ఫార్ములా వన్ ద్వారా రా.వన్ సినిమా ప్రమోషన్!!

ఈ నేపథ్యంలో ఈనెల 28 నుండి మూడు రోజుల పాటు భారతదేశంలోనే మొట్టమొదటి సారిగా జరగనున్న 'ఎయిర్‌టెల్ ఇండియన్ గ్రాండ్ ప్రి 2011'లో పాల్గొనే ఫార్ములా వన్ రేస్ కార్లపై కూడా షారుఖ్ తన రా.వన్ చిత్రాన్ని ప్రమోట్ చేయనున్నారు. ఈ చిత్రాన్ని షారుఖ్ ఖాన్ సతీమణి గౌరీ ఖాన్ నిర్మిస్తోంది. స్వంత చిత్రం, కావడం అందులో భారీ బడ్జెట్ వెచ్చించి ఈ సినిమాను రూపొందించడంతో ప్రచారంపై షారుఖ్ అధిక మొత్తాన్నే వెచ్చిస్తున్నాడు.
ఈ మేరకు సహారా ఫోర్స్ ఇండియా ఫార్ములా వన్ జట్టుతో కింగ్ ఖాన్ ఓ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాడు. ఈ టీమ్ తరఫున పాల్గొనే ఫార్ములా వన్ కార్లపై రా.వన్ చిత్రానికి సంబంధించిన స్టిల్స్‌ను, పోస్టర్లను ప్రమోట్ చేయనున్నారు. ఈ ఫార్ములా వన్ రేస్‌కు ప్రపంచం నలుమూలల నుండి ఎఫ్1 అభిమానులు విచ్చేయనున్నారు. దీంతో షారుఖ్ రా.వన్ చిత్రానికి కేవలం భారత్‌లో మాత్రమే కాకుండా ప్రపంచ దేశాల్లో కూడా పబ్లిసిటీ లభించినట్లు అవుతుంది. మరి కింగ్ ఖానా మజాకా..!!


Click it and Unblock the Notifications








