మొదటి వ్యక్తిగత ఎగిరే యంత్రాన్ని రూపొందించిన విద్యార్థులు
మీరు మాత్రమే ప్రత్యేకంగా గాలిలో అలా అలా ఆకాశంలో ఎగిరి పోవాలని అనుకుంటున్నారా ? కొన్ని రోజులు ఆగండి త్వరలోనే మీ కళ తీరనుంది. ఎందుకంటే మరి కొన్ని రోజుల్లో ఇవి అందుబాటులోకి రానున్నాయి. నేషనల్ యూనివర్శటి ఆఫ్ సింగపూర్ (యన్‌యుయస్) కు చెందిన విద్యార్థుల బృందం దీనిని రూపొందించారు.
Also Read: ఉన్నట్లుండి గాల్లోకి ఎగిరి పడిన కార్లు: ఇది గ్రహాంతర వాసుల పనేనా ?
ఇది ప్రపంచ వ్యాప్తంగా "వ్యక్తిగతంగా ఎగిరే" మొదటి యంత్రం. ఇది దాదాపుగా 70 కేజీల వరకు బరువును మోయగలదని వారు తెలిపారు. మరి ఈ ఫ్లైయింగ్ మిషన్ గురించి మరిన్ని విశయాలను క్రింది కథనాల ద్వారా తెలుసుకుందాం రండి.

ఇందులో పటిష్టమైన ధృఢత్వం కోసం ప్రొపెల్లర్ మరియు ల్యాండింగ్ గేర్ వంటి భాగాలను హెక్సాగొనల్ ఆకారంలో గల ఫ్రేమ్‌లో వీటిని అమర్చారు. మరియు వీటిలో గల ఇంజన్‌లు ఇంట్రికేట్ డిజైన్‌తో రూపొందించారు.

ఈ ఎగిరే యంత్రాన్ని నించున్న చోటు నుండి నిట్టనిలువునా పైకి మరియు గాలిలో నుండి నిలువుగా క్రిందకు ల్యాండింగ్ మరియు టేకాఫ్ చేయడానికి ఇందులో గల ఎలక్ట్రికల్ సిస్టమ్ సహాయపడుతుంది.

ఒక్కరే ఎగురుకుంటూ వెల్లడానికి ఎంతో మంది ఇష్టపడతారని తెలిపారు. ఈ వ్యక్తిగత ఎలక్ట్రికల్ ఫ్లయింగ్ ఎయిర్ క్రాఫ్ట్‌లను ఇండోర్‌లో ఎక్కువగా ఉపయోగించడానికి వీలుంటుందని ఈ సందర్భంగా ఈ ప్రాజెక్ట్‌ను పర్యవేక్షిస్తున్న సూపర్‌వైజర్‌లో ఒక్కరైన డా. జార్జ్ విగల్ తెలిపారు.

విద్యుత్ శక్తి ద్వారా ఎగిరే ఈ యంత్రంలో 24 స్పోర్ట్స్ ఎలక్ట్రిక్ మోటార్లను ఉపయోగించారు. ప్రతి మోటార్ కూడా 76 సె.మీల చుట్టు కొలత గల ప్రొపెల్లర్స్‌ను తిప్పడానికి సహాయపడతాయి. దాదాపుగా 2.2 కిలో వాట్ పవర్ వీటి ద్వారా ఉత్పత్తి అవుతుంది.

ఈ హెక్సాగొనల్ ఫ్రేమ్‌ను అల్యూమినియం బద్దలు, కార్బన్ ఫైబర్ ప్లేట్లు మరియు కెవ్లార్ తాడుతో తయారు చేశారు.

ఇందులో పైలట్ కూర్చోడానికి సీటు యంత్రం యొక్క మధ్య భాగాన ఏర్పాటు చేశారు. ఈ సీటును ల్యాండిగ్ గేర్ యొక్క్ ఆరు కాళ్లతో పటిష్టంగా పట్టి ఉంచేలా దీనిని రూపొందించారు. మరియు దీనిని ల్యాండ్ చేసేటప్పుడు వచ్చే వైబ్రేషన్లు నివారించడానికి సీటు క్రింద భాగాన ఒక బంతిని ఏర్పాటు చేశారు.

ఈ ఎయిర్ క్రాఫ్ట్‌లో స్వతంత్రంగా రీఛార్జ్ కాగల రెండు లిథియం బ్యాటరీలను ఇందులో అందించారు. ఇవి మొత్తం దాదాపుగా 52.8 కిలో వాట్ పవర్‌ను అందిస్తాయి.

పైలట్ యొక్క భద్రత కోసం ఇతని సీటును యంత్రం యొక్క మధ్య భాగాన ఐదు -పాయింట్ల తో కనెక్ట్ చేయబడి ఉంటుంది. దీని వలన నిశ్చింతగా ఇందులో ఎగురుతు వెళ్లవచ్చు.

ప్లైట్ మొత్తాన్ని కంట్రోల్ చేయడానికి పైలట్‌కు అందుబాటులో ఉండే విధంగా అడ్జస్ట్ థ్రస్ట్, పిచ్, రోల్ మరియు యా వంటి వాటిని ఈ ఎయిర్ క్రాప్ట్‌లో కల్పించారు. వీరి సృష్టి బాగుంది కదా మరి నేషనల్ యూనివర్శటి ఆఫ్ సింగపూర్ విద్యార్థులకు అభినందనలు తెలపండి.

- విమానాన్ని తయారు చేసిన ఒక సాధారణ పల్లె వాసి
- ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ఖరీదైన టాప్ 10 లగ్జరీ హెలికాప్టర్లు
- 135 కోట్ల విలువైన విమానం కొనుగోలు చేసిన ఫుట్‌బాల్ ఆటగాడు.


Click it and Unblock the Notifications