దీపావళికి కారు లేదా బైకు కొంటున్నారా..? ఈ రెండు శుభఘడియల్లో కొంటే చాలా అదృష్టం..
చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా, అలాగే జీవితాల్లో వెలుగులు నింపే పండుగగా మన దేశ సంస్కృతిలో దీపావళికి విశేషమైన ప్రాధాన్యత ఉంది. ఈ పండుగ సందర్భంగా ఏవైనా కొత్త వస్తువులు కొనుగోలు చేసినట్లయితే ఐశ్వర్యం వస్తుందని అందరి నమ్మకం. అందుకే ఈ ధన త్రయోదశి నాడు బంగారం, వెండి, కొత్త పాత్రలు, ఇతర ఇంటికి అవసరమైన వస్తువులను కొనుగోలు చేస్తారు. ముఖ్యంగా వాహనాలు కొనుగోలు చేయాలనుకుంటున్న వారు ఈ రోజునే ఎంచుకుంటారు. ఈ సమయంలో కొనుగోలు చేయడం వలన తమ వాహనాలకు ఎలాంటి ప్రమాదం జరగదని, సురక్షితంగా ప్రయాణం చేయవచ్చని హిందువుల నమ్మకం. దీంతో ఈ సీజన్‌లో భారీ సంఖ్యలో వాహనాల అమ్మకాలు నమోదవుతుంటాయి. తయారీ కంపెనీలు సైతం డిమాండ్‌కు అనుగుణంగా ఈ పర్వదినాన ప్రత్యేకంగా తగ్గింపు ఆఫర్లు అందిస్తాయి.
ప్రధానంగా ప్రస్తుతం కార్ల వాడకం విపరీతంగా పెరిగింది. దాంతో సంస్థలు పలు డిస్కౌంట్‌లను అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ దీపావళికి కూడా మంచి మంచి ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. అయితే దీపావళికి కారు కొనడానికి శుభ ఘడియలు ఎప్పుడు ఉన్నాయా అని ఆలోచిస్తున్న వారికి, ముహూర్తాలకు సంబంధించిన పూర్తి వివరాలు క్రింది కథనంలో ఇవ్వబడ్డాయి..

కొత్త వాహనాలు కొనుగోలు చేయడానికి దీపావళికి ముందు అక్టోబర్ 29 - అక్టోబర్ 30 తేదీలు అనువుగా ఉన్నాయి. ఈ తేదీల్లో ఎప్పుడైనా కొత్త వాహనాలు కొనుగోలు చేయవచ్చు. కొత్త వస్తువులు, వాహనాల కొనుగోలుకు అన్ని సమయాలు అనుకూలంగా ఉండగా, అక్టోబర్ 29వ తేదీ ఉదయం 10.31 గంటల సమయం అత్యంత శుభ ఘడియలుగా ఉంది. అలాగే, అక్టోబర్ 30 మధ్యాహ్నం 1.15 గంటలకు కూడా మంచి శుభముహుర్తం ఉంది.
ఈ రెండు రోజుల్లో రెండు సమయాలు చాలా మంచి ఘడియలుగా ఉన్నాయి. ఈ సమయంలో వాహనం కీలను చేతుల్లోకి తీసుకోవచ్చు. అదేవిధంగా వాహనం కొనుగోలు చేసే పనులన్నీ ఒకటి రెండు రోజుల్లో పూర్తి చేయడం మంచిది. ఎందుకంటే ఈ శుభ ఘడియల్లో అన్ని పనులు పూర్తయితే మరింత కలిసి వచ్చే అవకాశం ఉంది. అందుకే డబ్బు చెల్లింపులు, సంబంధిత పత్రాలను అందించి అన్ని పనులను ముందుగానే పూర్తి చేయడం మంచిది.
హిందూ సంప్రదాయంలో శుభముహుర్తాలతో పాటు జాతకాలకు అత్యంత ప్రాముఖ్యత ఉంటుంది. అందుకే ముందుగానే పండితులను కలిసి తమకు కలిసివచ్చే కలర్‌ను తెలుసుకుని షోరూమ్ వారిని సంప్రదించి కావాల్సిన కలర్ వాహనాలను ముందే తెప్పించుకోవటం ఉత్తమం. దీని వలన సరైన సమయానికి వాహనం చేతుల్లో ఉంటుంది. కొనుగోలు సమయంలో కంపెనీ వారు ఇచ్చే డిస్కౌంట్‌లు, క్యాష్‌బ్యాక్‌లు వంటి వాటి గురించి కూడా ముందే తెలుసుకోవాలి.
తెలుగు రాష్ట్రాల్లో 31న దీపావళి జరుపుకుంటున్నారు. అయితే ఈ రోజు ఉపవాసం ఉన్నవారు తరువాతి రోజు నవంబర్ 1న కూడా పండుగను జరుపుకుంటారు. రెండు రోజులు అత్యంత ముఖ్యమైనవిగా భావిస్తారు. ఇప్పటికే చాలా మంది సామాన్యులతో పాటు సెలబ్రిటీలు దీపావళికి కొద్ది రోజుల ముందు కొత్త వాహనాలను కొనుగోలు చేసి తమ ఇంటికి తీసుకెళ్లారు. అక్టోబర్ 29, 30 తేదీల్లో మరింత మంది వాహనాలను కొనుగోలు చేస్తారు.
డ్రైవ్స్‌పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








