ఓటు వేసేందుకు కోట్ల రూపాయల కారులో వచ్చిన హీరోయిన్.. వీడియో చూసారా

దేశంలో సార్వత్రిక ఎన్నికలు జోరుగా సాగుతున్నాయి. ఇప్పటికి ఐదు దశల్లో వివిధ రాష్ట్రాల్లో ఓటింగ్ ప్రక్తియ ముగిసింది. ఇంకో రెండు దశల్లో మాత్రమే ఎన్నికలు జరగాల్సి ఉంది. నిన్న ముంబైలో ఎన్నికలు జరిగాయి. ఎంతోమంది ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

నిన్న ఓటు హక్కును వినియోగించుకున్న సెలబ్రిటీలలో బాలీవుడ్ నటి శిల్పాశెట్టి కూడా ఉన్నారు. ఈమె ఓటు వేయడానికి ఓ ఖరీదైన ల్యాండ్ రోవర్ కారులో పోలింగ్ బూత్ వద్దకు వచ్చింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియోలో గమనిస్తే శిల్పాశెట్టి.. తన చెల్లెలు మరియు అమ్మతో కలిసి వచ్చింది. వీరంతా బ్లాక్ కలర్ ల్యాండ్ రోవర్ కారులో కనిపించారు.

Shilpa Shetty Arrives in Land Rover Car

నటి శిల్పాశెట్టి నిన్న (మే 20) మధ్యాహ్నం ఓటు వేయటానికి తన ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ కారులో వచ్చారు. ఈ కారు ధర రూ. 2.0 కోట్ల నుంచి రూ. 3.3 కోట్ల వరకు ఉంటుందని తెలుస్తోంది. ఓటు వేసిన తరువాత.. ఓటు వేసినట్లు చూపిస్తూ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. నెట్టింట్లో దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. పలువురు అభిమానులు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు.

శిల్పాశెట్టి రేంజ్ రోవర్ విషయానికి వస్తే.. ఇది నలుపు రంగులో చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంది. మంచి డిజైన్ మరియు ఫీచర్స్ కలిగి ఉండటం వల్ల ఈ కారును ఎక్కువమంది సెలబ్రిటీలు ఇష్టపడి మరీ కొనుగోలు చేస్తుంటారు. కాబట్టి చాలామంది సెలబ్రిటీల గ్యారేజిలో ల్యాండ్ రోవర్ కార్లు ఉంటాయి. ల్యాండ్ రోవర్ కార్ల ధరలు కొంత ఎక్కువగా ఉంటాయి, కాబట్టి సాధారణ ప్రజలు వీటిని ఎక్కువగా కొనుగోలు చేయలేరు.

Shilpa Shetty Arrives in Land Rover Car

ల్యాండ్ రోవర్ కారు మాత్రమే కాకుండా శిల్పాశెట్టి గ్యారేజిలో.. బెంట్లీ కాంటినెంటల్ జీటీ, మెర్సిడెస్ మేబ్యాచ్ జీఎల్ఎస్600, మెర్సిడెస్ బెంజ్ జె63 AMG, బీఎండబ్ల్యూ ఎక్స్5, బీఎండబ్ల్యూ 7 సిరీస్, రేంజ్ రోవర్ వోగ్, మెర్సిడెస్ బెంజ్ వీ-క్లాస్ వంటి వాటితో పాటు లంబోర్ఘిని అవెంటడార్, లంబోర్ఘిని గల్లార్డో, బీఎండబ్ల్యూ ఐ8 మరియు పోర్స్చే కార్లు ఉన్నాయని తెలుస్తోంది.

ముంబైలో ఓటు హక్కు వినియోగించుకున్న సెలబ్రిటీలలో శిల్పాశెట్టి మాత్రమే కాకుండా వరుణ్ ధావన్, ఆయన తండ్రి డేవిడ్ ధావన్‌.. రకుల్ ప్రీత్ సింగ్, జాకీ భగ్నానీ మరియు సంజయ్ దత్ మొదలైన వారు ఉన్నారు. వీరందరూ ఓటు వేయడానికి తమ ఖరీదైన కార్లలో పోలింగ్ బూత్ వద్దకు వచ్చారు. ఓటు వేసిన తరువాత మీడియాతో మాట్లాడి వెళ్లిపోయారు. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

సెలబ్రిటీలు మాత్రమే కాకుండా.. పారిశ్రామిక వేత్తలు కూడా ముంబైలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వీరిలో దేశీయ పారీరమిక దిగ్గజం రతన్ టాటా, ఆనంద్ మహీంద్రా, కుమార మంగళం బిర్లా, ముఖేష్ అంబానీ, నీతా అంబానీ, అనిల్ అంబానీ మొదలైన వారు ఉన్నారు. ముఖేష్ అంబానీ, నీతా అంబానీ ఓటు వేయడానికి తమ మెర్సిడెస్ బెంజ్ కారులో వచ్చారు. వీరందరూ ఓటు వేసిన తరువాత ప్రజలందరూ ఓటు వేయాలను కోరారు.

ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.

More from DriveSpark

Article Published On: Tuesday, May 21, 2024, 15:00 [IST]
English summary
Shilpa shetty arrives in land rover car to cast vote in mumbai
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+