భూకంపాలు కూడా బుల్లెట్ రైలును ఏం చేయలేవు.. ఇందుకోసం ఏ టెక్నాలజీని వినియోగిస్తున్నారో తెలుసా?
భారత్‌లో తొలిసారిగా ముంబై- అహ్మదాబాద్ మధ్య బుల్లెట్ రైలును నిర్మాణం (India Bullet train) చేపట్టారు. జపాన్ ప్రభుత్వ సాయంతో ఈ ప్రాజెక్టును చేపట్టారు. ఇప్పటికే పలు చోట్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. మిగిలిన చోట్ల శరవేగంగా పనులు జరుగుతున్నాయి. బుల్లెట్ రైలు ప్రాజెక్టులో వేగంతోపాటు భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు.
బుల్లెట్ రైలు ప్రయాణించే సమయంలో భూకంపాలు సమాచారం తెలుసుకోవడం సహా అప్రమత్తం చేసే వ్యవస్థను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. బుల్లెట్ రైలు మార్గంలో భూకంపాలను గుర్తించే సీస్మోమీటర్లను అమర్చాలని భావిస్తున్నారు. బుల్లెట్ రైలు వేగంగా ప్రయాణిస్తున్న సమయంలో భూకంపం వస్తే ఆ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ముందస్తు జాగ్రత్తలను తీసుకుంటున్నారు.

జపాన్‌కు చెందిన షింకన్‌సెన్ టెక్నాలజీ సంస్థ అభివృద్ధి చేసిన సీస్మోమీటర్లను అమర్చాలని భావిస్తున్నారు. మొత్తంగా 22 అలైన్‌మెంట్‌లో 28 సీస్మోమీటర్లను అమర్చనున్నారు. మహారాష్ట్ర- ముంబయి, థానే, విరార్, బొయిసర్‌లో 8 సీస్మోమీటర్లు మరియు గుజరాత్- వాపి, బిలిమోరా, సూరత్, భరూచ్, వడోదర్, ఆనంద్, మహోంబాదాద్, అహ్మాదాబాద్‌లో 14 ఏర్పాటుచేయనున్నారు.
మిగిలిన ఆరు సీస్మోమీటర్లను రైల్వే ప్రాంతం చుట్టుపక్కల ప్రాంతాల్లోని అమర్చనున్నారు. ఈ ప్రాంతాలన్నీ గత 100 సంవత్సరాల్లో 5 పాయింట్ల కంటే ఎక్కువ తీవ్రతతో భూకంపాలు వచ్చిన ప్రాంతాలను ఎంపిక చేస్తారు. ఈ సీస్మోమీటర్లను ఇక్కడ అమర్చనున్నారు.
ఈ సీస్మోమీటర్లు భూకంపానికి ముందు వచ్చే తరంగాలను గుర్తించి భూకంపం సంభవించే అవకాశాన్ని అంచనా వేస్తాయి. భూకంపం సంభవిస్తుందని నిర్ధారణకు వస్తే బుల్లెట్ రైళ్లకు ఆటోమేటిక్‌గా ఎమర్జెన్సీ బ్రేకులు యాక్టివేట్ అయ్యే సాంకేతికను సీస్మోమీటర్లు కలిగి ఉంటాయి. మరియు రైలుకు విద్యుత్ కూడా నిలిపివేయబడుతుంది.
ఈ సీస్మోమీటర్లు అమర్చే ప్రాంతాల్లో భూసార పరీక్షలు సహా సమగ్ర అధ్యయం చేస్తారు. అనంతరమే స్థలాలను ఎంపిక చేస్తారు. సీస్మోమీటర్ల నుంచి వెలువడే ( early Earthquake detection system ) సిగ్నల్ నేరుగా బుల్లెట్ రైళ్లకు అందేలా ఏర్పాట్లు చేస్తారు.
ముంబై అహ్మాదాబాద్ మధ్య 508 కి.మీ మేర బుల్లెట్ రైలు ప్రయాణం చేయనుంది. 320 కి.మీ వేగంతో ప్రయాణం చేయగలదు. ఈ 508 కి.మీ దూరం మధ్యలో 12 స్టేషన్లను ఏర్పాటుచేయనున్నారు. పరిమిత స్టేషన్లతో 2 గంటల 7 నిమిషాల్లో గమ్యస్థానాన్ని చేరుకోనుంది. అన్ని స్టేషన్లతో స్టాప్‌లు ఉంటే 2 గంటల 58 నిమిషాల్లో గమ్యస్థానాన్ని చేరుకోనుంది.
2026 నాటికి ఈ తొలి దశ ప్రాజెక్టు పూర్తయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. రానున్న 100 సంవత్సరాలను దృష్టిలో పెట్టుకొని నిర్మాణాలు, భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రకృతి విపత్తుల సమయంలోనూ ఎలాంటి నష్టం జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు. తొలి దశ విజయవంతం అయిన తర్వాత మిగిలిన ప్రాంతాలను విస్తరించాలని భావిస్తున్నారు.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








