నో పార్కింగ్‌లో వెహికల్ గుర్తించారా.. అయితే ఫోటో తీసి పెట్టు & ప్రైజ్ మనీ కొట్టు

భారతదేశంలో నిరంతరం అభివృద్ధివైపు అడుగులు వేస్తూనే ఉంది. ఇందులో భాగంగానే రోజురోజుకి వాహన వినియోగం ఎక్కువవుతోంది. ఈ రోజు భారతదేశం మొత్తం మీద ప్రతి ఇంటికి ఒక బైక్ లేదా కారు ఉంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే పెరుగుతున్న వాహనాలను సరిపోయే పార్కింగ్ ప్లేస్ లేదు.

ఈ రోజు ఢిల్లీ వంటి నగరాల్లో వాహనాలను పార్కింగ్ చేయడానికి వాహన వినియోగదారులు చాలా కష్టపడుతున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వాలు వాహనాల పార్కింగ్ కోసం నిర్ణీత ప్రదేశాలను నిర్ణీత రోజులలో నిర్ణయించింది. వాహనదారులు తప్పకుండా ఆ ఆదేశాలకు అనుకూలంగానే తమ వాహనాలను పార్కింగ్ చేయాలి . లేకుంటే జరిమానాలు చెల్లించాల్సి వస్తుంది. అయితే ఇప్పుడు కేంద్ర రోడ్డు రవాణా శాఖ దీనికోసం ఒక కొత్త ప్రకటన చేసింది. దీని గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

ఫోటో తీసి పెట్టు & ప్రైజ్ మనీ కొట్టు: ఏంటిదంటే?

పార్కింగ్ సమస్యలను తొలగించడానికి కేంద్ర రోడ్డు రవాణా శాఖ చేసిన ఈ ప్రకటన ప్రకారం.. నో పార్కింగ్ ప్రదేశంలో ఎవరైనా వాహనాలను పార్కింగ్ చేసి ఉండటం మీరు గమనిస్తే, ఆ ఫోటో తీసి సంబంధిత అధికారులకు పంపాలని కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. దీనిని ఆధారంగా చేసుకుని ఆ వాహన దారులకు జరిమానా విధించే అవకాశం ఉంటుంది.

ఫోటో తీసి పెట్టు & ప్రైజ్ మనీ కొట్టు: ఏంటిదంటే?

రోడ్లపైన నో పార్కింగ్ ప్రదేశంలో అక్రమంగా పార్కింగ్ చేసిన వాహన యజమానులకు రూ.1,000 జరిమానా విధించబడుతుంది. అయితే అందులో నుంచి సంబంధింత అధికారులకు సమాచారం పంపిన పౌరులకు రూ. 500 రివార్డ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ విధానం ద్వారా తప్పకుండా పార్కింగ్ సమస్య కొంతవరకు తగ్గుతుందని భావిస్తున్నారు.

ఫోటో తీసి పెట్టు & ప్రైజ్ మనీ కొట్టు: ఏంటిదంటే?

దేశంలో చాలా నగరాల్లో పార్కింగ్ సమస్య వేగంగా పెరుగుతోందని నితిన్ గడ్కరీ తెలిపారు. దీనికి ప్రధాన కారణం కొంతమంది వాహన వినియోగదారులు తమ వాహనాలను ఎక్కడపడితే అక్కడ పార్కింగ్ చేయడమే. దీనిని రూపుమాపడానికి ఈ కొత్త ఆలోచన. అయితే దేశంలో ఈ సమస్యను రూపుమాపడానికి వాహనదారులు కూడా కొంత సహకరించాలి. అప్పుడే ఇది సాధ్యమవుతుంది.

ఫోటో తీసి పెట్టు & ప్రైజ్ మనీ కొట్టు: ఏంటిదంటే?

వాహన వినియోగదారులు తాము వాహనం కొనుగోలు చేసేటప్పుడే తమ వాహనం పార్కింగ్ చేసుకోవడానికి తమ గృహం వద్ద ఏర్పాటు చేసుకోవాలి. అయితే బహిరంగ ప్రదేశాల్లో పార్కింగ్ చేయవలసి వస్తే తప్పకుండా అక్కడున్న రూల్స్ పాటించి పార్కింగ్ కి కేటాయించిన ప్రదేశంలోనే పార్కింగ్ చేసుకోవాలి. అలా కాకుండా తమకు నచ్చిన ప్రాంతంలో పార్కింగ్ చేస్తే జరిమానా చెల్లించాల్సి వస్తుంది. వాహన వినియోగారులు దీనిని తప్పకుండా దృష్టిలో ఉంచుకోవాలి.

ఫోటో తీసి పెట్టు & ప్రైజ్ మనీ కొట్టు: ఏంటిదంటే?

ఇతర దేశాలతో పోలిస్తే మనదేశంలో పార్కింగ్ చేసుకోవడానికి తగిన స్థలం ఉంది. అయినప్పటికీ వాహనదారులు దానిని విస్మరిస్తున్నారు. రోడ్లపైనే పార్కింగ్‌ చేయడం వల్ల ట్రాఫిక్ ఎక్కువ కావడంతో పాటు ప్రయాణికులు చాలా ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. ఈ సమస్యకు పరిస్కారంగానే ఇప్పుడు ఈ కొత్త పద్దతి అమలులోకి వచ్చింది. దీని ద్వారా ఈ సమస్య తగ్గుతుంది అని చెప్పవచ్చు.

ఫోటో తీసి పెట్టు & ప్రైజ్ మనీ కొట్టు: ఏంటిదంటే?

ప్రస్తుతం భారదేశంలో మోటార్ వాహన చట్టాలు చాలా కఠినంగా ఉన్నాయి. కావున ట్రాఫిక్ పోలీసులు కూడా ట్రాఫిక్ నియమాలను పాటించని వారిపైన విరుచుకుపడుతున్నారు. సాధారణంగా రోడ్డుపైన వాహనాలను పార్కిగ్ చేసే వహాం వినియోగదారులు ఇతర వాహనదారులకు ఎటువంటి ఇబ్బంది కలిగించకుండా పార్కింగ్ చేసుకోవాలి. అలా కాకుండా పబ్లిక్ రోడ్డుపైన మీకు నచ్చినట్లు పార్కింగ్ చేస్తే అది ప్రమాదాలకు దారి తీస్తుంది.

ఫోటో తీసి పెట్టు & ప్రైజ్ మనీ కొట్టు: ఏంటిదంటే?

పబ్లిక్ రోడ్డుపైన పార్కింగ్ ప్రదేశా కూడా ఉంటాయి, కావున వీలైనంతవరకు అక్కడ మీ వాహనాలను పార్క్ చేయాలి. రోడ్ రెగ్యులేషన్ రూల్స్ - 1989 సెక్షన్ 15 ప్రకారం.. రోడ్డు క్రాసింగ్ వద్ద లేదా సమీపంలో, టర్నింగ్, కొండ శిఖరం లేదా హంప్డ్ బ్రిడ్జి వంటి ప్రదేశాలలో వాహనాలను ఎట్టి పరిస్థితుల్లోనూ పార్క్ చేయకూడదు. ఇలాంటి ప్రదేశాల్లో ప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది. కావున ఇలాంటి ప్రదేశాల్లో ఎట్టిపరిస్థితుల్లోనూ పార్కింగ్ చేయకూడదు.

ఫోటో తీసి పెట్టు & ప్రైజ్ మనీ కొట్టు: ఏంటిదంటే?

అంతే కాకుండా కొంతమంది ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో లేదా జీబ్రా క్రాసింగ్ వంటి ప్రాంతాల్లో కూడా పార్కింగ్ చేస్తూ ఉంటారు. ఇది మరింత ఎక్కువ రద్దీ ఏర్పడటానికి కారణం అవుతుంది. బస్ స్టాప్, స్కూల్ లేదా హాస్పిటల్ వాహనాలను సమీపంలో పార్క్ చేయకూడదు. ఇవన్నీ కూడా వాహన వినియోగదారులు గుర్తుంచుకోవాలి.

ఫోటో తీసి పెట్టు & ప్రైజ్ మనీ కొట్టు: ఏంటిదంటే?

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

నో పార్కింగ్ ప్రదేశాల్లో పార్కింగ్ చేసిన వాహనాలకు సంబంధించిన ఫొటోలు తీసి సంబంధిత అధికారులకు పంపితే రూ. 500 రివార్డ్ ఇచ్చే ఈ పద్ధతి తప్పకుండా పార్కింగ్ సమస్యను తగ్గించే అవకాశం ఉంటుందని ఆశిస్తున్నాము. అయితే దీనికి వాహనదారులు తప్పకుండా సహకరించాలి.

Most Read Articles

English summary
Send photo of illegal parking vehicle and get rs 500 reward says nitin gadkari
Story first published: Friday, June 17, 2022, 16:26 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X