షాకింగ్ యాక్సిడెంట్: రెండు ముక్కలైన లాంబోర్గినీ
సూపర్ కార్లను నడపటం ఎంత సరదాగా ఉంటుందో, ప్రమాదాల్లో వాటి వలన కలిగే నష్టం కూడా అంతే తీవ్రంగా ఉంటుంది. మితిమీరిన వేగం ఎప్పటికీ ప్రమాదమే. ఇదిగో ఆ వేగానికి బలైన ఈ ఖరీదైన లాంబోర్గినీ కారు చూడండి.
న్యూయార్క్ సిటీలోని బ్లూక్లిన్‌లో మితమీరిన వేగంతో వచ్చిన ఓ తెలుపు రంగు కారు అదుప తప్పి, ప్రమాదానికి గురై రెండు ముక్కలుగా విడిపోయింది. రోడ్డుపై సగానికి చీలిపోయిన ఈ కారులో ఇంజన్ (వెనుక) భాగం ఓ వైపు, క్యాబిన్ (ముందు) భాగం మరో వైపు పడ్డాయి.
ఇంజన్ భాగం రోడ్డుపైనే పడిపోగా, క్యాబిన్ భాగం గోడకు గుద్దుకొని అగ్నికి ఆహుతైంది. ఈ ప్రమాదానికి ఖచ్చితమైన కారణం ఏంటనేది తెలియరాలేదు. అయితే, మితమీరిన వేగమే ఇందుకు ప్రధాన కారణం అయి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.

ఈ ప్రమాదంలో లాంబోర్గినీ అవెంటేడర్ ముందు భాగం డ్యామేజ్ కాకుండా ఉండటాన్ని బట్టి చూస్తే, ఇందులోని ప్రయాణికులు స్వల్ప గాయాలతో సురక్షితంగా బయటపడుంటారని పోలీసులు భావిస్తున్నారు.

వేగంగా వెళ్తున్న ఓ మజ్దా కారు, హఠాత్తుగా ఓ సిగ్నల్ జంక్షన్ వద్ద నిలిపివేయటంతో, వెనుక వైపు వేగంగా వస్తున్న లాంబోర్గినీ అవెంటేడర్ సిగ్నల్‌ను గమనించకపోవటం, ఫలితంగా అదుపు తప్పి ప్రమాదం సంభవించినట్లు ప్రాధమిక సమాచారం.

ఈ సూపర్ కార్లు చూడటానికి అందంగా ఉంటాయి, కానీ అంత ధృఢంగా ఉండవని ఈ కారును చూస్తే తెలిసిపోతుంది. లాంబోర్గినీ అవెంటేడర్ తయారీలో ఎక్కువ భాగం కార్భన్ ఫైబర్ పదార్థాన్ని ఉపయోగిస్తారు.

లాంబోర్గినీ అవెంటేడర్ ఉపయోగించిన శక్తివంతమైన 6.5 లీటర్, వి12 ఎమ్‌పిఐ పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 700 హెచ్‌పిల శక్తిని, 690 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

లాంబోర్గినీ అవెంటేడర్ కేవలం 2.9 సెకండ్లలోనే 0-100 కి.మీ. వేగాన్ని పుంజుకుంటుంది. అధిక వేగంతో ప్రయాణించేందుకు గానూ ఈ కారు బాడీని ముందు, వెనుక వైపు అల్యూమినియం ఫ్రేమ్‌తో కూడిన కార్బన్ ఫైబర్ మోనోకాక్ (సింగిల్) షాషీని ఉపయోగించారు.

ఫోర్-వీల్ డ్రైవ్ ఆప్షన్ కలిగిన లాంబోర్గినీ అవెంటేడర్ సెవన్-స్పీడ్ ట్రాన్సిమిషన్ (ఏడు గేర్లు) సిస్టమ్‌తో లభిస్తుంది. ఇందులో ఏబిఎస్, ఈఎస్‌పి, ఎయిర్ బ్యాగ్స్ వంటి అత్యాధునిక భద్రతా ఫీచర్లను కలిగి ఉంటుంది. ఇది లీటర్ పెట్రోల్‌కు కేవలం మూడు నుంచి నాలుగు కిలోమీటర్ల మైలేజీని మాత్రమే ఇస్తుంది.



Click it and Unblock the Notifications








