సీటెల్ రెడ్ బుల్ సోప్‌బాక్స్ ఛాలెంజ్
ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అయిన ప్రముఖ బెవరేజ్ కంపెనీ రెడ్ బుల్ (ఎనర్జీ డ్రింక్) వివిధ రకాల మోటార్‌స్పోర్ట్‌లతో పలు కార్యక్రమాలను కూడా నిర్వహిస్తూ ఉంటుంది. తమ బ్రాండ్‌ను ప్రమోట్ చేసుకోవటంతో పాటుగా వీక్షకులకు, కార్యక్రమాలలో పాల్గొనే వారికి వినోదం కల్పించేలా రెడ్ బుల్ కొన్ని ఫన్నీ ఈవెంట్స్ ఆర్గనైజ్ చేస్తుంటుంది.
అలాంటి ఓ ఫన్నీ ఈవెంటే ఈ 'సోప్ బాక్స్ చాలెంజ్'. ఈ ఏడాది రెడ్ బుల్ సోప్ బాక్స్ చాలెంజ్‌ను సీటెల్‌లో నిర్వహించారు. కేవలం సరదా కోసం మాత్రమే ఈ సోప్ బాక్స్ రేస్ లేదా చాలెంజ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఇందులో పాల్గొనే వారు, తాము స్వతహాగా తయారు చేసుకున్న విచిత్రమైన వాహనాలతో ఎక్కడా పడిపోకుండా చివరి వరకూ చేరుకోవాల్సి ఉంటుంది.
అయితే, ఇది అనుకున్నంత సులువేం కాదు, పోటీదారులు ఈ రేస్ ట్రాక్‌పై ఉండే అనేక అవాంతరాలను అధిగమించి, ఫినిషింగ్ లైన్‌ను చేరుకోవాలి. రేస్ మధ్యలో పడిపోయినా, వాహనం విరిగిపోయినా, లేదా ఏదైనా అవాంతరాన్ని ఢీకొట్టినా వారు డిస్‌క్వాలిఫై అవుతారు. చిత్రమైన వాహనాలతో, అంతే విచిత్రమైన వేషధారణతో అభ్యర్థులు చేసే విన్యాసాలు అందరికీ నవ్వు తెప్పిస్తాయి. ఆ సరదాని మనం కూడా ఈ వీడియో రూపంలో ఎంజాయ్ చేద్దాం రండి.
<center><iframe width="100%" height="450" src="//www.youtube.com/embed/3jcu4ryMm0I?rel=0" frameborder="0" allowfullscreen></iframe></center>


Click it and Unblock the Notifications








