35000 అడుగల ఎత్తులో విమానంలో భారీ కుదుపు.. వణికిపోయిన ప్రయాణికులు, ఎమర్జెన్సీ ల్యాండింగ్..
సింగపూర్‌కి చెందిన బోయింగ్ 777-300ఈఆర్ విమానం ఒక్కసారిగా కుదుపుకు లోనయింది. లండన్ నుంచి ప్రారంభమై సింగపూర్‌కి వెళ్తున్న క్రమంలో కుదుపుకు గురవడంతో బ్యాంకాక్‌లోని సువర్ణభూమి విమానాశ్రయంలో మంగళవారం అత్యవసరంగా ల్యాండ్ చేశారు. ఈ ఘటనలో విమానంలో ఒక ప్రయాణికుడు మృతి చెందగా.. సుమారు 30 మందికి గాయాలయ్యాయని విమానయాన సంస్థ తెలిపింది.
మొత్తం 211 మంది ప్రయాణికులు 18 మంది సిబ్బందితో లండన్ నుంచి సింగపూర్ వెళ్తున్న బోయింగ్ 20 మే 2024న లండన్ (హీత్రూ) నుంచి సింగపూర్‌కి వెళ్లాల్సి ఉంది. ప్రారంభమైన కాసేపటికే సింగపూర్ ఎయిర్లైన్స్ విమానం #SQ321 మార్గమధ్యంలో తీవ్ర అలజడికి గురైంది. 2024 మే 21న స్థానిక కాలమానం ప్రకారం 15:45 గంటలకు ల్యాండ్ వెంటనే బ్యాంకాక్‌కి దారి మళ్లించారు.

బోయింగ్ 777-300ఈఆర్ విమానంలో అలజడి ఏర్పర్చడంతో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. విమానయాన సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. మృతుల కుటుంబాలకు సింగపూర్ ఎయిర్ లైన్స్ ప్రగాఢ సానుభూతిని తెలియజేసింది. తీవ్రంగా అస్వస్థకు గురైన వారిని బ్యాంకాక్‌లోని ఎయిర్‌లైన్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. క్షతగాత్రలకు మెరుగైన చికిత్స అందించేందుకు ఎయిర్‌లైన్స్ సిబ్బంది ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
వారికి అవసరమైన వైద్య సహాయం అందించడానికి థాయ్‌లాండ్‌లోని స్థానిక అధికారులతో పరిస్థితిని సమీక్షిస్తున్నామని.. అదనపు సహాయం అందించడానికి బ్యాంకాక్‌కు మరో బృందాన్ని పంపించామని సింగపూర్ ఎయిర్‌లైన్స్ తెలిపింది. ప్రమాద సమయంలో విమానం పడిపోయినట్లు అనిపించిందని కుషన్‌లు, దుప్పట్లు, ప్లేట్లు మరియు కప్పులు గాలిలో ఎగురుతూ కనిపించాయని అందులోని ప్రయాణికుడు డేవిస్ చెప్పాడు.

ఆస్ట్రేలియా, ఇంగ్లాడ్, న్యూజిలాండ్, ఐర్లాండ్, స్పెయిన్, అమెరికాకు చెందిన ప్రయాణికులు ఈ ఫ్లైట్‌లో ప్రయాణిస్తున్నారు. సింగపూర్ రవాణా మంత్రిత్వ శాఖ ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తోంది. థాయ్ సహచరులతో సైతం టచ్‌లో ఉన్నామని.. పూర్తి విచారణ కోసం అధికారులను బ్యాంకాక్‌కు పంపుతామని వారు చెప్పారు. US నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్ కూడా దర్యాప్తులో సహాయం చేయడానికి సిబ్బందిని బ్యాంకాక్‌కి పంపుతోంది.
విమానంలో ప్రయాణించే బాధితుల కోసం సింగపూర్ ఎయిర్ లైన్స్ తన హాట్ లైన్ నంబర్లను సోషల్ మీడియా వేదికగా ఎయిర్‌లైన్స్ పంచుకుంది. ఎలాంటి సహాయం కోసమైన సింగపూర్ ఎయిర్ లైన్స్ హాట్ లైన్ నంబర్లు +65 6542 3311 (సింగపూర్), 1800-845-313 (ఆస్ట్రేలియా), మరియు 080-0066-8194 (యునైటెడ్ కింగ్ డమ్)కి సమాచారం అందించి సహాయాన్ని పొందవచ్చు.
ఈ ఫ్లైట్ (SQ321) 16 సంవత్సరాల వయస్సు కలిగి ఉంది. సింగపూర్ ఎయిర్ సంస్థకు చెందిన (23) 777-300ERలలో ఇది ఒకటి. ఏవియేషన్ సేఫ్టీ నెట్‌వర్క్ రికార్డుల ప్రకారం సింగపూర్ ఎయిర్‌లైన్స్ ఏడు ప్రమాదాలను జరిగాయని రాయిటర్స్ నివేదించింది. ఈ ప్రమాద స్థాయి తీవ్ర స్థాయిలో లేవని తెలిపింది. అయితే ప్రస్తుతం జరిగిన ప్రమాదంలో ఎయిర్‌క్రాఫ్ట్ ఆపరేటింగ్‌లో లోపలను కనిపెట్టి త్వరలోనే పూర్తి స్థాయి నివేదికను అధికారులు అందిచనున్నారు.
డ్రైవ్స్‌పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








