రూ. 5,000 జరిమానా చెల్లించిన షూటర్ 'వివాన్ కపూర్': కారణం ఇదే
ప్రముఖ ఏస్ షూటర్ మరియు పతక విజేత 'వివాన్ కపూర్' గురించి దాదాపు అందరికి తెలిసిందే. ఇతడు గత సంవత్సరం తన గ్యారేజిలోకి 'లంబోర్ఘిని హురాకాన్' (Lamborghini Huracan) చేర్చాడు. అయితే ఇటీవల ఇతడు తన Lamborghini Huracan కారులో డ్రైవింగ్ చేస్తూ పబ్లిక్ రోడ్లపై వెళ్తున్న సమయంలో రిజిస్ట్రేషన్ ప్లేట్ లేకపోవడం వల్ల పోలీసులకు జరిమానా చెల్లించాల్సి వచ్చింది. దీని గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

నివేదికల ప్రకారం జైపూర్‌లో వివాన్ కపూర్ కారు డ్రైవ్ చేస్తున్న సమయంలో ట్రాఫిక్ పోలీసులు అడ్డుకున్నారు. లంబోర్ఘిని హురాకాన్ యొక్క ముందు భాగంలో రిజిస్ట్రేషన్ ప్లేట్ లేదు, ఈ కారణంగా పోలీసులు అతడికి చలాన్ జారీ చేశారు. అయితే వివాన్ కపూర్ ఇది విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న వాహనం అని, రిజిస్ట్రేషన్ ప్లేట్ ముందు భాగంలో ఉంచడానికి స్థలం లేదని పోలీసులతో వాదించాడు. అయినప్పటికీ ఇది భారత ట్రాఫిక్ చట్టాల ప్రకారం నేరం కావున చలాన్ జారీ చేశారు. వివాన్ కూడా అక్కడికక్కడే జరిమానా చెల్లించారు.

ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించినందుకు వివాన్ కపూర్‌కు ట్రాఫిక్ పోలీసులు రూ. 5,000 చలాన్ జారీ చేశారు. పోలీసులు మార్గమధ్యంలో కారును ఆపడంతో ఆ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. తరువాత పోలీసులు మొత్తం క్లియర్ చేసారు.

ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయారు. మోటారు వాహన చట్టం ప్రకారం, ఏదైనా వాహనం ముందు మరియు వెనుక రిజిస్ట్రేషన్ నంబర్‌ను చూపించాలి. ముందుగా నిర్ణయించిన సైజు అక్షరాలు రిజిస్ట్రేషన్ ప్లేట్‌పై తెలుపు రంగులో వ్రాయబడతాయి. అయితే కమర్షియల్ వాహనాలకు, బ్యాక్‌గ్రౌండ్ ఎల్లో కలర్ లో ఉంటుంది. ప్రస్తుతం అమలులో ఉన్న నిబంధనల ప్రకారం వాహనాలు రిజిస్ట్రేషన్ నంబర్‌ను పక్కపక్కనే ప్రదర్శించాలి.

వివాన్ కపూర్ కొనుగోలు చేసిన ఈ లంబోర్ఘిని హురాకాన్ LP610-4 అనేది స్పోర్ట్స్ కారు యొక్క ఆల్-వీల్-డ్రైవ్ కూపే ఎడిషన్. ఇది 5.2-లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ వి10 ఇంజిన్‌ను ఉపయోగిస్తుంది. ఈ ఇంజన్‌తో 7-స్పీడ్ డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఉపయోగించబడింది. ఈ ఇంజన్ గరిష్టంగా 610 బిహెచ్‌పిల శక్తిని మరియు గరిష్టంగా 560 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

ఇప్పటికే భారతదేశంలో అనేక లంబోర్ఘిని కార్లు అందుబటులో ఉన్నాయి. అయితే మన దేశంలో ఈ కార్లు ప్రయాణించడానికి చాలా వరకు అనుకూలమైన రోడ్లు లేవు. అయితే ఈ కారు యొక్క ఎయిర్ సస్పెన్షన్ 45 మిమీ వరకు గ్రౌండ్ క్లియరెన్స్‌ను పొందుతుంది, కావున ఇది భారతదేశంలోని కఠినమైన రోడ్లు మరియు అక్రమ స్పీడ్ బ్రేకర్లపై డ్రైవింగ్ చేయడానికి అనుకూలంగానే ఉంటుంది.

సాధారణంగా లంబోర్ఘిని హురాకాన్ కార్బన్ ఫైబర్ మరియు అల్యూమినియంతో తయారు చేయబడి ఉంటుంది. కావున ఇది చాలా తేలికగా ఉంటుంది, కావున ఎక్కువ పనితీరుని అందిస్తుంది. వివాన్ కపూర్ కొనుగోలు చేసిన లంబోర్ఘిని హురాకాన్ LP610-4 ధర బెంగుళూరులో రూ. 3.7 కోట్లు (ఎక్స్-షోరూమ్). అయితే దీని ఆన్ రోడ్ ధర రూ. 4.8 కోట్లు వరకు ఉంటుంది.

భారతదేశంలో లాంబోర్ఘిని హురాకాన్ ధర సుమారు రూ.3 కోట్ల నుండి ప్రారంభమవుతుంది. ఇవి చాలా పవర్ పుల్ వేరియంట్లు కావున ఇందులోని నాలుగు చక్రాలకు ఇంజిన్ శక్తిని పంపుతుంది. అయితే భారతదేశంలో ఇది చాలా ఖరీదైన కార్లు. లంబోర్ఘిని హురాకాన్ యొక్క బేస్ మోడల్ RWD సెటప్‌ను మాత్రమే పొందుతుంది.

సాధారణంగా లంబోర్ఘిని కార్లు ఎక్కువ ధర కలిగి ఉండటం వల్ల ఎక్కువమంది కొనుగోలు చేయడానికి వెనుకాడతారు. కావున సినీ పరిశ్రమలోని వారు, రాజకీయ నాయకులు మరియు పారిశ్రామిక వేత్తలు మొదలైన వారు మాత్రమే వీటిని ఎక్కువగా కొనుగోలు చేస్తూ ఉంటారు. ఇటీవల కాలంలో జూనియర్ ఎన్టీఆర్ కూడా లంబోర్ఘిని కారుని కొనుగోలు చేశారు.

లంబోర్ఘిని కార్లు అత్యంత పనితీరుని అందించడానికి అనుకూలంగా తయారు చేయబడి ఉంటాయి. కావున ఇవి మంచి డ్రైవింగ్ అనుభూతిని అందిస్తాయి. కావున చాలామంది సెలబ్రెటీలు ఈ కార్లను ఇష్టపడతారు.

ఇదిలా ఉండగా భారతదేశంలో మోటారు వాహన చట్టాలను తప్పకుండా అందరూ పాటించాలి. లేకుంటే కఠినమైన శిక్షలు అనుభవించాల్సి వస్తుంది. ఇలాంటి నేపథ్యంలోనే వివాన్ కపూర్ కూడా జరిమానా చెల్లించాల్సి వచ్చింది. వాహన వినియోగదారులు దీనిని తప్పకుండా దృష్టిలో ఉంచుకోవాలి.


Click it and Unblock the Notifications








