షాహిద్ కపూర్ గ్యారేజిలో చేరిన రూ. 14 లక్షల ఖరీదైన బైక్.. వివరాలు

ప్రముఖ బాలీవుడ్ స్టార్ 'షాహిద్ కపూర్' అంటే మొదటగా గుర్తొచ్చేది కేవలం సినిమాలు మాత్రమే కాదు, అత్యంత ఖరీదైన వాహనాలు కలిగిన ఉన్న వ్యక్తిగా కూడా. అంటే బాలీవుడ్ ప్రముఖులలో ఎక్కువ ఖరీదైన బైకులు కలిగి ఉన్న వ్యక్తిల్లో షాహిద్ కపూర్ కూడా ఒకరు. ఇతని వద్ద ఇప్పటికే BMW R1250GS అడ్వెంచర్, డుకాటి స్క్రాంబ్లర్ 1100 స్పెషల్ ఎడిషన్‌ వంటివి ఉన్నాయి. అయితే ఇప్పుడు మరో ఖరీదైన బైక్ కొనుగోలు చేసాడు.

Recommended Video

Mahindra Scorpio Classic Launched In TELUGU | Price At Rs 11.99 Lakh | Variants & Features Explained

ఇంతకీ 'షాహిద్ కపూర్' కొనుగోలు చేసిన ఆ బైక్ ఏది, దాని ధర ఎంత అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.. రండి.

రూ. 14 లక్షల ఖరీదైన బైక్ కొనుగోలు చేసిన షాహిద్ కపూర్

నివేదికల ప్రకారం 'షాహిద్ కపూర్' కొనుగోలు చేసిన ఈ కొత్త బైక్ 'డుకాటి' (Ducati) బ్రాండ్ కి చెందిన 'స్క్రాంబ్లర్ డెసెర్ట్ స్లెడ్' (Scrambler Desert Sled). ఈ బైక్ ధర ఎక్స్-షోరూమ్ ధర రూ. 12 లక్షలు కాగా, ఆన్ రోడ్ ధర రూ. 14 లక్షలు. ఈ ఖరీదైన బైక్ కొనుగోలుకి సంబంధించిన ఫోటోలు కూడా మీరు ఇక్కడ గమనించవచ్చు.

రూ. 14 లక్షల ఖరీదైన బైక్ కొనుగోలు చేసిన షాహిద్ కపూర్

షాహిద్ కపూర్ కొనుగోలు చేసిన ఈ కొత్త బైక్ స్పార్క్లింగ్ బ్లూ మరియు వైట్ షేడ్ లో చూడచక్కగా ఉంది. ఇది మంచి డిజైన్ కలిగి లేటెస్ట్ ఫీచర్స్ కూడా పొందుతుంది, కావున వాహన వినియోగదారులకు మంచి రైడింగ్ అనుభూతిని అందిస్తుంది. ఈ బైక్ గోల్డెన్ రిమ్స్ మరియు క్లాసిక్ బ్లాక్ ఫ్రేమ్‌తో పాటుగా ట్యాంక్ మరియు మడ్‌గార్డ్‌లపై రెడ్ అండ్ వైట్ డీటేలింగ్స్‌ను కలిగి ఉంటుంది. ఇది సరికొత్త "స్పార్కింగ్ బ్లూ" లివరీ థీమ్‌తో 1980 కాలం నాటి ఎండ్యూరో బైక్‌లకు నివాళిగా డిజైన్ చేయబడినది.

రూ. 14 లక్షల ఖరీదైన బైక్ కొనుగోలు చేసిన షాహిద్ కపూర్

స్క్రాంబ్లర్ డెసెర్ట్ స్లెడ్ బైక్ లో హై ఫ్రంట్ మడ్‌గార్డ్, ఎక్స్‌టెండెడ్ రియర్ ఫెండర్, హై ప్లేట్ హోల్డర్, వేరియబుల్ క్రాస్-సెక్షన్ హ్యాండిల్ బార్ మరియు సర్దుబాటు చేయగల కయాబా సస్పెన్షన్లు ఈ మోటార్‌సైకిల్‌కు మరింత ఉత్తమమైన ఆఫ్-రోడింగ్ అనుభవాన్ని జోడిస్తాయి. కావున ఆఫ్ రోడింగ్ చేసేవారికి ఇది ఉత్తమమైన ఎంపిక అవుతుంది.

రూ. 14 లక్షల ఖరీదైన బైక్ కొనుగోలు చేసిన షాహిద్ కపూర్

స్క్రాంబ్లర్ డెసెర్ట్ స్లెడ్ బైక్ 803సిసి, ఎల్-ట్విన్, ఎయిర్-కూల్డ్ ఇంజన్‌ను కలిగి ఉంటుంది. ఇది గరిష్టంగా 8,250 ఆర్‌పిఎమ్ వద్ద 73 హెచ్‌పి పవర్‌ను మరియు 5,750 ఆర్‌పిఎమ్ వద్ద 66.2 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 6-స్పీడ్ స్లిప్పర్ అసిస్ట్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. కావున మంచి పనితీరుని అందిస్తుంది.

రూ. 14 లక్షల ఖరీదైన బైక్ కొనుగోలు చేసిన షాహిద్ కపూర్

ఇంతకు ముందు చెప్పుకున్నట్లుగా షాహిద్ కపూర్ ఇప్పటికే డుకాటి కంపెనీ యొక్క స్క్రాంబ్లర్ 1100 స్పెషల్ ఎడిషన్‌ ను 2019 లో కొనుగోలు చేసాడు. ఈ బైక్ ను కంపెనీ మూడు వేరియంట్లలో మార్కెట్లో అందిస్తుంది. అవి స్క్రాంబ్లర్ 1100, స్క్రాంబ్లర్ 1100 స్పెషల్ మరియు స్క్రాంబ్లర్ 1100 స్పోర్ట్ వేరియంట్స్.

రూ. 14 లక్షల ఖరీదైన బైక్ కొనుగోలు చేసిన షాహిద్ కపూర్

షాహిద్ కపూర్ యొక్క స్క్రాంబ్లర్ 1100 స్పెషల్‌ ఎడిషన్‌ బైకును రూ. 11.12 లక్షలతో కొనుగోలు చేశారు. ఇది 1,079 సిసి లిక్విడ్-కూల్డ్, ఎల్-ట్విన్ ఇంజన్‌తో అందుబాటులో ఉంటుంది. కావున ఇది 85 బిహెచ్‌పి పవర్‌ మరియు 88 ఎన్ఎమ్ టార్క్‌ ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ 6-స్పీడ్ ట్రాన్స్‌మిషన్‌తో జత చేయబడింది. ఈ బైక్ యాక్టివ్, జర్నీ మరియు సిటీ అనే మూడు రైడింగ్ మోడ్‌లలో వస్తుంది.

రూ. 14 లక్షల ఖరీదైన బైక్ కొనుగోలు చేసిన షాహిద్ కపూర్

షాహిద్ కపూర్ గ్యారేజీలో అత్యంత ఖరీదైన బైకులలో 'బిఎండబ్ల్యు మోటారాడ్' (BMW Motorrad) యొక్క R1250GS అడ్వెంచర్ బైక్‌ కూడా ఉంది. ఈ బైక్ ధర రూ. 20 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది.

రూ. 14 లక్షల ఖరీదైన బైక్ కొనుగోలు చేసిన షాహిద్ కపూర్

బిఎండబ్ల్యు మోటారాడ్ యొక్క R1250GS కంపెనీ యొక్క ఫ్లాగ్‌షిప్ అడ్వెంచర్-టూరింగ్ బైక్. ఇందులో 1,254 సిసి ఇంజిన్ ఉంటుంది. ఇది 7,750 ఆర్‌పిఎమ్ వద్ద 134 బిహెచ్‌పి పవర్ మరియు 6,250 ఆర్‌పిఎమ్ వద్ద 143 ఎన్ఎమ్ టార్క్‌ ఉత్పత్తి చేస్తుంది. ఇంజన్ స్టాండర్డ్ స్లిప్-అసిస్ట్ క్లచ్‌తో 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది. కావున మంచి పనితీరుని అందిస్తుంది.

రూ. 14 లక్షల ఖరీదైన బైక్ కొనుగోలు చేసిన షాహిద్ కపూర్

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

సాధారణంగా సెలబ్రెటీలకు ఖరీదైన కార్లు మరియు బైకులంటే చాలా ఇష్టం. ఈ కారణంగానే 'షాహిద్ కపూర్' ఇప్పటికే తన గ్యారేజ్ లో ఖరీదైన బైకులను చేర్చాడు. ఇప్పుడు ఈ గ్యారేజ్ లో మరో ఖరీదైన అతిధి చేరింది. మొత్తం మీద అత్యంత ఖరీదైన బైకులు కలిగిన బాలీవుడ్ స్టార్స్ లో 'షాహిద్ కపూర్' ఒకరుగా ఉన్నారు. రానున్న రోజుల్లో తన గ్యారేజ్ లో మరిన్ని ఖరీదైన వాహనాలు చేరే అవకాశం కూడా ఉంది. ఇలాంటి ఆసక్తికరమైన మరిన్ని విషయాలతోపాటు కొత్త కార్లు మరియు బైకుల గురించి మరిన్ని వివరాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి మా తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఫాలో అవ్వండి.

More from DriveSpark

Article Published On: Monday, August 29, 2022, 15:13 [IST]
English summary
Shahid kapoor buys ducati scrambler desert sled bike details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+