బాలీవుడ్ స్టార్ షాహిద్ కపూర్‌ కార్ & బైక్ కలెక్షన్

Shahid Kapoor
బాలీవుడ్ సూపర్‌స్టార్ షాహిద్ కపూర్‌కు కొత్త లవ్ పార్ట్‌నర్ దొరికింది. ఇప్పుడు అతను తన లవ్‌ని పిచ్చి పిచ్చిగా ప్రేమిస్తున్నాడు. తన ఎక్కడికి వెలితే అక్కడికి తన లవ్‌ను వెంటేసుకొని తిరిగేస్తున్నాడు. ఆగండి.. ఆగండి.. లవ్ అంటే అమ్మాయి కాదు, అతని కొత్త సూపర్‌బైక్ హయబుసా. షాహిద్‌కు బైక్ రైడింగ్ అంటే భలే సరదా. అంతేకాదు కొన్ని సోషల్ ఫంక్షన్లకు కూడా షాహిద్ బైక్‌లపైనే వెళ్తుంటాడు. సాధారణంగా షాహిద్ సాయంత్రం సమయాల్లో సూపర్‌బైక్‌పై షికార్లు చేస్తుంటాడు. ఇటీవల రణబీర్ కపూర్ ఇచ్చిన పార్టీకి కూడా తన హయబుసా బైక్‌పై వెళ్లాడు. అంతేకాదు ప్రియాంకా చోప్రా తను కలిసినప్పుడు కూడా బైక్‌పై చక్కర్లు కొడుతూ ఎంజాయ్ చేస్తుంటాడట.

ఆ విషయం అటుంచి మన షాహిద్ కపూర్ వెహికల్ కలెక్షన్‌ని ఒక్కసారి గమనిస్తే...

షాహిదన్ తన 18 ఏటనే ఓ బజాజ్ కాలిబర్ బైక్‌కు యజమాని. గ్రాడ్యువేషన్ చేస్తున్నప్పుడు మారుతి 800 కారును ఉపయోగించిన షాహిద్ ఇప్పుడు జాగ్వార్ ల్యాండ్ రోవర్‌కు ప్రౌడ్ ఓనర్. అంతేకాదు రేంజ్ రోవర్ 2010 మోడల్ కారుకు తొలి వినియోగదారుడు కూడా మన షాహిదే. ముంబైలోని జాగ్వార్ ల్యాండ్ రోవర్ షోరూమ్‌లో టాటా గ్రూపు అధినేత రతన్ టాటా చేతులమీదుగా షాహిద్ ఈ కారు తాళాలను అందుకున్నాడు.

ఇక షాహిద్‌కు బైక్‌లపై ఉన్న ఇంట్రెస్ట్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇటీవలే షాహిద్ ఓ "హ్యార్లీ డేవిడ్‌సన్ ఫ్యాట్ బాయ్" బైకును కొన్నాడు. ఇంకా ఇతనికి "యమహా ఎమ్-01" బైక్ కూడా ఉంది. భవిష్యత్తులో షాహిద్ అత్యంత ప్రతిష్టాత్మకమైన "ఫోర్డ్ మస్టాంగ్" సూపర్‌కారును కూడా కొనాలనుకుంటున్నట్లు సమాచారం. ఇకపోతే మన హీరోకి హమ్మర్ (పొడవాటి కార్లు), సిబిఆర్ 954 ఆర్ఆర్‌ బైక్ అంటే చాలా ఇష్టం. తాను నటించిన ఓ సినిమాలో షాహింద్ ఈ రెండింటినీ ఉపయోగించాడు.

More from DriveSpark

Article Published On: Saturday, May 7, 2011, 17:03 [IST]
English summary
Bollywood actor Shahid Kapoor has found a new love. He is madly in love and always goes around with his lover. Well, are not talking about the woman in his life but his new love - the Hayabusa. He is crazy about the bike and has been seen going to social dos on it rather than zooming around in a fancy car.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+