రూ. 6.5 కోట్ల ఖరీదైన రోల్స్ రాయిస్ కల్లినన్ కారులో షారుఖ్ ఖాన్.. ఆ సినిమా సెలబ్రేషన్స్‌లో సందడి.!!
బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ నటించిన కుచ్ కుచ్ హోతా హై సినిమా 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా చిత్ర బృందం రీయూనియన్ జరిగింది. ఆ వేడుకకు షారుఖ్ లగ్జరీ కారులో వచ్చారు.
ఇటీవల షారుఖ్ ఖాన్(Shahrukh Khan) నటించిన జవాన్(Jawaan) విడుదలై బాక్సాఫీస్ వద్ద సంచలనం విజయం సాధించింది. దీంతో షారుఖ్ జవాన్ సక్సెస్ ఖుషీలో ఉన్నారు. కాగా గత ఆదివారం(అక్టోబర్ 15)తో షారుఖ్, రాణీ ముఖర్జీ, కాజోల్ నటించిన 'కుచ్ కుచ్ హోతా హై' సినిమా పాతికేళ్లు పూర్తి చేసుకోవడంతో చిత్ర బృందం సెలబ్రేట్ చేసుకుంది.

ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు కరణ్ జోహార్ ముంబయిలో 3 స్పెషల్ షోలు ఏర్పాటు చేశారు. ఈ సినిమాను వీక్షించేందుకు థియేటర్‌కు షారూఖ్ ఖాన్ రోల్స్ రాయిస్ కల్లినన్ లగ్జరీ కారులో వచ్చారు. కాగా నటి రాణి ముఖర్జీ మెర్సిడెస్-మేబాచ్ ఎస్-క్లాస్, డైరెక్టర్ కరణ్ జోహార్ ఆడి A8 కారులో వచ్చారు.
ఈవెంట్‌లో షారుఖ్ ఖాన్, కరణ్ జోహార్ నలుపు రంగు దుస్తులు ధరించారు. కాగా బాలీవుడ్ బ్యూటీ రాణి ముఖర్జీ తెల్లటి చీరలో ఆకట్టుకుంది. షారుఖ్ ఖాన్ తన పర్సనల్ భద్రతా సిబ్బందితో కలిసి సినిమా చూసేందుకు వచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియోనూ ఓ యూట్యూబ్ ఛానల్‌లో షేర్ చేశారు. కాగా సెక్యూరిటీ సిబ్బంది MG గ్లోస్టర్ కారులో వచ్చారు.

కాగా లగ్జరీ రోల్స్ రాయిస్ కల్లినన్(Rolls Royce Cullinan) దేశంలో అత్యంత ఖరీదైన SUV గా నిలిచింది. దీని ధర రూ. 6.5 కోట్లు పలుకుతోంది. సినీ సెలబ్రిటీల్లో బాలీవుడ్‌లో అజయ్ దేవగన్, టి-సిరీస్ ఓనర్ భూషణ్ కుమార్ తర్వాత లగ్జరీ రోల్స్ రాయిస్ కారును కొనుగోలు చేసిన మూడో వ్యక్తి షారుఖ్ ఖాన్‌గా నిలిచారు.
రోల్స్ రాయిస్ కల్లినన్ లగ్జరీ ఎస్‌యూవీని 2018లో ప్రారంభించారు. ఈ కారు ఆల్ వీల్ డ్రైవ్ టెక్నాలజీతో వస్తుంది. 5-సీటర్ సదుపాయంతో ఉంది. రోల్స్ రాయిస్ కల్లినన్ 6.75-లీటర్ V12 పెట్రోల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇది 600 PS గరిష్ఠ శక్తిని, 900 Nm గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇంకా ఇందులో 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ జతచేయబడింది. 9.5kmpl మైలేజ్ ఇస్తుంది.

ఈ ఖరీదైన రోల్స్ రాయిస్ కల్లినన్ లగ్జరీ ఎస్‌యూవీలో చాలా అధునాతన ఫీచర్లు ఉన్నాయి. ఇందులో వెనుక సీట్ల ప్రయాణికుల కోసం అనుగుణంగా డ్యూయల్ 12 అంగుళాల డిస్‌ప్లేతో పాటు ఫోల్ట్ అవుట్ ఆర్మ్ రెస్ట్‌తో చాలా సౌకర్యంగా రూపొందించారు. ఇంకా WiFi హాట్‌స్పాట్, హెడ్స్-అప్ డిస్‌ప్లేను కలిగి ఉంటూ.. భద్రత విషయంలో కూడా ఎక్కడా రాజీ పడలేదు.
ప్రయాణికుల సేఫ్టీ విషయంలో రోల్స్ రాయిస్ కల్లినన్ అత్యంత ప్రాధాన్యత ఇచ్చింది. మల్టీ ఎయిర్‌బ్యాగ్‌లు ఉన్నాయి. డే అండ్ నైట్ టైంలలో ప్రయాణించేటప్పుడు.. డ్రైవర్‌కు వన్యప్రాణులు, పాదచారులకు సంబంధించి హెచ్చరికలు జారీ చేస్తుంది. ఇంకా క్రూయిజ్ కంట్రోల్, క్రాస్ ట్రాఫిక్ వార్నింగ్, లేన్ డిపార్చర్, లేన్ ఛేంజ్ వార్నింగ్‌తో సహా డజన్ల కొద్దీ ఫీచర్లను కలిగి ఉంది.
కాగా ఇప్పటికే షారుఖ్ ఖాన్ నివాసంలోని గ్యారేజీలో ఎక్కువగా లగ్జరీ కార్లే ఉన్నాయి. వాటి జాబితాలో ఇప్పుడు రోల్స్ రాయిస్ కల్లినన్ కూడా చేరింది. చిత్ర బృందంతో కలిసి సినిమా వీక్షించిన అనంతరం షారుఖ్.. బయటకు వచ్చి ఫ్యాన్స్‌కు హగ్ ఇచ్చారు. అనంతరం కారులో వెళ్లిపోయారు.


Click it and Unblock the Notifications








