Just In
- 1 hr ago
మతిపోగొడుతున్న హ్యుందాయ్ మార్చ్ నెల డిస్కౌంట్స్.. దేనిపై ఎంతో చూసారా..!
- 3 hrs ago
భారత్లో విడుదలైన 3 కొత్త NIJ ఎలక్ట్రిక్ స్కూటర్స్.. చీప్ కాస్ట్ & మోర్ ఫీచర్స్
- 4 hrs ago
గుడ్ న్యూస్! ఇకపై ఈ సేవల కోసం ఆర్టీఓ చుట్టూ తిరగక్కర్లేదు, అన్నీ ఆన్లైన్లోనే..
- 5 hrs ago
కేవలం 65,920 రూపాయలకే కొత్త బజాజ్ ప్లాటినా 110 ఎబిఎస్ బైక్ ; వివరాలు
Don't Miss
- News
ఊహించని ఘటన.. విజయసాయి రెడ్డి తీవ్ర అసహనం... లేని అధికారాన్ని ప్రదర్శించలేవని...
- Sports
నా దూకుడు ప్రేక్షకులను అలరిస్తుందంటే సంతోషిస్తా: రిషభ్ పంత్
- Movies
రూ 4 కోట్లు మోసం చేసింది వాడే.. కుమ్మేద్దాం.. జయలలితకు అండగా కరాటే కళ్యాణి
- Finance
వరుస నష్టాలు, భారీగా నష్టపోయిన మార్కెట్లు, నిఫ్టీ 15వేల దిగువకు
- Lifestyle
పడకగదిలో ధైర్యంగా కార్యం కొనసాగించేందుకు ఈ చిట్కాలు పాటించండి...
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
పాకిస్థాన్ క్రికెటర్ 'షోయబ్ మాలిక్' కార్ యాక్సిడెంట్ ; తృటిలో తప్పిన పెను ప్రమాదం
పాకిస్థాన్ మాజీ క్రికెట్ కెప్టెన్ మరియు భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా భర్త "షోయబ్ మాలిక్" గురించి తెలియని క్రికెట్ ప్రేమికులు ఉండరంటే అతిశయోక్తి కాదు. షోయబ్ మాలిక్ పొరుగు దేశం యొక్క క్రికెట్ అటగాడు అయినప్పటికీ, భారతదేశంలో కూడా ఎక్కువమందికి అతని గురించి తెలుసు. ఇటీవల షోయబ్ మాలిక్ కార్ ప్రమాదానికి గురైనట్లు నివేదికల ద్వారా తెలిసింది. దీని గురించి పూర్తి సమాచారం తెలుసుకుందాం.

షోయబ్ మాలిక్ స్పోర్ట్స్ కారుతో ట్రక్కును ఢీ కొని ప్రమాదానికి గురయ్యాడు. ఈ సంఘటన ఆదివారం రాత్రి లాహోర్లో జరిగింది, ఈ ప్రమాదంలో అతనికి ఎటువంటి గాయాలు కాకపోవడం మాత్రమే కాకుండా, సురక్షితంగా బయటపడ్డాడు. షోయబ్ మాలిక్ పాకిస్తాన్ సూపర్ లీగ్ డ్రాఫ్ట్ ఈవెంట్లో పాల్గొనడానికి లాహోర్లోని హై పెర్ఫార్మెన్స్ సెంటర్కు వెళ్లి, అక్కడి నుంచి తిరిగి వచ్చేటప్పుడు అతని స్పోర్ట్స్ కారు ట్రక్కును ఢీకొట్టింది.

కారు ట్రక్కుని ఢీ కొట్టడం వల్ల కారు యొక్క ముందు భాగం పూర్తిగా దెబ్బతినింది. ఈ సంఘటనకు సంబంధించిన ఫోటోలు మీరు ఇక్కడ గమనించవచ్చు. వెల్లడైన నివేదికల ప్రకారం ట్రక్కును ఢీ కొట్టే ముందు, తన కారుని కంట్రోల్ చేయలేకపోయాడు. దీని వల్ల ఈ ప్రమాదం జరిగింది.
MOST READ:మీకు తెలుసా.. 2021 కవాసకి నింజా 650 బైక్, ఇప్పుడు కొత్త కలర్ ఆప్షన్లో కూడా..

పాకిస్థాన్ స్థానిక న్యూస్ ఛానల్ సమా టీవీ అందించిన నివేదికల ప్రకారం, మాలిక్ తన ఫాన్సీ స్పోర్ట్స్ రైడ్ కారుని కంట్రోల్ చేయలేకపోయినప్పుడు, వహాబ్ రియాజ్ కారును ఓవర్ టేక్ చేయడానికి ప్రయత్నించాడని తెలిసింది. ఆ తర్వాత రోడ్డు పక్కన నిలిపి ఉంచిన ట్రక్కును ఢీకొట్టారు.

ప్రమాదం జరిగినప్పటికీ షోయబ్ మాలిక్ సురక్షితంగా బయటపడగలిగాడు. అయితే కారు మాత్రమే ఎక్కువ దెబ్బతిన్నట్లు తెలుస్తుంది. షోయబ్ మాలిక్ ఈ ప్రమాదం నుంచి కారుని తప్పించడానికి చాలా ప్రయత్నం చేశానని చెప్పాడు. కానీ కారును ఆసమయంలో కారును కంట్రోల్ చేయలేకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని కూడా చెప్పాడు.
MOST READ:ఈ కారు ప్రయాణికుల పాలిట రక్షణ కవచం.. ఇంతకీ ఏ కారనుకుంటున్నారు

ఈ ప్రమాదం జరిగిన తర్వాత షోయబ్ మాలిక్ ట్వీట్ చేస్తూ, నా కారుకు ప్రమాదం జరిగింది. ఈ సంఘటన నుంచి సురిక్షితంగా బయటపడ్డాను. భగవంతుడి దయ వల్ల నాకు ఏమి కాలేదు. నాకోసం ప్రార్థించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మీ ప్రేమకు చాలా కృతజ్ఞతలు '' అని షోయబ్ ట్వీట్ చేశారు.

ఈ సంఘటనకు సంబంధించి ఒక ప్రత్యక్ష సాక్షి ఒకరు ఉన్నారు, అతడు అక్కడే ఉన్నాడు, అంతే కాదు వీడియో తీయడానికి కూడా ప్రయత్నించాడు. కానీ దానికి వారు నిరాకరించారు. ఇది ఏ కారు అని ఇంకా గుర్తించబడలేదు.
MOST READ:పులి మరణానికి కారణమైన కారు.. అసలేం జరిగిందంటే?

పాకిస్థాన్ క్రికెటర్ అయినా షోయబ్ మాలిక్ కూడా మంచి స్పోర్ట్స్ కార్లంటే చాలా ఇష్టం, ఇంతలు ముందు కూడా అతడియు స్పోర్ట్స్ కారు నడుపుతూ కూడా గుర్తించబడ్డాడు. కానీ ఇప్పుడు ప్రమాదంలో ఒక కారు బాగా దెబ్బతింది. ఏది ఏమైనా వాహనదారులు రోడ్డుపై ప్రయాణించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండటం అవసరం. లేకుంటే ఇలాంటి ప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది.