ఒబామా కారు 'ది బీస్ట్' లాంటిది మరొకటి కావాలంటున్న మ్యూజిక్ మొఘల్

"ఈ రోజు ఉదయం సైమన్ నాకు ఫోన్ చేసి, ఒబామా లాంటి కారు కావాలని అడిగారు" అని సైమన్ అధికార ప్రతినిధి మ్యాక్స్ క్లిఫ్పోర్డ్ తెలిపారు. అమెరికా అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టిన వ్యక్తికి ఆ దేశ అధ్యక్ష భవనం, ఈ అధ్యక్ష కారును ఏర్పాటు చేస్తుంది. ఇది ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన కారు. ఈ కారును అమెరికన్ నిఘా సంస్థ వారు ముద్దుగా 'ది బీస్ట్' (మృగం) అని పిలుచుకుంటారు. 6.5 లీటర్ ఇంజన్ సామర్థ్యం కలిగిన ఈ క్యాడిలాక్ (జనరల్ మోటార్స్ బ్రాండ్) కారు 15 సెకన్లలో 0-60 మైళ్ల వేగంతో ప్రయాణిస్తుంది. ధర కనీసం పది లక్షల పౌండ్లు (సుమారు రూ. 1.35 కోట్లు). రాకెట్ లాంచర్ల ద్వారా ప్రయోగించే శక్తివంతమైన పేలు పదార్థాలను సైతం ఇది ఎదుర్కోగలదు. కారు చుట్టపక్కల హ్యాండ్ గ్రనేడ్ విసిరినా కూడా కారుకు చిన్న గీత కూడా పడదు.
ఈ బుల్లెట్ ప్రూఫ్ కారును ప్రపంచంలోనే అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించారు. కారు టైర్లు పూర్తిగా పేలిపోయినా కూడా ఆగకుండా పరుగులు తీయడం ఈ కారు ప్రత్యేకత. అత్యవసర పరిస్థితుల్లో ఒక్క బటన్ నొక్కితే అధ్యక్షుడి చుట్టూ 10 అంగుళాల మందం ఉన్న బుల్లెట్‌ప్రూఫ్ ద్వారాలు తెరచుకొని ఆయన చుట్టూ రక్షణగా నిలుస్తాయి. మరీ అత్యవసర పరిస్థితి ఏర్పడి అధ్యక్షుడికి ఏదైనా గాయం/ప్రమాదం సంభవిస్తే అధ్యక్షుడి బ్లడ్ గ్రూప్ రక్తాన్ని కూడా ఈ కారులో స్టోర్ చేసి ఉంచుతారు. దీని బరువు మూడు టన్నులు. అమెరికా గూఢచార సంస్థ (సీఐఏ)కు చెందిన నిపుణుడైన ఏజెంట్ ఈ కారును డ్రైవ్ చేస్తాడు.
ఇంకా ఈ కారులో అత్యాధునిక కమ్యూనికేషన్ వ్యవస్థలు కూడా ఉన్నాయి. జస్ట్ ఈ కారు వెనుక సీటులో కూర్చునే ఒబామా ప్రపంచంలో ఏ మూల నుంచైనా అమెరికాను పాలించే వెసులుబాటు ఉంటుంది. లాప్‌టాప్, వైర్‌లెస్ ఇంటర్నెట్, శాటిలైట్ ఫోన్ అత్యాధునిక సాంకేతిక వ్యవస్థలు ఎల్లప్పుడూ అమెరికాలోని వైట్‌హౌస్‌కు కనెక్ట్ చేయబడి ఉంటాయి.


Click it and Unblock the Notifications








