కొత్త హోండా సిబి500ఎక్స్ బైక్‌ను చెక్ చేసిన బాలీవుడ్ హీరోలు షారుఖ్ ఖాన్, కార్తీక్ ఆర్యన్!
బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ మరియు యువ హీరో కార్తీక్ ఆర్యన్ ఇటీవల ఒకే ఫ్రేమ్ లో కనిపించారు. సినీ పరిశ్రమకు చెందిన ఈ నటీనటులు ఇద్దరూ తాజాగా హోండా సిబి500ఎక్స్ (Honda CB500X) మోటార్‌సైకిల్ ను చెక్ చేస్తూ కనిపించారు. ఇప్పుడు ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన వీడియోలో, షారుఖ్ ఖాన్ మరియు కార్తీక్ ఆర్యన్ ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ, ఈ కొత్త హోండా అడ్వెంచర్ బైక్ తనిఖీ చేస్తూ కనిపిస్తారు.

ఈ వీడియో క్లిప్‌లో, షారూఖ్ ఖాన్ హోండా సిబి500ఎక్స్ అడ్వెంచర్ టూరర్ మోటార్‌సైకిల్ పై కూర్చుని కార్తీక్ ఆర్యన్‌తో మాట్లాడుతున్నట్లు చూడవచ్చు. సమాచారం ప్రకారం, ఈ వీడియో ఇటీవల ముంబైలో జరిగిన ఒక ఈవెంట్ కు సంబంధించింది. అయితే, ఈ కార్యక్రమంలో హోండా సిబి500ఎక్స్ అక్కడ ఎందుకు పార్క్ చేయబడిందో లేదా వారిలో ఎవరైనా దానిని డ్రైవ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారో తెలియరాలేదు. ఏదేమైనప్పటికీ, SRK మాత్రం ఈ కొత్త హోండా బైక్ పట్ల చాలా ఆసక్తిగా ఉన్నట్లు కనిపించింది.

షారూఖ్ ఖాన్ మరియు కార్తీక్ ఆర్యన్ ఇద్దరు బాలీవుడ్ హీరోలు కూడా అనేక విలాసవంతమైన వాహనాలను కలిగి ఉన్నారు. వీరి గ్యారేజ్ పలు అంతర్జాతీయ బ్రాండ్లకు చెందిన కార్లు ఉన్నట్లు సమాచారం. అయితే, వీరిద్దరూ ఎప్పుడూ మోటార్‌సైకిల్ ప్రియులుగా ప్రసిద్ధి చెందలేదు. కార్తీక్ ఆర్యన్ వద్ద మాత్రం రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ ఉంది, అతను ఈ మోటార్‌సైకిల్ నడుపుతూ చాలా అరుదుగా కనిపిస్తాడు. ఇక షారుఖ్ ఖాన్ కి బైక్‌ల కంటే కూడా లగ్జరీ కార్లంటే చాలా ఇష్టం.

కార్తీక్ ఆర్యన్ వద్ద లాంబోర్ఘిని ఉరస్ సూపర్ ఎస్‌యూవీ ఉంది. అతను ఎక్కువగా ఈ కారును ఉపయోగిస్తుంటాడు. కాగా, ఇటీవల ఒక చిత్రంలో తన నటనకు గాను చిత్ర నిర్మాత భూషణ్ కుమార్ నుండి కార్తీక్ ఆర్యన్ ఓ మెక్‌లారెన్ జిటి స్పోర్ట్స్ కారును బహుమతిగా అందుకున్నారు. ఇక షారుక్ ఖాన్ కార్ కలెక్షన్ విషయానికి వస్తే, ఇతను ఇటీవలే కొత్త మెర్సిడెస్ ఎస్-క్లాస్ (మెర్సిడెస్-బెంజ్ ఎస్-క్లాస్) కొనుగోలు చేశాడు. షారుఖ్ వద్ద బిఎమ్‌డబ్ల్యూ 7-సిరీస్ తో పాటుగా మరియు మరికొన్ని ఇతర హై-ఎండ్ లగ్జరీ కార్లు మరియు ఎస్‌యూవీలు కూడా ఉన్నాయి.

హోండా సిబి500ఎక్స్ బైక్ ఎలా ఉంది?
జపనీస్ టూవీలర్ బ్రాండ్ హోండా, భారత మార్కెట్లో కొత్త 2022 మోడల్ హోండా సిబి500ఎక్స్ బైక్ ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో, కంపెనీ తమ పాత మోడల్ స్టాక్ ను క్లియర్ చేసుకునేందుకు దానిపై భారీగా లక్ష రూపాయలకు పైగా తగ్గింపును ప్రకటించింది. కంపెనీ ఇటీవలే 2022 హోండా సిబి500ఎక్స్ (2022 Honda CB500X) అధికారికంగా వెల్లడించింది. ఈ కొత్త మోడల్ ఇప్పుడు అనేక అప్‌డేటెడ్ ఫీచర్లను పొందుతుంది.

హోండా సిబి500ఎక్స్ బైక్ 471 సీసీ ఇంజన్ తో లభిస్తుంది. ఈ అడ్వెంచర్ టూరర్ మోటార్‌సైకిల్ ను కంపెనీ CKD (కంప్లీట్లీ నాక్డ్ డౌన్) యూనిట్ గా విడిభాగాలను భారతదేశంలోకి దిగుమతి చేసుకొని ఇక్కడే స్థానికంగా అసెంబుల్ చేస్తుంది. అంతేకాకుండా, ఈ ప్రీమియం మోటార్‌సైకిల్ ను హోండా తమ బిగ్‌వింగ్ (హై-ఎండ్ బైక్‌లను విక్రయించే) డీలర్‌షిప్ ద్వారా మాత్రమే విక్రయిస్తుంది. ప్రస్తుతం భారత మార్కెట్లో అందుబాటులో ఉన్న హోండా సిబి500ఎక్స్ బైక్ ను కంపెనీ రూ. 6.87 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా) ధరతో విక్రయిస్తోంది. ఈ నేపథ్యంలో, కొత్తగా రాబోయే 2022 మోడల్ కాస్తంత ప్రీమియం ధరను కలిగి ఉండే అవకాశం ఉంది.
హోండా సిబి500ఎక్స్ పెద్ద ఆఫ్రికా ట్విన్ అడ్వెంచర్ బైక్ నుండి ప్రేరణ పొంది రూపొందించబడిన ఎంట్రీ-లెవల్ అడ్వెంచర్ టూరర్ బైక్. ఇది చాలా బలమైన డైమండ్ కట్ ఫ్రేమ్‌పై నిర్మించబడింది. ఈ కొత్త 2022 హోండా సిబి500ఎక్స్ బైక్ లో ముందు వైపు కొత్త 41 మిమీ నాన్-అడ్జస్టబుల్, షోవా SFF-BP USD ఫోర్కులను ఉపయోగించింది, ఇవి మునుపటి టెలిస్కోపిక్ ఫోర్క్‌లను భర్తీ చేస్తాయి.

ఈ కొత్త మోడల్ సస్పెన్షన్ సిస్టమ్ లో కూడా పలు మార్పులు చేయబడ్డాయి. ఇది ఇప్పుడు లైట్ వెయిట్ ఆఫ్-రోడ్ ఉపయోగం కోసం 132 మిమీ వీల్ ట్రావెల్‌ను కలిగి ఉంటుంది మరియు ఆన్-రోడ్ మరియు ఆఫ్-రోడ్ సెటప్ మధ్య సరైన బ్యాలెన్స్‌ను కలిగి ఉంటుంది. బైక్ వెనుక భాగంలో 9-దశల స్ప్రింగ్ ప్రీ-లోడ్ అడ్జస్ట్‌మెంట్ సిస్టమ్‌తో హోండా ప్రో-లింక్ సస్పెన్షన్ సిస్టమ్ ఉంది.

ఇతర మార్పులలో కొత్త అల్యూమినియం ఫ్రంట్ వీల్ గురించి చెప్పుకోవచ్చు, ఇది మునుపటి వీల్ కంటే 100 గ్రామ్స్ తేలికైనది. ఈ మార్పు వలన మోటార్‌సైకిల్ యొక్క రైడ్ మరియు హ్యాండ్లింగ్ అద్భుతంగా ఉంటుంది. ఇక దీని ఇంజన్ లో ఎలాంటి మార్పులు లేవు. కంపెనీ ఈ కొత్త హోండా CB500X మోటార్‌సైకిల్ యొక్క పవర్‌ట్రెయిన్‌లో ఎలాంటి మార్పులు చేయలేదు. ఇందులోని అదే 471 సిసి లిక్విడ్-కూల్డ్ పారలల్-ట్విన్ ఇంజన్ గరిష్టంగా 8,500 ఆర్‌పిఎమ్ వద్ద 47 బిహెచ్‌పి పవర్ ను మరియు 6,500 ఆర్‌పిఎమ్ వద్ద 43.2 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది.

ఈ ఇంజన్ 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది. సులభమైన అప్ మరియు డౌన్‌షిఫ్ట్‌ల కోసం ఇందులో స్లిప్పర్ క్లచ్ సిస్టమ్‌ను కూడా అందిస్తున్నారు. ఇతర ఫీచర్లలో ఎమర్జెన్సీ స్టాప్ సిగ్నల్ లేదా ESS, హోండా ఇగ్నిషన్ సెక్యూరిటీ సిస్టమ్ (HISS), ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌పై డ్యూయల్ ఛానల్ ABS మరియు డ్రైవర్ సమాచారం కోసం ఎల్‌సిడి డిస్‌ప్లే వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.


Click it and Unblock the Notifications








