Just In
- 11 hrs ago
మతిపోగొడుతున్న హ్యుందాయ్ మార్చ్ నెల డిస్కౌంట్స్.. దేనిపై ఎంతో చూసారా..!
- 14 hrs ago
భారత్‌లో విడుదలైన 3 కొత్త NIJ ఎలక్ట్రిక్ స్కూటర్స్.. చీప్ కాస్ట్ & మోర్ ఫీచర్స్
- 15 hrs ago
గుడ్ న్యూస్! ఇకపై ఈ సేవల కోసం ఆర్టీఓ చుట్టూ తిరగక్కర్లేదు, అన్నీ ఆన్లైన్లోనే..
- 16 hrs ago
కేవలం 65,920 రూపాయలకే కొత్త బజాజ్ ప్లాటినా 110 ఎబిఎస్ బైక్ ; వివరాలు
Don't Miss
- News
వేద మంత్రాన్నివింటే లాభమొస్తుందా...ఎలా..?
- Lifestyle
శనివారం దినఫలాలు : ఓ రాశి ఉద్యోగులకు ఉన్నతాధికారులతో మంచి సమన్వయం ఉంటుంది...!
- Finance
ధరలు ఎలా ఉన్నాయంటే? 44వేలకు దిగొచ్చిన బంగారం, వెండి రూ.66 వేల దిగువన
- Sports
ఆ విషయంలో రోహిత్ శర్మను చూసి విరాట్ కోహ్లీ నేర్చుకోవాలి: మనోజ్ తివారీ
- Movies
‘A’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
శిల్పా శెట్టి గ్యారేజ్‌లో చేరిన మరో ఖరీదైన లగ్జరీ కార్, ఇదే
హిందీ, కన్నడ మరియు తెలుగు సినిమాలలో నటించిన ప్రముఖ బాలీవుడ్ నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రా ఇటీవల విలాసవంతమైన మెర్సిడెస్ బెంజ్ వి క్లాస్ ఎంపివిని కొనుగోలు చేశారు. శిల్పా శెట్టి తన భర్త, తల్లి మరియు సోదరి షమితా శెట్టితో కలిసి ఈ లగ్జరీ ఎంపివిలో ప్రయాణిస్తున్నట్లు కనిపించారు. ఈ లగ్జరీ ఎంపివిలో శిల్పా శెట్టి తన కుటుంబంతో కలిసి రెస్టారెంట్‌కి వచ్చినట్లు తెలుస్తుంది.

మెర్సిడెస్ బెంజ్ వి క్లాస్ ఎంపివిని ధర భారత మార్కెట్లో అక్షరాలా రూ. 71 లక్షల ధరతో ప్రారంభమవుతుంది. దీని టాప్ వేరియంట్ ధర రూ. 1.46 కోట్ల వరకు ఉంటుంది. వి క్లాస్ ఎంపివి 4, 5, మరియు 7 సీట్ల సామర్థ్యాలు ఉన్నాయి. వీటిని వాహనదారుని సౌలభ్యం కోసం పెంచవచ్చు మరియు తగ్గించవచ్చు.

మెర్సిడెస్ బెంజ్ వి క్లాస్ ఫ్యామిలీ రోడ్ ట్రిప్స్, అడ్వెంచర్ రైడ్స్ మరియు వారాంతాల్లో కుటుంభాలతో కలిసి వెళ్ళడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఇది చాలా పెద్ద ఎంపివి కావున, ఫ్యామిలీ ట్రిప్ కి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ మెర్సిడెస్ బెంజ్ వి క్లాస్ లో చాలా లేటెస్ట్ ఫీచర్స్ అందించబడ్డాయి.
MOST READ:ప్రమాదానికి గురైన శిల్పా శెట్టి భర్త కార్, కానీ కార్‌లో ఉన్నది మాత్రం అతడు కాదు.. ఇంకెవరు

మెర్సిడెస్ బెంజ్ వి క్లాస్ ఎంపివి యొక్క ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో మల్టీ-ఫంక్షన్ స్టీరింగ్ వీల్, యాంబియంట్ లైటింగ్, రియర్ విండో ఓపెనింగ్, ఎల్‌ఇడి హెడ్‌ల్యాంప్, ఎల్‌ఇడి టెయిల్ లైట్, 360 డిగ్రీ కెమెరా, పార్కింగ్ అసిస్ట్, అడ్జస్టబుల్ సస్పెన్షన్ మరియు 16 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ ఉన్నాయి.

మెర్సిడెస్ బెంజ్ యొక్క ఐకానిక్ గ్రిల్ కూడా ఇందులో ఉంటుంది. ఈ కారులో, మంచి సేఫ్టీ ఫీచర్స్ ఉన్నాయి. ఇందులో 6 ఎయిర్‌బ్యాగులు, ఎబిఎస్ విత్ ఇబిడి, క్రూయిజ్ కంట్రోల్ వంటివి ఉన్నాయి. అంతే కాకుండా ఈ కారులో డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, టచ్ డిస్ప్లే కూడా ఉన్నాయి.
MOST READ:ఫ్రెంచ్ బ్రాండ్ సిట్రోయెన్ సి5 ఎయిర్‌క్రాస్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ.. వచ్చేసింది.. చూసారా..!

బెంజ్ వి క్లాస్ ఎంపివిలో ఫోల్డింగ్ రియర్ సీట్లు ఉన్నాయి. వీటిని ఫ్లవర్ సైజ్ బెడ్‌గా మార్చుకోవచ్చు. కారు పైకప్పును కూడా ఓపెన్ చేసి మంచంగా మార్చుకోవడానికి అనుకూలంగా ఉంటుంది.

మెర్సిడెస్ బెంజ్ వి క్లాస్ ఎంపివిలో, 2.0-లీటర్ 4 సిలిండర్ డీజిల్ ఇంజిన్ కలిగి ఉంది, ఇది 239 బిహెచ్‌పి పవర్ మరియు 500 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు కేవలం 9 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. ఈ కారు ట్రాన్స్మిషన్ కోసం 9 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ కలిగి ఉంది.
MOST READ:జరిమానా విధించాడని పోలీస్ స్టేషన్‌కే కరెంట్ కట్.. ఎక్కడో తెలుసా..!

మెర్సిడెస్ బెంజ్ వి-క్లాస్ భారతదేశంలో టయోటా వెల్‌ఫైర్ మరియు కియా కార్నివాల్ ఎంపివి వంటి వాటికీ ప్రత్యర్థిగా ఉంటుంది. టయోటా వెల్‌ఫైర్ మరియు కియా కార్నివాల్ ఫీచర్స్ పరంగా బెంజ్ వి-క్లాస్ కంటే వెనుకబడి ఉన్నాయి. మెర్సిడెస్ బెంజ్ వి-క్లాస్ నిజంగానే బ్రాండ్ యొక్క విలాసవంతమైన లగ్జరీ కార్.