్శనమివ్వడం అతడికి అలవాటు. తాజాగా దుబాయ్ నుంచి మెక్‌లారెన్ 765 LT కూపేని బెంగళూరుకి తీసుకువచ్చాడు.

ఈ ప్రత్యేకమైన సూపర్‌కార్‌లో చాలా సందర్భాలలో నగరం చుట్టూ తిరుగుతూ కెమెరాకు చిక్కాడు. ఈ వాహనం చూట్టూ ప్రొటెక్షన్‌ కోసం టయోటా ఇన్నోవా MPVలు ఎస్కార్ట్‌గా ఉంటాయి. RSM బెంగళూరు పుర వీధుల్లో సెక్యూరిటీ గార్డులతో తిరుగతూ కనిపించిన వీడియోలపై నెటిజన్లు తమదైన శైలిలో విమర్శలు గుప్పించారు. తన సంపదను ప్రదర్శిస్తూ ఫ్రీగా పబ్లిసిటీ చేసుకుంటున్నాడని కొందరు.. తనకంటూ ప్రత్యేకతను చాటుకోవడం కోసం మరో శైలిలో స్టంట్స్‌ చేస్తున్నాడని మరికొందరు విమర్శిస్తున్నారు.

Scooter--Crashes-Into-MCLaren

తన ఖరీదైన కార్లు ఏదైనా ఫ్యూయల్‌ స్టేషన్‌లో లేదా ట్రాఫిక్ సిగ్నల్‌లో ఆగినప్పుడు ఈ ఎస్కార్ట్‌ వాహనాలు ఆ కారుని చుట్టుముడతాయి. బెంగళూరు నగరం చుట్టూ ఇంత ఖరీదైన వాహనం తిరుగుతున్నప్పుడు సెక్యూరిటీ గార్డులు చేసే హడావిడి ట్రాఫిక్‌ని క్రియేట్‌ చేస్తుందని మరికొందరు కామెంట్స్‌ చేస్తున్నారు.

మెక్‌లారెన్ 720S సూపర్‌కార్ ట్రాక్-ఫోకస్డ్ వెర్షన్. ఇది ప్రస్తుతం ఉన్న సూపర్‌ లగ్జరీ కార్లలో మరో అత్యంత వేగవంతమైన కారు. మెక్‌లారెన్ 765 LT స్పైడర్ 4.0-లీటర్ ట్విన్-టర్బోచార్జ్డ్ V8 పెట్రోల్ ఇంజన్‌తో వస్తుంది. ఈ ఇంజన్ గరిష్టంగా 765 PS శక్తిని మరియు 800 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 7-స్పీడ్ సీక్వెన్షియల్ గేర్‌బాక్స్‌తో జత చేయబడింది. నాలుగు చక్రాలకు పవర్‌ పంపబడుతుంది. McLaren 765 LT 765 కొన్ని యూనిట్లకు మాత్రమే పరిమితం చేయబడింది.

More from DriveSpark

Article Published On: Tuesday, February 6, 2024, 20:52 [IST]
English summary
Scooter hits mclaren 765lt in bangalore visuals gone viral
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+