పాత వాహనాన్ని చెత్త క్రింద పారేస్తే రోడ్డు టాక్స్‌లో 25 శాతం రిబేటు

పాత వాహనాలను స్క్రాప్ చేస్తే, కొత్త వాహనాల కొనుగోలుపై రోడ్డు పన్నులో రాయితీలను ఇస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మన దేశంలో 15 నుండి 20 ఏళ్లకు పైబడిన వాహనాలను స్క్రాప్ చేయాలాని కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఓ ప్రతిపాదనను తెరపైకి తీసుకువచ్చిన సంగతి తెలిసినదే.

పాత వాహనాన్ని చెత్త క్రింద పారేస్తే రోడ్డు టాక్స్‌లో 25 శాతం రిబేటు

ఇందుకు సంబంధించి స్వచ్ఛంద వాహన స్క్రాపింగ్ విధానాన్ని కేంద్రం ఇటీవలి బడ్జెట్‌లో కూడా ప్రస్థావించింది. కాగా, ఇప్పుడు పాత వాహనాలను స్క్రాప్ చేసిన వాహన యజమానులకు కొత్త వాహనం కొనుగోలుపై కేంద్ర ప్రభుత్వం రోడ్డు పన్నులో 25 శాతం తగ్గింపును ఇవ్వనున్నట్లు తెలిపింది.

పాత వాహనాన్ని చెత్త క్రింద పారేస్తే రోడ్డు టాక్స్‌లో 25 శాతం రిబేటు

ఈ మేరకు, కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ వాహన స్క్రాపేజ్ విధానం కింద అందించబోయే ప్రయోజనాల గురించి లోక్‌సభలో వివరించారు. రానున్న రోజుల్లో వెహికల్ స్క్రాపేజ్ విధానం పూర్తిగా అమలు చేయబడుతుందని తెలిపారు.

పాత వాహనాన్ని చెత్త క్రింద పారేస్తే రోడ్డు టాక్స్‌లో 25 శాతం రిబేటు

ఇలా పాత వాహనాన్ని స్క్రాప్ చేసిన వాహన యజమానులకు 'స్క్రాపింగ్ సర్టిఫికేట్' ఇస్తామని, తద్వారా వారు కొత్త కార్లపై లభించే ప్రయోజనాలను సద్వినియోగం చేసుకోవచ్చని గడ్కరీ చెప్పారు. స్క్రాపింగ్ సర్టిఫికేట్ తీసుకునే ప్రైవేట్ కార్ల యజమానులకు కొత్త వాహనం యొక్క రోడ్ టాక్స్‌లో 25 శాతం వరకూ తగ్గింపును అందించనున్నారు.

పాత వాహనాన్ని చెత్త క్రింద పారేస్తే రోడ్డు టాక్స్‌లో 25 శాతం రిబేటు

అదే సమయంలో, వాణిజ్య వాహనాల విషయంలో ఈ రిబేటును 15 శాతంగా నిర్ణయించారు. అంటే, స్క్రాప్ చేయబడిన వాణిజ్య వాహనాల యజమానులకు కొత్త వాణిజ్య వాహనం కొనుగోలుపై రోడ్ టాక్స్‌లో 15 శాతం డిస్కౌంట్‌ను అందిస్తారు.

పాత వాహనాన్ని చెత్త క్రింద పారేస్తే రోడ్డు టాక్స్‌లో 25 శాతం రిబేటు

భారతదేశంలో ప్రైవేటు వాహనాలను స్క్రాప్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం 20 సంవత్సరాల కాలపరిమితిని నిర్ధారించగా, వాణిజ్య వాహనాలకు 15 సంవత్సరాల కాలపరిమితిని నిర్ణయించింది. ఈ వ్యవధిని దాటిన తరువాత, వాహనాల రిజిస్ట్రేషన్ ఆటోమేటిక్‌గా ముగిసిపోతుంది.

పాత వాహనాన్ని చెత్త క్రింద పారేస్తే రోడ్డు టాక్స్‌లో 25 శాతం రిబేటు

ఈ కాలపరిమితిని మించిన వాహనాలు కాలుష్యానికి ప్రధాన కారణం అవుతాయని ప్రభుత్వం అభిప్రాయపడింది. ఇటువంటి వాహనాలలో ఉండే ఇంజన్లు పెద్ద మొత్తంలో కార్బన్ డయాక్సైడ్ మరియు ఇతర విష వాయువులను విడుదల చేస్తాయి.

పాత వాహనాన్ని చెత్త క్రింద పారేస్తే రోడ్డు టాక్స్‌లో 25 శాతం రిబేటు

ఒక నిర్దిష్ట కాలపరిమితి నిండిన వాహనాలను స్క్రాప్ చేసే విధానం ఇప్పటికే పలు దేశాలలో అమల్లో ఉంది. ఇందుకోసం ప్రత్యేకంగా స్క్రాపింగ్ యార్డులు మరియు రీసైక్లింగ్ ఫ్యాక్టరీలు కూడా నెలకొల్పబడి ఉన్నాయి. స్క్రాప్ చేసిన వాహనాల నుండి ఇనుము మరియు ఇతర ఉపయోగ వస్తువులను వేరు చేసి, వాటిని తిరిగి కొత్త వాటి కోసం రీసైక్లింగ్ చేయటం జరుగుతుంది.

పాత వాహనాన్ని చెత్త క్రింద పారేస్తే రోడ్డు టాక్స్‌లో 25 శాతం రిబేటు

ఈ విధానం వలన పాత కార్ల స్థానాన్ని కొత్త కార్లు భర్తీ చేస్తాయి. ఫలితంగా, పాత వాహనాల ద్వారా విడుదలయ్యే కాలుష్యం తగ్గుతుంది మరియు దేశంలో కొత్త వాహనాల వ్యాపారం కూడా మందగించదు. కేంద్రం ప్రకటించిన కొత్త వెహికల్ స్క్రాపింగ్ విధానంలో, తమ పాత వాహనాన్ని స్క్రాప్ చేసిన వారికి కొత్త వాహనం యొక్క రహదారి పన్నులో మినహాయింపుతో పాటు, కొత్త వాహనం ధరలో 4-6 శాతం స్క్రాప్ విలువను కూడా సదరు కారు యజమానికి ఇవ్వబడుతుంది.

పాత వాహనాన్ని చెత్త క్రింద పారేస్తే రోడ్డు టాక్స్‌లో 25 శాతం రిబేటు

అంతే కాకుండా, వెహికల్ స్క్రాపింగ్ సర్టిఫికెట్ ఉన్న వినియోగదారులకు కొత్త కార్లపై 5 శాతం తగ్గింపు కూడా అందించాలని వాహన తయారీ సంస్థలకు కూడా సూచించడం జరిగింది. పాత వాహనాల స్థానంలో కొత్త మరియు ఇంధన సామర్థ్యం గల వాహనాలను ప్రవేశపెట్టడంతో, తక్కువ ఇంధన వినియోగం ఉంటుంది, దీని కారణంగా ప్రభుత్వం చమురు దిగుమతులను కూడా తగ్గించుకునే అవకాశం ఉంటుంది.

పాత వాహనాన్ని చెత్త క్రింద పారేస్తే రోడ్డు టాక్స్‌లో 25 శాతం రిబేటు

సుమారు 50,000 ఉద్యోగ అవకాశాలను కల్పించే ఈ స్క్రాపింగ్ విధానం కోసం కేంద్ర ప్రభుత్వం రూ.10,000 కోట్ల పెట్టుబడులను వెచ్చించనుంది. ఈ విధానం ద్వారా సుమారు 1 కోటి పాత హెవీ, మీడియం మరియు తేలికపాటి వాహనాలు స్క్రాప్ చేయబడుతాయని భావిస్తున్నారు.

Most Read Articles

English summary
Scrap Your Old Vehicle And Get Upto 25 Percent Rebate On Road Tax Of New Vehicle. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X