షారుఖ్‌కి కూడా లైఫ్ థ్రెట్; రూ.10 కోట్ల బుల్లెట్ ప్రూఫ్ కార్

By Ravi

గతంలో ప్రముఖ బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ రౌడీ మూకల నుంచి బెదిరింపులు వస్తున్నాయనే కారణంతో సుమారు రూ.10 కోట్ల రూపాయల విలువైన బుల్లెట్ ప్రూఫ్ మెర్సిడెస్ బెంజ్ కారును కొనుగోలు చేసినట్లు మనం చదువుకున్నాం. ఇప్పుడు మరో బాలీవుడ్ నటుడు కూడా అమీర్ ఖాన్ తరహాలో అదే రకమైన బుల్లెట్ ప్రూఫ్ కారును కొనుగోలు చేశారు. ఆయనే, మన బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్.

బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్‌కు ముంబై మాఫియా నుంచి థ్రెట్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆయనకు పలు బెదిరింపులు కూడా వచ్చినట్లు సమాచారం. ఈ విషయాన్ని గ్రహించిన భద్రతా సిబ్బంది కూడా షారుఖ్ ఖాన్‌కు భద్రతను మరింత పటిష్టం చేశారు. షారుఖ్ ఖాన్ మిత్రుడు, బాలీవుడ్ నిర్మాత అలీ మొరానీని బెదిరించేందుకు కొందరు దుండగులు, అతని ఇంటివద్ద ఎవ్వరూ లేని సమయం చూసుకొని కాల్పులు జరిపి పారిపోయారు.

ఈ కాల్పుల సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవటంతో ప్రమాదం ఏమీ జరగలేదు. కేవలం మోరానీని బెదిరించేందుకే ఈ కాల్పులు జరిపినట్లు సమాచారం. షారుఖ్ ఖాన్‌‌కు అలీ మొరానీ చాలా సన్నిహితుడు, వ్యాపార భాగస్వాముడు కూడా! ఈ పరిస్థితుల నేపథ్యంలో, షారుఖ్ ఖాన్ ముందస్తు జాగ్రత్తగా ఓ బాంబ్ అండ్ బుల్లెట్ ప్రూఫ్ మెర్సిడెస్ బెంజ్ కారును కొనుగోలు చేసినట్లు సినీ వర్గాలు చెప్పుకొంటున్నాయి.

మెర్సిడెస్ బెంజ్ ఎస్600 గార్డ్ బుల్లెట్ ప్రూఫ్ కారు

తర్వాతి స్లైడ్‌లలో షారుఖ్ ఖాన్ ఉపయోగించనున్న 'మెర్సిడెస్ బెంజ్ ఎస్600 గార్డ్' బుల్లెట్ ప్రూఫ్ కారు గురించి మరింత సమాచారాన్ని తెలుసుకోండి.

మెర్సిడెస్ బెంజ్ ఎస్600 గార్డ్ బుల్లెట్ ప్రూఫ్ కారు

జర్మన్ లగ్జరీ కార్ కంపెనీ మెర్సిడెస్ బెంజ్ ఇండియా, విఐపిల భద్రత కోసం గడచిన ఆగస్ట్ నెలలో 'మెర్సిడెస్ బెంజ్ ఎస్600 గార్డ్' (Mercedes-Benz S600 Guard) పేరిట ఓ బుల్లెట్ ప్రూఫ్ కారును విడుదల చేసింది. కంపెనీ అందిస్తున్న రెగ్యులర్ ఎస్-క్లాస్ కారుకు సాయుధ వెర్షనే ఈ ఎస్600 గార్డ్.

మెర్సిడెస్ బెంజ్ ఎస్600 గార్డ్ బుల్లెట్ ప్రూఫ్ కారు

బుల్లెట్ దాడులు, బాంబు దాడులను సమర్థవంతంగా తట్టుకుని, కారు లోపల ఉన్న ప్రయాణీకులకు పూర్తి రక్షణ కల్పించేలా దీనిని ప్రత్యేకమైన, ధృడమైన స్టీల్‌తో తయారు చేశారు. ఇది పాలీకార్బోనేట్ కోట్‌ని కలిగి ఉండి, లోపల ఉన్న ప్రయాణీకులను సురక్షితంగా ఉంచడంలో సహకరిస్తుంది.

మెర్సిడెస్ బెంజ్ ఎస్600 గార్డ్ బుల్లెట్ ప్రూఫ్ కారు

ఈ కారులో పవర్‌ఫుల్ 6.0 లీటర్ వి12 పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 530 బిహెచ్‌పిల శక్తిని, 830 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 7జి-ట్రానిక్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్‌తో అనుసంధానం చేయబడి ఉంటుంది. ఎస్-క్లాస్ గార్డ్ గరిష్ట వేగం గంటకు 210 కిలోమీటర్లు.

మెర్సిడెస్ బెంజ్ ఎస్600 గార్డ్ బుల్లెట్ ప్రూఫ్ కారు

రెగ్యులర్ ఎస్-క్లాస్‌కు మరియు సాయుధ ఎస్-క్లాస్ గార్డ్ కార్లకు మధ్య ఎలాంటి వ్యత్యాసం కనిపించకుండా ఉండేలా కంపెనీ జాగ్రత్తలు తీసుకుంది. ఈ రెండు రకాల కార్లను పక్కపక్కనే ఉంచితే, ఇందులో ఏది రెగ్యులర్ కారు లేక ఏది బుల్లెట్ ప్రూఫ్ కారు అనేది గుర్తించడం కష్టమవుతుంది (సెక్యూరిటీ కోసమే ఇలా చేశారు).

మెర్సిడెస్ బెంజ్ ఎస్600 గార్డ్ బుల్లెట్ ప్రూఫ్ కారు

సేఫ్టీ, సెక్యూరిటీకి సంబంధించిన అన్ని టెస్టులను ఈ కారు పాస్ అయ్యింది. ఇందులోని గ్లాస్ ఏరియాని లోపలి వైపు నుంచి పాలీకార్బోనేట్‌తో కోటింగ్ చేశారు, ఇంకా ఇది ల్యామినేటెడ్ స్ట్రక్చర్‌ను కూడా కలిగి ఉంటుంది.

మెర్సిడెస్ బెంజ్ ఎస్600 గార్డ్ బుల్లెట్ ప్రూఫ్ కారు

ఇంకా ఇందులో పానిక్ అలారమ్ సిస్టమ్, ఓపాక్యూ రోలర్ బ్లైండ్స్, ఎమర్జెన్సీ ఫ్రెష్ ఎయిర్ సిస్టమ్, హైడ్రాలిక్ సైడ్ విండో, గింబాల్ రియర్ ఎల్ఈడి రీడింగ్ ల్యాంప్స్, స్పెషల్ రియర్ కూలింగ్ కంపార్ట్‌మెంట్, హీటెడ్ విండ్‌స్క్రీన్ అండ్ సైడ్ విండోస్ మొదలైన సేఫ్టీ ఫీచర్లున్నాయి.

మెర్సిడెస్ బెంజ్ ఎస్600 గార్డ్ బుల్లెట్ ప్రూఫ్ కారు

ఆమీర్ ఖాన్ బుల్లెట్ ప్రూఫ్ కారు వివరాల కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

More from DriveSpark

Article Published On: Friday, October 17, 2014, 15:35 [IST]
English summary
Actor Shah Rukh Khan has bought a bomb proof Mercedes Benz for Rs. 10 crores (roughly $1.6 million), months after there were reports that he had received threats too from the Mafia, apart from producer Ali Morani who house in Juhu had been fired on. 
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+