Selling Tea In Audi Car వీడెవ్వడు భయ్యా..? ఆడీ కారులో టీ అమ్ముతున్నాడు..!

ప్రస్తుతం ఇంటర్నెట్ యుగంలో ఏదైనా ఇట్టే జనాలకు చేరుకుంటుంది. కొత్త కొత్త వెరైటీలతో యువత కొంతమందికి తమ కలని నిజం చేసుకుంటున్నారు. మరి కొందరు తమకు నచ్చిన రంగాన్ని ఎంచుకొని అందరికీ భిన్నంగా ముందుకు సాగుతున్నారు. అలాంటివారు ఎంతోమంది యువత యువకులకు వీరు ఆదర్శంగా నిలుస్తున్నారు.

ఇటీవలే, ఢిల్లీకి చెందిన తాప్సీ ఉపాధ్యాయ అనే 21 ఏళ్ల ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ బైక్‌ను ఫుడ్ కార్ట్‌గా ఉపయోగించుకుని పానీపూరీ విక్రయించి ఆశ్చర్యానికి గురి చేసింది. ఆ యువతి ప్రీమియం బుల్లెట్ బైక్ అమ్ముతున్న వీడియో సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్‌గా మారింది. ఇన్‌స్టాగ్రామ్ లో తన వీడియోలు హల్ చల్ చేస్తున్నాయి. 'ఏదైనా వ్యాపారం ప్రారంభించడానికి వయస్సు కేవలం ఒక సంఖ్య' మాత్రమేనని తాప్సీ చెప్పింది.

Selling Tea In Audi Car

వింత ఆలోచనలు..
మరో వ్యక్తి రాయల్ ఎన్‌ఫీల్డ్‌ బైక్ సైలెన్సర్ ని ఉపయోగించి పాప్ కార్న్ తయారు చేసిన విధానం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ మోటార్‌సైకిల్ ను స్టార్ట్ చేసి హాట్ సైలెన్సర్‌లో పాప్‌కార్న్ కెర్నల్‌లను ఉంచడం ద్వారా ఆ వేడికి కొంత సమయం తర్వాత సిద్ధం చేసిన పాప్‌కార్న్‌లు పాప్ అవుట్ అవుతాయి. ఇలా నాకు నచ్చిన విధంగా సరికొత్త పద్ధతిలో ఇతరులకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు.

ప్రస్తుతం దేశంలో కార్ల సంఖ్య వేగంగా పెరుగుతుంది అందులో యూజ్డ్ కార్స్ కూడా ఎక్కువగా ఉంటున్నాయి. ఏదైనా బిజినెస్ కోసం సెకండ్ హ్యాండ్ కార్లు, బైక్ లకు కొందరు వినియోగిస్తున్నారు. డబ్బు ఆదాకోసం కొందరు ఇలా చేస్తారు. ఈ వాహనాలను తమ అవసరానికి అనుగుణంగా మార్చుకుని చిన్న తరహా వ్యాపారం ప్రారంభిస్తారు.

ఆడీ కారులో టీ అమ్ముతూ..

తాజాగా లగ్జరీకారులో ఓ వ్యక్తి టీ అమ్ముతున్నాడు. రోడ్డు పక్కన ఆడి కారును అందులో టీ అమ్ముతున్న వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ సంఘటన ఎక్కడ జరిగిందో కచ్చితమైన సమాచారం లేదు. అయితే ఆశిష్ త్రివేది అనే వ్యక్తి తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఈ వీడియోను కూడా పంచుకున్నాడు. అక్కడ ఒక యువకుడు ఆడి కారును రోడ్డు పక్కన ఆపి, వ్యాపారాన్ని నిర్వహించడానికి అవసరమైన వస్తువులను బూట్ (డిక్కీ)లో ఉంచాడు.

ఈ వీడియో ఉత్తర భారతదేశంలోని ఏదో ఒక రాష్ట్రానికి సంబంధించినదని అక్కడ ఆటోరిక్షా ఇతర వాహనాలు తిరుగుతూ ఉండడం గమనించినప్పుడు సులభంగా అర్థమవుతుంది. ఇదొక్కటే కాదు.. వీడియో రికార్డ్ చేసిన వ్యక్తి టీ అమ్ముతున్న యువకుడిని చూసి, 'టీ అమ్మి ఆడి కారు కొన్నాడా.. లేక ఆడిని కాపాడేందుకు టీ సేల్ చేస్తున్నా' అని వీడియోపై క్యాప్షన్ రాశాడు.

ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
వైరల్ అవుతున్న ఈ వీడియోపై నెటిజన్లు పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఒకరు 'టీ అమ్మి ఈ స్థాయికి వచ్చాడని.. మరొకరు ఇదొక మంచి వ్యాపారంగా అభివర్ణించారు. ఇంకొందరు ఇదొక మంచి స్టార్టప్ అని ఇలాంటి కొత్త ఐడియాలు బిజినెస్ ను ఇంప్రూవ్ చేస్తాయని అన్నారు. మరొకరు పెట్రోల్ కొనుక్కోవడానికి టీ అమ్ముతున్నాడని కామెంట్ చేశారు.

దేశంలో ఈ ఖరీదైన లగ్జరీ 'ఆడి' కార్ల గురించి వివిధ మోడళ్లను విక్రయిస్తుంది. రూ.43.85 లక్షల నుంచి రూ.1.43 కోట్ల వరకు మధ్య వీటి ధరలు ఉన్నాయి. వీటిలో అత్యంత ప్రజాదరణ పొందిన 'క్యూ7' రూ. 84.70 లక్షల నుంచి రూ. 92.30 లక్షల ఎక్స్-షోరూమ్ ధరగా ఉంది. ఇది పెట్రోల్ డీజిల్ ఇంజన్ ఎంపికలను కలిగి ఉంది. AWD (ఆల్ వీల్ డ్రైవ్) సాంకేతికతను ఈ కారు పొందుతుంది.

అలాగే సెకండ్ హ్యాండ్ మార్కెట్‌లో ఖరీదైన కార్లు, ద్విచక్ర వాహనాలను కొనుగోలు చేసి తమ వ్యాపార అవసరాలకు అనుగుణంగా డిజైన్ చేసుకోవడం ప్రస్తుతం ట్రెండ్ గా మారింది. అలాగే ఆ వాహనాలు ఆకర్షణీయంగా ఉండడం వల్ల ఎక్కువ మంది కస్టమర్లు వస్తారనే నమ్మకం వ్యాపారుల్లో పెరిగింది.. ఇక్కడ కూడా 'ఆడి' కారు యజమాని కూడా అలానే చేసినట్లున్నాడు.

More from DriveSpark

Article Published On: Thursday, April 13, 2023, 17:04 [IST]
English summary
Selling tea in a audi car video gone viral
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+