ఆడి టిటి కారుతో ఆశ్చర్యకరమైన కార్ యాక్సిడెంట్

By Ravi

కుర్రకారు చేతికి వేగంగా వెళ్లే కార్లను ఇస్తే ఏమవుతుంది.. ఇదిగో ఈ ఫోటోలో కనిపిస్తున్న విధంగానే జరుగుతుంది. బ్రిటన్‌లో ఓ 20 ఏళ్ల కుర్రాడు అత్యంత ఖరీదైన మరియు వేగంతమైన ఆడి టిటి స్పోర్ట్స్ కారును డ్రైవ్ చేస్తూ, ప్రమాదవశాత్తు ఓ ఇంటిని ఢీకొట్టాడు. రోడ్డుపై వేగంగా వెళ్తున్న కారు హఠాత్తుగా అదుపుతప్పి, ఫుట్‌పాత్ పైనుంచి సిని ఫక్కీలో జంప్ కొట్టి నేరుగా ఇంటి గోడలోకి దూసుకుపోయింది. అదృష్టవశాత్తు ఆ ఇంటిలో నివసించే వారికి ఎలాంటి ప్రమాదం జరగలేదు.

అయితే, సదరు కారును నడిపిన వ్యక్తి తలకి మాత్రం తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని జేమ్స్ పేజెట్ ఆస్పత్రిలో చేర్పించారు. ఈ ప్రమాదంలో ఆడి టిటి కారు ముందు భాగం పూర్తిగా నుజ్జు నుజ్జు అయిపోయింది. అలాగే ఇంటి గోడలు కూడా భారీగా దెబ్బతిన్నాయి. ఈ సంఘటనలో సమీపంలో నివసించే వారంతా ఒక్కసారిగా అవాక్కయ్యారు. గాలిలోకి ఎగిరిన నేరుగా ఇంటి కిటికీ వైపు ఢీకొట్టి భూమి నుంచి 2-3 అడుగులు ఎత్తులో ఇరుక్కుపోయింది.

జర్మన్ లగ్జరీ కార్ కంపెనీ 'ఆడి' రూపొందించిన మరో స్పోర్ట్స్ కారు 'ఆడి టిటి'లో శక్తివంతమైన 2.0 లీటర్ టిఎఫ్ఎస్ఐ ఇంజన్‌ అమర్చారు. ఇది కేవలం 5.6 సెకండ్లలో 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. మన మార్కెట్లో ఈ కారు ధర 50 లక్షల రూపాయలకు పైమాటే.

Audi TT

More from DriveSpark

Article Published On: Wednesday, March 27, 2013, 17:25 [IST]
English summary
In a freak accident, a man, in his twenties, was seriously hurt with head injuries after a car crashed and ended up embedded in a house in Suffolk, UK. Emergency services were summoned to Long Meadow Walk, Lowestoft, to find a red Audi TT had left the road and crashed into the home.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+