ఆయన ఓ రోల్స్ రాయిస్ ఓనర్, కోటీశ్వరుడు.. కానీ విద్యుత్ దొంగిలించాడు!

ఇటీవల 8 కోట్ల రూపాయల విలువైన రోల్స్ రాయిస్ కొనుగోలు చేసిన ఓ ప్రముఖ మహారాష్ట్ర రాజకీయ నాయకుడు ఇప్పుడు విద్యుత్ చౌర్యం కేసులో ఆరోపణలు ఎదుర్కుంటున్నాడు. విద్యుత్ చౌర్యం కేసులో ముఖ్యాంశాల్లోకి చేరిన ఆ నేత ఎవరు? అంతటి లక్షాధికారి విద్యుత్ చౌర్యానికి పాల్పడం ఏంటి? ఆ వివరాలేంటో తెలుసుకుందాం రండి.

ఆయన ఓ రోల్స్ రాయిస్ ఓనర్, కోటీశ్వరుడు.. కానీ విద్యుత్ దొంగిలించాడు!

ఇటీవలి కాలంలో రోల్స్ రాయిస్ కార్లను కలిగి ఉన్న ఓనర్లు వివిధ రకాల కేసుల్లో తెరపైకి వస్తుండటాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. రోల్స్ రాయిస్ లగ్జరీ కారుపై దిగుమతి సుంఖం ఎగవేత కేసులో ప్రముఖ తమిళ నటుడు విజయ్‌కు అక్కడి కోర్టు లక్ష రూపాయల జరిమానా విధించిన సంగతి తెలిసినదే. కాగా, ఇప్పుడు అలాంటి ఓ రోల్స్ రాయిస్ కారును కలిగి ఉన్న శివసేన పార్టీ నేత ఒకరు విద్యుత్ చౌర్యం కేసులో బుక్ అయ్యారు.

ఆయన ఓ రోల్స్ రాయిస్ ఓనర్, కోటీశ్వరుడు.. కానీ విద్యుత్ దొంగిలించాడు!

మహారాష్ట్రలోని కళ్యాన్ ప్రాంతానికి చెందిన శివసేన పార్టీ నేత మరియు ప్రముఖ వ్యాపారవేత్త అయిన సంజయ్ గైక్వాడ్‌పై సుమారు రూ.35,000 విలువైన విద్యుత్‌ను దొంగతం చేసినట్లు ఆ రాష్ట్ర అధికారులు కేసు నమోదు చేశారు.

ఈ మేరకు మహారాష్ట్ర స్టేట్ ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (ఎంఎస్‌ఇడిసిఎల్) అధికారులు అతనిపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కల్యాణ్‌లోని కోల్‌సేవాడి పోలీస్ స్టేషన్‌లో సంజయ్ గైక్వాడ్‌పై ఈ కేసు నమోదైంది.

ఆయన ఓ రోల్స్ రాయిస్ ఓనర్, కోటీశ్వరుడు.. కానీ విద్యుత్ దొంగిలించాడు!

సంజయ్ గైక్వాడ్ రూ.34,640 బకాయిలు చెల్లించలేదని మహారాష్ట్ర స్టేట్ ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ తన ఫిర్యాదులో పేర్కొంది. కల్యాణ్ ఈస్ట్‌లోని కొక్సేవాడి ప్రాంతంలో గైక్వాడ్ నడుపుతున్న నిర్మాణ స్థలంలో విద్యుత్ దొంగతనం గురించి ఎమ్ఎస్ఇడిసిఎల్ అధికారులు గడచిన మార్చిలో తెలుసుకున్నారని వర్గాలు తెలిపాయి.

ఆయన ఓ రోల్స్ రాయిస్ ఓనర్, కోటీశ్వరుడు.. కానీ విద్యుత్ దొంగిలించాడు!

ఈ విషయాన్ని తెలుసుకునేందుకు ఎమ్ఎస్ఇడిసిఎల్ అధికారులు స్వయంగా రంగంలోకి దిగారు. ఈ కేసులో వివరాలు, ఆధారాలను సేకరించిన తర్వాత సంస్థ సంజయ్ గైక్వాడ్‌కు రూ.34,840 బిల్లు మరియు రూ.15,000 జరిమానా చెల్లించాల్సిందిగా నోటీసులు పంపినట్లు సమాచారం.

ఆయన ఓ రోల్స్ రాయిస్ ఓనర్, కోటీశ్వరుడు.. కానీ విద్యుత్ దొంగిలించాడు!

ఎమ్ఎస్ఇడిసిఎల్ బృందం దర్యాప్తు చేసిన వివరాల ప్రకారం, ఆ ప్రాంతంలో అధికారికంగా విద్యుత్‌ను కొలిచే సాధనాలు లేవని, అందువల్ల వారు విద్యుత్ దొంగతనానికి పాల్పడినట్లు నిర్ధారించామని తెలిపారు. గైక్వాడ్ మూడు నెలల పాటు బిల్లు చెల్లించడం మరియు జరిమానాను చెల్లించడంలో విఫలమైనందున ఎమ్ఎస్ఇడిసిఎల్ అధికారులు జూన్ 30వ తేదీన అతడిపై విద్యుత్ దొంగతనం కేసు నమోదు చేశారు.

ఆయన ఓ రోల్స్ రాయిస్ ఓనర్, కోటీశ్వరుడు.. కానీ విద్యుత్ దొంగిలించాడు!

ఇదిలా ఉంటే, జూలై 12వ తేదీన సంజయ్ గైక్వాడ్ రూ.49,840 మొత్తాన్ని ఎమ్ఎస్ఇడిసిఎల్ సంస్థకు చెల్లించినట్లు సమాచారం. ఇందులో "విద్యుత్ దొంగతనం" కోసం రూ.34,840 మరియు "సెటిల్మెంట్ మొత్తం"గా జరిమానా క్రింద రూ.15,000 చెల్లించినట్లు ఎమ్ఎస్ఇడిసిఎల్ గడచిన సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది.

ఈ విషయంపై శివసేన పార్టీ కార్యకర్త సంజయ్ గైక్వాడ్ స్పందిస్తూ, ఎమ్ఎస్ఇడిసిఎల్ తనపై వేసిన ఆరోపణలన్నీ తప్పు అని పేర్కొన్నాడు. తాను ఎటువంటి విద్యుత్ చౌర్యానికి పాల్పడలేదని, దీనిపై మరింత దర్యాప్తు చేయాలని ఆయన సంబంధిత అధికారులను కోరారు.

ఆయన ఓ రోల్స్ రాయిస్ ఓనర్, కోటీశ్వరుడు.. కానీ విద్యుత్ దొంగిలించాడు!

ఇకపోతే, సంజయ్ గైక్వాడ్ కొనుగోలు చేసిన రోల్స్ రాయిస్ కారు యొక్క ఖచ్చితమైన మోడల్‌కు సంబంధించి ఎలాంటి వివరాలు లేవు కానీ, అది ఈ ఏడాది ప్రారంభంలో భారతదేశంలో విడుదలైన అయిన కొత్త తరం రోల్స్ రాయిస్ ఘోస్ట్ కావచ్చని సమాచారం. ఆయన వద్ద రోల్స్ రాయిస్ మాత్రమే కాకుండా టొయోటా ఫార్చ్యూనర్ మరియు టొయోటా ఇన్నోవా వంటి ఇతర ప్రసిద్ధ కార్లు కూడా ఉన్నట్లు సమాచారం.

Most Read Articles

English summary
Shiv Sena Leader, Owner Of Rolls Royce Car Booked For Electricity Theft. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X