Acer FASTER అవార్డులు ప్రకటన.. ఏయే కార్లు, బైక్‌లకు అవార్డులు వచ్చాయంటే?
FASTER రెండో ఎడిషన్ అవార్డుల వేడుక (Acer faster Awards 2023) మే 3వ తేది బుధవారం అట్టహాసంగా జరిగింది. గురుగ్రామ్‌లోని ఒరానా కన్వెన్షన్ హాల్‌లో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. రవిన్ కుందు ఈ కార్యక్రమానికి హోస్ట్‌గా వ్యవహరించారు. ఏసర్ ఫాస్టర్ అవార్డులు 2023లో TVS రోనిన్ బైక్ ఆఫ్ ది ఇయర్‌గా నిలిచింది. హ్యుందాయ్ టక్సన్ కార్ ఆఫ్ ది ఇయర్‌గా గెలుపొందింది.
Acer FASTER Awards 2023 విజేతలు
- కార్ ఆఫ్ ది ఇయర్ : హ్యుందాయ్ టక్సన్
- బైక్ ఆఫ్ ది ఇయర్ : TVS రోనిన్
- ప్రీమియం కార్ ఆఫ్ ది ఇయర్ : మెర్సిడెస్ బెంజ్ EQS
- EV ఆఫ్ ది ఇయర్ : కియా EV6
- ఆటో టెక్ ఆఫ్ ది ఇయర్ : హోండా సిటీ e: HEV (strong Hybride Powertrain)
- ఇండస్ట్రీ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ : రాజేష్ జెజురికర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ & సీఈవో (ఆటో & Farm) మహీంద్రా గ్రూప్
- మోటార్ స్పోర్ట్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ : జెహన్ దరువాలా (F2 డ్రైవర్ & రిజర్వ్ డ్రైవర్- మహీంద్రా రేసింగ్ ఫార్ములా E టీం)
- CSR ఇనిషియేటివ్స్ ఆఫ్ ది ఇయర్ : హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్
- కార్పొరేట్ కమ్యూనికేషన్స్ టీం ఆఫ్ ది ఇయర్ : మారుతీ సుజుకీ ఇండియా లిమిటెడ్
- PR టీం ఆఫ్ ది ఇయర్ : ఫస్ట్ పాట్నర్స్
- ఆటో యాడ్ క్యాంపెయిన్ ఆఫ్ ది ఇయర్ : టాటా కజిరంగా ఎడిషన్

ఏప్రిల్ 12, 13 తేదీల్లో నేవీ ముంబయిలో పోటీదారులందరికీ ట్రయల్స్ నిర్వహించారు. అనంతరం బుధవారం గురుగ్రాంలో విజేతను ప్రకటించి, అవార్డుల ప్రదానోత్సవం నిర్వహించారు. ఏసర్ ఫాస్టర్ అవార్డుల జ్యూరీలో డిజిటల్ మీడియాల నుంచి సీనియర్ జర్నలిస్టులు ఉన్నారు. వారి పబ్లికేషన్లను సుమారు 250 మిలియన్ యాజర్లను చేరుకుంటాయి.

Acer FASTER Awards 2023 జ్యూరీ సభ్యులు
- అమిత్ చంగాని - ఎడిటర్, మోటరాయిడ్స్
- ఆయుష్ జైన్ - ఎడిటర్, ఇండియన్ టార్క్
- గౌరవ్ యాదవ్ - ఎడిటర్ గాడివాడి
- జోబో కురివిల్లా - ఎడిటర్ డ్రైవ్‌స్పార్క్
- నరేంద్ర శర్మ- ఎడిటర్, GearFliQ
- రోహిత్ ఖురానా- కార్‌బ్లాగ్‌ఇండియా
- రోషన్ జోసెఫ్ - ఎడిటర్, పైలట్ ఆన్ వీల్స్
మరో జ్యూరీ సభ్యుడు, స్మార్ట్‌డ్రైవ్ ఎడిటర్ జైజు M. నాయర్ కొన్ని ప్రత్యేక పరిస్థితుల కారణంగా హాజరుకాలేకపోయారు.
విశ్వసనీయమైన, బాగా పరిశోధించబడిన కంటెంట్ అందించే ఆన్‌లైన్ ఆటోమోటివ్ మీడియా వ్యక్తులను ఒకేచోటికి చేర్చడం చాలా అవసరమని FASTER అవార్డుల ఛైర్మన్, మోటరాయిడ్స్ ఎడిటర్ అమిత్ చంగాని అన్నారు. సెన్సెషనల్, తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేసే వ్యక్తులను వేరుచేయడం అంతే ముఖ్యమని తాము విశ్వసిస్తామన్నారు. నాణ్యమైన కంటెంట్‌ను అందించే వ్యవస్థలను ఇందులోకి తీసుకురావాలనుకుంటున్నట్లు చెప్పారు. నాణ్యమైన, విశ్వసనీయమైన కంటెంట్‌ను ప్రేక్షకులకు అందించేందుకు నిరంతరం కృషిచేస్తామని చెప్పారు.

భారత ఆటోమోటివ్ పరిశ్రమలో నాణ్యతకు ప్రతీక అయిన ఫాస్టర్ అవార్డుల విజేతలను ప్రకటించడం ఎంతో ఆనందంగా ఉందని డ్రైవ్‌స్పార్క్ ఎడిటర్, జ్యూరీ సభ్యుడు జోబో కురివిల్లా తెలిపారు. కఠినమైన పరీక్షలు, విస్తృతమైన సమాచార సేకరణ ప్రక్రియ ద్వారా ఉత్తమ వాహనాలు మాత్రమే అగ్రస్థానానికి చేరుకున్నాయని తాను నిర్ధారణకు వచ్చినట్లు తెలిపారు. ఆన్‌లైన్ ఆటోమీడియో వ్యవస్థలోని విశ్వసనీయ, ప్రభావవంతమైన పేర్లను జ్యూరీ సభ్యులుగా ఉండడం ఎంతో గర్వకారణమన్నారు. Acer FASTER అవార్డుల కార్యక్రమం భారత ఆటోమొబైల్ రంగం కృషి, అంకితభావానికి నిజమైన వేడుకని ఆయన తెలిపారు.


Click it and Unblock the Notifications








