ఆస్ట్రేలియన్ మోటోజిపిలో లొరెంజ్ బైక్‌లో ఇరుక్కుపోయిన పక్షి
ఇటీవల జరిగిన ఆస్ట్రేలియన్ మోటోజిపి బైక్ రేస్‌లో చిన్న అపశృతి చోటు చేసుకుంది. ఈ రేస్ సమయంలో బైక్ వేగంగా నడుపుతున్న జార్జ్ లొరెంజ్ సూపర్‌బైక్‌లో ఓ పక్షి ఇరుక్కుపోయి ప్రాణాలు పోగొట్టుకుంది. ఆస్ట్రేలియన్ మోటోజిపి క్వాలిఫైయింగ్ సెషన్ సందర్భంగా, ఫిలిప్ ఐల్యాండ్ సర్క్యూట్‌పై తన యమహా బైక్‌తో సవారీ చేస్తున్నప్పుడు ఈ సంఘటన చోటు చేసుకుంది. (క్రింది వీడియోలో చూడొచ్చు).
ఈ రేస్ ట్రాక్‌పై ఉన్న సీగల్ పక్షి బైక్ వేగాన్ని గుర్తించి గాల్లోకి ఎగిరిపోదామని ప్రయత్నించింది. అయితే, దాని వేగం కన్నా బైక్ ఇంకా ఎక్కువ వేగంతో రావటం వలన అది బైక్ రేడియటర్‌లో ఇరుక్కుపోయింది. అదృష్టవశాత్తు ఈ ఘటనలో రేసర్ లొరెంజోకు ఎలాంటి ప్రమాదం సంభవించలేదు, అయితే సీగల్ పక్షి మాత్రం ప్రాణాలు విడిచింది.
తరచూ రేస్‌లు జరిగే ఇలాంటి రేస్ ట్రాక్‌లపై సరైన మెయింటినెన్స్ లేకపోవటం వలనే ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఈ ఘటనను చూసిన పక్షి ప్రేమికులు మాత్రం అయ్యో పాపం పాలపిట్ట అని బాధపడుతున్నారు.
<center><center><center><iframe width="100%" height="450" src="//www.youtube.com/embed/X5_gbdYxMWM?rel=0" frameborder="0" allowfullscreen></iframe></center></center></center>


Click it and Unblock the Notifications








