ప్రమాదానికి గురైన అలనాటి అందాల తార 'రంభ' కారు.. హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న కుమార్తె: పూర్తి వివరాలు
అలనాటి అందాల తార 'రంభ' గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకమైన పరిచయం అవసరమే లేదు. అందరిని అలరించే అభినయం అంతకు మించిన అందంతో కుర్రకారు నుంచి పెద్దవారిని సైతం కట్టి పడేస్తూ అప్పట్లోనే తనదైన ముద్ర వేస్తూ.. తిరుగులేని నటిగా పేరు సంపాదించింది. అయితే సినీరంగంలో తనదైన ముద్ర వేసుకున్న రంభ పెళ్లి తరువాత సినిమా రంగానికి దూరంగా ఉంటూ ఇప్పుడు ఫ్యామిలితో కెనడాలో స్థిరపడ్డారు.

ఇటీవల కెనడాలో రంభ తన పిల్లలతో కారులో ప్రయాణిస్తుండగా.. అకస్మాత్తుగా ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో రంభ చిన్న కుమార్తె సాషా కొంత తీవ్రంగా గాయాలపాలైంది. ఈ కారణంగానే సాషాను హాస్పిటల్ లో చేర్చారు. ఇంతకీ వారి కారు ఎలా ప్రమాదానికి గురైంది, ఆ సమయంలో కారులో ఎవెరెవరు ఉన్నారు అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

నివేదికలు ప్రకారం, రంభ ప్రయాణిస్తున్న కారు కెనడా కాలమానం ప్రకారం సోమవారం సాయంత్రం ఈ సంఘటన జరిగినట్లు తెలుస్తోంది. తన పిల్లలను స్కూల్ నుంచి తీసుకువస్తున్న సమయంలో వీరి కారుని మరో కారు ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం ముంచు నుంచి కాకుండా కారు సైడ్ నుంచి జరగడం వల్ల పెద్ద ప్రమాదం ఏమి జరగలేదు.

ఈ ప్రమాదంలో కారులోకి ఎయిర్ బ్యాగులు ఓపెన్ కావడం వల్ల ఎవరికీ పెద్దగా గాయాలు కాలేదు, కానీ తన చిన్న కుమార్తెకు కొంత గాయాలేనట్లు నటి రంభ తెలిపింది. అంతే కాకుండా గాయాల కారణంగా తన కూతురు సాషా ఇంకా హాస్పిటల్ బెడ్డు మీదే ఉందని భావోద్వేగానికి గురైంది. నా కూతురు త్వరగా కోలుకోవాలని కోరుకోండి, మీ ప్రార్థనలు మాకు ఎంతో అవసరం' అని సోషల్ మీడియా వేదికగా రంభ తెలిపింది.

రంభ కారు ప్రమాదానికి గురైన చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందులో కారు యొక్క సైడ్ డోర్ కొంత దెబ్బతిన్నట్లు కూడా ఇక్కడ మీరు చూడవచ్చు. ప్రమాదం జరిగిన సమయంలో రంభ, తన కూతురు ఇంకా ఒక ఆయా కూడా ఉన్నట్లు సమాచారం.

ప్రమాదానికి గురైన కారు 'టెస్లా' (Tesla) కంపెనీ యొక్క మోడల్ ఎక్స్ అని తెలుస్తోంది. టెస్లా కంపెనీ యొక్క ఈ కారుకి ప్రపంచ వ్యాప్తంగా చాల డిమాండ్ ఉంది. ఎందుకంటే టెస్లా కార్లు ప్రపంచంలో అత్యంత సురక్షితమైన కార్లలో ఒకటి. ఇది USA నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్ (NHTSA) మరియు యూరో NCAP నుండి అత్యంత సురక్షితమైన కారుగా గుర్తించబడి 5-స్టార్ రేటింగ్‌ను పొందింది.

నిజానికి గ్లోబెల్ NCAP కంపెనీ కూడా పైన తెలిపిన రెండు క్రాష్ టెస్ట్ ఏజెన్సీలు చాలా కష్టమైన రేటింగ్ విధానాలను కలిగి ఉన్నాయి. ఎందుకంటే ప్రతి వాహనాన్ని పగడ్బందీగా పరీక్షించి రేటింగ్ అనేది అందిస్తాయి. ఈ కారణంగానే ఈ టెస్ట్ ఏజెన్సీల ద్వారా 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ పొందిన కార్లు అత్యంత సురక్షితమైన కార్లుగా వ్యవహరించబడతాయి.

ఇదిలా ఉండగా టెస్లా కంపెనీ గత కొన్ని సంవత్సరాలుగా భారతదేశంలో ప్రవేశించేందుకు సన్నాహాలు చేస్తూనే ఉంది. ఇందులో భాగంగానే టెస్లా కంపెనీ 2016 లోనే తమ చవకైన ఎలక్ట్రిక్ కారు టెస్లా మోడల్ 3 (Tesla Model 3) కోసం భారతదేశంతో పాటుగా ప్రపంచంలోని ఇతర దేశాల నుండి కూడా బుకింగ్‌లను స్వీకరించింది. ఆ సమయంలో కేవలం 1000 డాలర్లకే (సుమారు రూ.60-65 వేలు) టెస్లా మోడల్ 3 కోసం బుకింగ్‌లను ఓపెన్ చేసింది.

కంపెనీ ఈ కారు కోసం బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభిన సమయంలో భారతదేశంలోని టెస్లా ప్రియులు కూడా టెస్లా మోడల్ 3 కారుని బుక్ చేసుకున్నారు. అయితే కంపెనీ ఇప్పటివరకు కూడా టెస్లా కార్లను భారతదేశంలో విడుదల చేయడం గురించి కానీ లేదా వాటి డెలివరీల గురించి కానీ ఎలాంటి సమాచారం అందించలేదు.

ఇప్పటికే చాలామంది బుక్ చేసుకున్న కస్టమర్లు ఈ కారు డెలివరీలపైనా నిరాశను వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భాగంగానే కస్టమర్లు గడచిన ఆరేళ్లుగా తమ డబ్బు వాపసు (రీఫండ్) కోసం టెస్లా కంపెనీని పదేపదే అడిగుతూనే ఉన్నారు. అయినప్పటికీ కంపెనీ వీరికి ఎటువంటి సమాధానం ఇవ్వకపోవడం గమనార్హం.

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:
ప్రపంచంలో ఉన్న అత్యంత సురక్షితమైన కార్ల జాబితాలో టెస్లా ఒకటి. టెస్లా కార్లు పటిష్టమైన భద్రత ఫీచర్స్ కలిగి ఉంటాయి. అయితే రంభ కారు ప్రమాదానికి గురైన విషయం తెలిసిన వెంటనే అభిమానులు ఒక్క సారిగా దిగ్బ్రాంతికి లోనయ్యారు. అయితే ఎవరికీ ఎటువంటి హాని జరగలేదు. అయితే ప్రమాదంలో గాయపడిన సాషా తొందరగా కోలుకోవాలని కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలతోపాటు మార్కెట్లో విడుదలయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఛానల్ చూస్తూ ఉండండి.


Click it and Unblock the Notifications








