సూపర్‌స్టార్‌కు సూపర్ గిఫ్ట్ ఇవ్వనున్న షారుఖ్ ఖాన్

అయితే, ఇప్పుడు తాజాగా.. కోలీవుడ్ సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు కూడా షారుఖ్ ఓ అద్దిరిపోయే బహుమానాన్ని ఇవ్వనున్నట్లు సమాచారం. రజనీకి సుమారు ఒక కోటి రూపాయల విలువ చేసే బిఎమ్‌డబ్ల్యూ 7 సిరీస్ సెడాన్‌ను షారుఖ్ బహుమతిగా ఇవ్వనున్నట్లు సినీ వర్గాల టాక్. షారుఖ్‌తో పాటుగా అర్జున్ రామ్‌పాల్, అనుభవ్ సిన్హాలతో సహా మరో ఇరువురికి కూడా షారుఖ్ ఇలాంటి బహుమానాన్ని ఇవ్వనున్నాడట.
అయితే, ఈ విషయాన్ని మాత్రం షారుఖ్ ఇంకా అధికారికంగా ధృవీకరించలేదు. రా.వన్ చిత్రంలో సహకరించినందుకు వారికి ఈ బహుమానాన్ని ఇవ్వాలని షారుఖ్ భావిస్తున్నట్లు రజనీకాంత్ సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి. దీన్నిబట్టి చూస్తే షారుఖ్‌కు తన తాజా చిత్రం రా.వన్ బాగా లాభాలు తెచ్చిపెట్టినట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications








