అదర్ పూనావాలా కొత్త కారు.. ధర తెలిస్తే కచ్చితంగా షాకవుతారు!
సెలబ్రిటీలు, పారిశ్రామిక వేత్తలు మరియు ఇతర ప్రముఖులు ఎప్పటికప్పుడు తమకు నచ్చిన కార్లను ఎంత ఖర్చు చేసయినా కొనుగోలు చేయడానికి వెనుకాడరు. ఇలాంటి నేపథ్యంలో భాగంగానే బిలియనీర్ 'అదర్ పూనావాలా' ఓ కారును కొనుగోలు చేశారు. మరిన్ని వివరాలు ఇక్కడ చూసేద్దాం.
సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈఓ 'అదర్ పూనావాలా' ఇటీవల ఫెరారీ పురోసాంగ్యూ (Ferrari Purosangue) కొనుగోలు చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇందులో బ్లాక్ కలర్ ఫెరారీ పురోసాంగ్యూ చూడవచ్చు. ఈ కారు యొక్క నెంబర్ ప్లేట్ గమనిస్తే.. ఇది ఇండియాలో కొనుగోలు చేసింది కాదని తెలుస్తోంది. ఇది యునైటెడ్ కింగ్‌డమ్‌లో కొనుగోలు చేసినట్లు సమాచారం.

సోషల్ మీడియా పోస్టుల ప్రకారం, దీనిని ఇటాలియన్ కంపెనీ ఫెరారీ రూపొందించిన మొదటి SUV అని సమాచారం. 2022లో కంపెనీ ఈ కారును మొదటి సారిగా గ్లోబల్ మార్కెట్లో లాంచ్ చేసింది. కాగా గత నెలలో కంపెనీ దీనిని భారతదేశంలో ప్రారంభించింది. ఈ SUV ధర రూ. 10.5 కోట్లు (ఎక్స్ షోరూమ్). చూడగానే ఆకర్శించబడే ఈ కారు అంతకు మించిన పనితీరును అందిస్తుంది.
నాలుగు డోర్స్ కలిగిన ఈ కారు నీరో డేటోనా షేడ్ పొంది చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. అయితే బ్రేక్ కాలిపర్లు పసుపు రంగులో పూర్తి చేయబడి బ్లాక్ అవుట్ ఎక్ట్సీరియర్‌ను పొందుతుంది. ఇంటీరియర్ కూడా ఎల్లో అండ్ బ్లాక్ కలయికతో ఉండటం చూడవచ్చు. ఈ కారు యొక్క వెనుక డోర్స్ రియర్ హింగ్ పొందుతాయి. కాబట్టి ప్రయాణికులు లోపలికి వెళ్ళడానికి మరియు బయటకు రావడానికి అనుమతిస్తుంది.

ఇంజిన్ విషయానికి వస్తే.. ఫెరారీ పురోసాంగ్యూ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఇందులోని 6.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ 725 పీఎస్ పవర్ మరియు 716 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది ఇప్పటికే మార్కెట్లో ఉన్న లంబోర్ఘిని ఉరస్ మరియు ఆస్టన్ మార్టిన్ డిబిఎక్స్ వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. ధర పరంగా ఇది దాని ప్రత్యర్థుల కంటే ఎక్కువ కావడం గమనార్హం.
నిజానికి అదర్ పూనావాలా ఎప్పటికప్పుడు ఖరీదైన కార్లను కొనుగోలు చేస్తూ ఉంటారు. కాబట్టి ఇప్పటికే ఈయన గ్యారేజిలో రోల్స్ రాయిస్ ఫాంటమ్ సిరీస్ VIII లగ్జరీ సెడాన్‌ను కలిగి ఉన్నారు. ఫెరారీ 488 పిస్టా సూపర్ కారు, బెంట్లీ బెంటెగా ఈడబ్ల్యుబీ లగ్జరీ SUV వంటి వాటిని కొనుగోలు చేశారు. కాగా ఫెరారీ పురోసాంగ్యూ కొనుగోలు చేసిన మొదటి ఇండియన్ మాత్రం అదార్ పూనావాలా కాదు.
ఇప్పటికే బెంగళూరుకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్త బూపేష్ రెడ్డి ఈ కారును కొనుగోలు చేశారు. భారతీయ మార్కెట్లో ఫెరారీ కంపెనీ తన పురోసాంగ్యూ లాంచ్ చేయక ముందే ఈ కారును కొనుగోలు చేశారు. అంతే కాకుండా ముఖేష్ అంబానీ కూడా ఈ కారును కొనుగోలు చేసినట్లు సమాచారం. జామ్‌నగర్‌లో తన చిన్న కొడుకు ప్రీ వెడ్డింగ్ వేడుకలకు షారుఖ్ ఖాన్‌ను విమానాశ్రయంలో దింపడానికి అతను ఈ కారును ఉపయోగించారు.
ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.


Click it and Unblock the Notifications








