ఈ సీక్రెట్ తెలుసా.. కొంత మంది విమాన ప్రయాణికులు చివరి బోర్డింగ్ కాల్ వరకు ఎందుకు వేచి ఉంటారో?
మీరు ఎప్పుడైనా విమాన ప్రయాణం (Flight Journey) చేశారా.. అయితే ప్రయాణికుల్లో కొంత మంది చివరి బోర్డింగ్ కాల్ వచ్చినప్పుడు మాత్రమే విమానం ఎక్కడం మనం చూశాం. అయితే చివరి కాల్ వరకు విమానం ఎక్కేందుకు ఎందుకు వేచిచూస్తారు? అయితే దీని వెనుక ఉన్న రహస్యం ఏంటి?
విమానంలో ప్రయాణించిన ప్రతి ఒక్కరికీ బోర్డింగ్ కాల్‌పై అవగాహన ఉంటుంది. విమాన ప్రయాణికులు ఎయిర్‌బోర్డులోకి ప్రవేశించిన అనంతరం బోర్డింగ్ పాస్ తీసుకొని, సెక్యూరిటీ తనిఖీలు పూర్తి చేయించుకోవాలి. అనంతరం తమకు కేటాయించిన గేట్ వద్దకు వెళ్లి ప్లైట్ ఎక్కాలి. ఇది స్టాండర్డ్ ప్రక్రియ.

అయితే విమాన ప్రయాణికుల్లో కొందరు బోర్డింగ్ పాస్ తీసుకొని సెక్యూరిటీ తనిఖీలు చేయించుకొని ప్లైట్‌లోకి వెళ్లకుండా ఎయిర్‌పోర్టులోనే తిరుగుతుంటారు. వారికోసం బోర్టింగ్ కాల్ వచ్చినా వెళ్లకుండా.. చివరి బోర్డింగ్ కాల్ వరకు అటు ఇటు తిరుగుతూ ఉంటారు. చివరి బోర్డింగ్ కాల్ వచ్చాకనే ఫ్లైట్ దగ్గరకి వెళ్తారు.
సాధారణంగా ఇలా చాలా మంది చేస్తుంటారు. అయితే ఇలా ఎందుకు చేస్తుంటారో తెలుసా దీని వెనుక ఉన్న రహస్యం ఏంటో తెలుసా.. ఇలా చివరి బోర్డింగ్ కాల్ వరకు వేచిచూసి వెళ్లడం వల్ల కొన్ని ప్రయోజనాలున్నాయి. ఈ కారణంగానే ఉద్దేశపూర్వకంగానే చాలా మంది ప్రయాణికులు వ్యవహరిస్తుంటారు.

క్యూలో వేచి ఉండే అవసరం ఉండదు : బోర్డింగ్ పాస్ తీసుకున్నాక, భద్రతా తనిఖీలు పూర్తి చేసుకున్నాక బోర్డింగ్‌కు వెళితే.. అక్కడ రద్దీగా ఉంటుంది. అందువల్ల వెంటనే వెళ్తే ఆ క్యూలో నిల్చోవలసి ఉంటుంది. అదే చివరి బోర్డింగ్ కాల్ వరకు వేచి ఉంటే, అసలు క్యూలో వేచి ఉండే అవసరం ఉండదు. నేరుగా వెళ్లిపోవచ్చు.
అదనపు లగేజీ తీసుకెళ్లేందుకు అవకాశం : సాధారణంగా విమాన ప్రయాణికులకు కొంత లగేజీ వరకు మాత్రమే వెంట తీసుకెళ్లేందుకు అనుమతి ఇస్తారు. ఎక్కువ లగేజీని అనుమతించరు. అయితే చివరి బోర్డింగ్ కాల్ వరకు వేచిచూస్తే.. అధిక లగేజీని తీసుకెళ్లేందుకు అనుమతించే అవకాశం ఉంటుంది.

చివరి నిమిషంలో వెళ్తే నచ్చిన సీట్లో కూర్చొవచ్చు.. ! : చాలా మంది విమాన ప్రయాణికులు.. ఫ్లైట్‌లోకి వెళ్లాక.. సిబ్బందికి చెప్పి సీటు మార్చుకుంటారు. బోర్డింగ్ సమయంలో ఇవి జరుగుతుంటాయి. కొన్నిసార్లు చివరి నిమిషంలో వెళ్లినప్పుడు ఖాళీగా ఉన్న మంచి సీట్లు పొందేందుకు అవకాశం ఉంటుంది.
అయితే ఇలా చివరి బోర్డింగ్ కాల్ వరకు వేచి ఉండాల్సి వస్తే కొన్ని ముఖ్యమైన అంశాలు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. విమానం బయలుదేరడానికి కనీసం 30 నిమిషాల ముందు సెక్యూరిటీ తనిఖీలు పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది అనంతరం గేటు వద్దకు వెళ్లి చివరి బోర్డింగ్ కాల్ వరకు వేచి ఉండవచ్చు.

తరచుగా విమాన ప్రయాణాలు చేసేవారికి బోర్డింగ్ పాస్ తీసుకోవడం నుంచి సెక్యూరిటి తనిఖీలు సహా ఇతర అంశాలపై స్పష్టత ఉంటుంది. అదే కొత్త వారు అయితే ఇలాంటి ప్రయోగాలు చేయకూడదు. విమానాశ్రయంలో ఈ ప్రక్రియపై సరైన అవగాహన లేక ఫ్లైట్ మిస్ అయ్యే అవకాశం ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








