స్క్రూడ్రైవర్‌తో నడిచే ఈఎక్స్ త్రీవీలర్
స్క్రూడ్రైవర్‌తో ఏం చేస్తాం? అదేం ప్రశ్న, స్క్రూడ్రైవర్‌తో స్క్రూలు బిగిస్తాం/ఊడదీస్తాం. అంతకంటే ఇంకేం చేస్తాం అంటారా? స్క్రూడ్రైవర్‌తో నడిచే వాహనం గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? ఆశ్చర్యంగా ఉంది కదూ. ఇప్పుడు మనం చెప్పుకోబోయేది దాని గురించే.
నిల్స్ ఫెర్బెర్ తన స్నేహితులు సెబాస్టియన్ ఔరే, రూబెనో ఫేబర్ మరియు లుడోల్ఫ్ వోన్ ఓల్డెర్‌షైసెన్‌ల సాయంతో ఓ అద్భుతాన్ని సృష్టించాడు. అదే స్క్రూడ్రైవర్‌తో నడిచే త్రిచక్ర వాహనం. ప్రముఖ విడిభాగాలు, యంత్రాల తయారీ సంస్థ బోష్ అందిస్తున్న ఎలక్ట్రిక్ స్క్రూడ్రైవర్లను (డ్రిల్ మెషీన్ల మాదిరిగా ఉండేవి) ఉపయోగించి ఓ ట్రైసైకిల్ లాంటి వాహనాన్ని తయారు చేశారు.
ఈ త్రిచక్ర వాహనం పేరు 'ఈఎక్స్'. దీనిని ట్రాన్స్‌పోర్ట్ వాహనాలకు ప్రత్యామ్నాయంగా కాకుండా, కేవలం సరదా కోసం మాత్రమే దీనిని తయారు చేశారు. ఇందులో రెండు ఎలక్ట్రిక్ స్క్రూడ్రైవర్లను ఉపయోగించారు. ఈ రెండింటికి 2 చిన్న గేర్ వీల్స్ ఉండి, వాటిని సైకిల్ చైన్ లాంటి చైన్ సాయంతో వెనుక చక్రానికి అమర్చిన పెద్ద గేర్ వీల్‌కు కనెక్ట్ చేయబడి ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ స్క్రూడ్రైవర్లు బ్యాటరీ పవర్‌తో పనిచేస్తాయి.
ఇందులో ముందువైపు రెండు చిన్న చక్రాలు, వెనుక వైపు ఓ పెద్ద చక్రం, హ్యాండిల్, బ్రేక్స్ ఉంటాయి. సైకిళ్లలో ఉపయోగించే కొన్ని విడిభాగాలను ఇందులో ఉపయోగించారు. ఈ వాహన గరిష్ట వేగం గంటకు 30 కిలోమీటర్లు. మరి స్క్రూడ్రైవర్‌తో నడిచే ఈ త్రిచక్ర వాహనం హైలైట్స్ ఏంటో ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలిద్దామా..!











Click it and Unblock the Notifications








