ఏం ఎంట్రీ గురూ.. 2024 WPLలో షాహిద్ కపూర్ - వైరల్ వీడియో

ప్రముఖ బాలీవుడ్ నటుడు 'షాహిద్ కపూర్' గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇతడు ఇటీవల 2024 ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL)ను ప్రమోట్ చేయడానికి మరియు ప్రారంభ కార్యక్రమానికి హాజరై ప్రేక్షకులను ముగ్దుల్ని చేశారు. మరిన్ని వివరాలు ఇక్కడ చూసేద్దాం.

బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో నటుడు షాహిద్ కపూర్ తన ఖరీదైన 'హార్లే డేవిడ్‌సన్' (Harley Davidson) బైకుపై ఎంట్రీ ఇచ్చారు. ఈ బైకుకు వెనుకవైపు ఫైర్ గన్స్ ఉండటం కూడా చూడవచ్చు. ప్రారంభంలో కొంత సేపు బైక్ రైడ్ చేసుకుంటూ ముందుకు వెళ్లిన షాహిద్ తరువాత బైక్ పక్కన నిలిపి కొందికి దిగారు. ఆ తరువాత నేరుగా స్టేడియంలో ఏర్పాటు చేసిన స్టేడియంవైపు వెళ్లారు.

Shahid Kapoor On Harley Davidson Bike At WPL

అప్పటికే స్టేజి మీద ఉన్న డ్యాన్సర్ల మధ్యకు చేరిన షాహిద్.. డ్యాన్స్ వేయడం కూడా చూడవచ్చు. ఇదంతా ప్రేక్షకులను ఎంతో ఆకర్శించింది. ఈ వీడియోను స్వయంగా షాహిద్ తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది. లక్షల సంఖ్యలో లైక్స్ పొందిన ఈ వీడియోపై పలువురు నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ కూడా చేస్తున్నారు.

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2024 ప్రారంభ వేడుకలకు 'షాహిద్ కపూర్'ను సంబంధిత అధికారులు ఆహ్వానించినట్లు సమాచారం. చిన్నస్వామి స్టేడియంలో ప్రారంభమైన లీగ్ తొలి మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్స్ మరియు ముంబై ఇండియన్స్ మధ్య జరిగింది. హోరాహోరీగా జరిగిన ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ టీమ్.. ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ మీద నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది.

Shahid Kapoor On Harley Davidson Bike At WPL

నిజానికి నటుడు షాహిద్ కపూర్‌కు బైకులంటే చాలా ఇష్టం. ఈ కారణంగానే ఇతని గ్యారేజిలో అనేక అన్యదేశ్య మరియు ఖరీదైన బైకులు ఉన్నాయి. ఇందులో రూ. 14 లక్షల విలువైన 'డుకాటి స్క్రాంబ్లర్ డెజర్ట్ స్లెట్' (Ducati Scrambler Desert Sled) కూడా ఒకటి. వైట్ అండ్ బ్లూ కలర్ పొందిన ఈ బైక్ గోల్డ్ కలర్ వీల్స్ పొందుతుంది.

చూడటానికి ఆకర్షణీయంగా ఉన్న ఈ బైక్ లేటెస్ట్ ఫీచర్స్ పొందుతుంది. ఇందులో 803 సీసీ ఎల్ ట్వీన్ సిలిండర్ ఇంజిన్ ఉంటుంది. ఇది 75 bhp పవర్ మరియు 68 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఈ బైక్ పర్ఫామెన్స్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది.

షాహిద్ కపూర్ వద్ద డుకాటి స్క్రాంబ్లర్ 1100 (Ducati Scrambler 1100) కూడా ఉంది. ఈ స్పెషల్ ఎడిషన్ బైక్ బ్రస్డ్ అల్యూమినియం పార్ట్స్ కలిగి బ్లూ అండ్ గ్రే కలర్ పొందుతుంది. ఈ బైక్ 1079 సీసీ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ కలిగి 7600 rpm వద్ద 85 bhp పవర్ మరియు 4750 rpm వద్ద 88 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది.

డుకాటి బైకులు మాత్రమే కాకుండా షాహిద్ కపూర్ బీఎండబ్ల్యూ ఆర్ 1250 జీఎస్ (BMW R 1250 GS) కూడా ఉంది. ఈ అడ్వెంచర్ టూరింగ్ మోటార్ సైకిల్ మంచి డిజైన్ మరియు ఫీచర్స్ కలిగి బెస్ట్ పర్ఫామెన్స్ అందిస్తుంది. ఈ బైకులో 1254 సీసీ బాక్సర్ ఇంజిన్ ఉంటుంది. ఈ ఇంజిన్ 138 పీఎస్ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది.

ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.

More from DriveSpark

Article Published On: Monday, February 26, 2024, 15:00 [IST]
English summary
Shahid kapoor on harley davidson bike at wpl 2024 inauguration
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+