బెంజ్ కారు ముందు బాలీవుడ్ సెలెబ్రిటీ కవ్వించే పోజులు.. చూసేందుకు రెండు కళ్లు చాలవంతే!
లగ్జరీ కార్లకు పెట్టింది పేరు విదేశీ దిగ్గజ సంస్థ మెర్సిడెస్ బెంజ్. ఈ సంస్థ కార్లు వాడుతున్నవారికి నలుగురిలో ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. అంతలా ఈ కారు తన బ్రాండ్ వ్యాల్యూని ఏర్పాటు చేసుకుంది. ఈ కంపెనీ నుంచి వచ్చిన మెర్సిడెస్- బెంజ్- ఇ- క్లాస్(Mercedes-Benz E-Class) కారు... లగ్జరీ ఫీచర్లతో వినియోగదారులకు చేరువైంది. సెలబ్రెటీలు, పెద్ద పెద్ద పారిశ్రామిక వేత్తలు ఎక్కువగా ఈ కారుతో కనిపిస్తుంటారు. తాజాగా బాలీవుడ్ మేకప్ ఆర్టిస్ట్ షురా ఖాన్ ఈ కారుతో తళుక్కున మెరిసింది. ఆమె ఫోటోలు, వీడియోలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ Mercedes-Benz E-Class ధర అధికంగా ఉన్నప్పటికీ... ఇది లగ్జరీగా ఉంటూనే మంచి పర్ఫామెన్స్ అందిస్తుంది. అందుకే ఇది చాలా మంది ధనవంతుల్ని ఆకర్షిస్తోంది. అమితాబ్ బచ్చన్, సల్మాన్ ఖాన్, సైఫ్ అలీ ఖాన్, ప్రియాంక చోప్రా, రాణీ ముఖర్జీ వంటి బాలీవుడ్ స్టార్లకు ఈ కారు ఉంది. ఇప్పుడు బాలీవుడ్‌లో ప్రముఖ మేకప్ ఆర్టిస్ట్ షురా ఖాన్ ఈ కారుతో కనిపించి సందడి చేసింది.

Mercedes-Benz E-Class కారు ఒక లగ్జరీ సెడాన్ కారు. దీంట్లో ఫ్రంట్ డ్యాష్‌బోర్డుపైన 3 స్క్రీన్స్ ఉంటాయి. అలాగే 12.3- అంగుళాల డిజిటల్ ఇన్స్టుమెంట్ క్లస్టర్, 14.4- అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్‌ఫోటెయిన్మెంట్ సిస్టం ఉంటుంది. అంతేగాకుండా దీంట్లో ముందు సీట్ల కోసం మెమొరీ ఫంక్షన్, పనోరమిక్ సన్‌రూఫ్, 64-కలర్ యాంబియెంట్ లైటింగ్ వంటి ఫీచర్లు కూడా ఉంటాయి.
ఈ కారులో అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టం సూట్ కలదు. దీంట్లో టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టం, 8 ఎయిర్ బ్యాగులు, 360- డిగ్రీ కెమెరా, ఫ్రంట్ అండ్ రియర్ పార్కింగ్ సెన్సార్స్ ఉంటాయి. ఈ లగ్జరీ సెడాన్ కారు.. 2.0- లీటర్ మైల్డ్ హైబ్రిడ్ పెట్రోల్, 2.0 లీటర్ మైల్డ్ హైబ్రిడ్ డీజిల్, 3.0- లీటర్ మైల్డ్ హైబ్రిడ్ పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్లతో ఉంటుంది.

లగ్జరీ సెడాన్ కారు కొనేవారికి ఈ మెర్సిడెస్- బెంజ్ ఇ- క్లాస్ మంచి ఆప్షన్ అని చెప్పవచ్చు. దీంట్లో కటింగ్- ఎడ్జ్ లగ్జరీ, సేఫ్టీ ఫీచర్ల కారణంగా కంఫర్టబుల్ రైడ్ అనుభూతి చెందుతారు. ఈ కారు భారత మార్కెట్లో ప్రస్తుత ధర రూ.78.50 లక్షలుగా ఉంది. దీంట్లో టాప్- ఎండ్ వేరియంట్ ధర రూ.92.50 లక్షలుగా ఉంది. ఇవి ఎక్స్- షోరూమ్ ధరలు మాత్రమే.
షురా ఖాన్ పేరు చెబితే గుర్తుపట్టని వారు ఆమె భర్త పేరు చెబితే మాత్రం సులభంగానే గుర్తు పట్టగలరు. బాలీవుడ్ నటుడు, నిర్మాత అయిన అర్బాజ్ ఖాన్‌కు షురా ఖాన్ రెండో భార్య. అర్బాజ్ ఖాన్ బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్‌కు సోదరుడు. అర్బాజ్ ఖాన్ నటి మలైకా అరోరాతో తన 19 ఏళ్ల వివాహ బంధానికి 2017లో వీడ్కోలు పలికి, షురాఖాన్‌ను వివాహం చేసుకున్నారు.
2023లో వీరి పెళ్లి ముంబయిలో సింపుల్‌గా జరింది. పెళ్లి సమయంలో అర్బాజ్ ఖాన్ వయసు 56 ఏళ్లు కాగా వీరిద్దరి మధ్య ఏజ్ గ్యాప్ 22 ఏళ్లు ఉండడంతో సోషల్ మీడియాలో వీరి పెళ్లిపై విమర్శలు వచ్చాయి. ఈ విమర్శలపై షురా ఖాన్ తిప్పికొడుతూ. వయసు పెద్దదైనా పిల్లలకు తండ్రి కాగలరు, వయసు కేవలం నంబర్ అని చెప్పింది. షురా ఖాన్ ఈ కారుతో తరుచూ పబ్లిక్‌లో కనిపిస్తూ ఉంటుంది.
ముంబయిలోని బాంద్రాలో జరిగిన ఓ ఈవెంట్ హాజరై వెళ్తుండగా తాజాగా షురా ఖాన్ ఈ కారుతో కనిపించింది. ఈ కారు ముందు నిల్చుని ఆమె ఫోటోలకు పోజులిచ్చింది. అయితే ఈ మెర్సిడెస్- బెంజ్- ఇ క్లాస్‌లో ఈమె కారు ఏ వేరియంట్ అనే వివరాలు తెలియరాలేదు. ఒకవేళ దీంట్లో టాప్ వేరియంట్ కారు అయితే మాత్రం.. మార్కెట్లో దిని ధర రూ.1.07 కోట్లుగా ఉంది.


Click it and Unblock the Notifications








