ప్రమాదానికి గురైన టాటా పంచ్: సురక్షితంగా బయటపడిన నటి 'సోమా లైశ్రామ్'

భారతీయ సినీనటి మరియు గాయని 'సోమా లైశ్రామ్' (Soma Laishram) యొక్క 'టాటా పంచ్' (Tata Punch) ఇటీవల ప్రమాదానికి గురైంది. దీని గురించి పూర్తి సమాచారం ఈ కథనంలో తెలుసుకుందాం.. రండి.

ప్రమాదానికి గురైన టాటా పంచ్: సురక్షితంగా బయటపడిన నటి 'సోమా లైశ్రామ్'

నివేదికల ప్రకారం, మణిపూర్ లో ఒక ఫ్యూయెల్ స్టేషన్ సమీపంలో అకస్మాత్తుగా ఒక బైక్ రైడర్ రోడ్డుపైకి వచ్చాడు. ఆ సమయంలో ఆ బైక్ రైడర్ ని తప్పించబోయి రోడ్డు పక్కనే ఉన్న వారి పొలంలో పడింది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ప్రమాదానికి గురైన టాటా పంచ్: సురక్షితంగా బయటపడిన నటి 'సోమా లైశ్రామ్'

రోడ్డు పక్కన ఉన్న పొలంలో పడిన కారుని సమీపంలో ఉన్న ప్రజలు గుర్తించి దానిని బయటకు తీసే ప్రయత్నం చేశారు. దీనికోసం సమీపంలో ఉన్న పోలీసులకు పిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. పోలీసులు ఆ కారుని రెండు కార్ల సహాయంతో బయటకు లాగారు. ఈ ప్రమాదంలో 'సోమా లైశ్రామ్' కి పెద్దగా గాయాలు కాలేదు, అయితే తలకు దెబ్బ తగిలినట్లు తెలిసింది. అయితే వైద్య సహాయం కోసం సమీపంలో ఉన్న హాస్పిటల్ కి తరలించినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో ఎవరికీ ప్రాణ హాని జరగలేదు.

ప్రమాదానికి గురైన టాటా పంచ్: సురక్షితంగా బయటపడిన నటి 'సోమా లైశ్రామ్'

టాటా పంచ్ యొక్క దృఢమైన నిర్మాణం కారణంగా ఎవరికి పెద్ద ప్రమాదం జరగలేదు. అంతే కాకూండా సేఫ్టీలో టాటా పంచ్ 5 స్టార్ రేటింగ్ పొందింది కావున కారులోని ప్రయాణికులు సురక్షితంగా బయటపడగలిగారు.

ప్రమాదానికి గురైన టాటా పంచ్: సురక్షితంగా బయటపడిన నటి 'సోమా లైశ్రామ్'

ఇందులో డ్యూయెల్ ఎయిర్‌బ్యాగులు, 90 డిగ్రీ ఓపెనింగ్ డోర్స్, రివర్స్ కెమెరా, క్రూయిజ్ కంట్రోల్, ఆటోమేటిక్ రెయిన్ సెన్సింగ్ వైపర్స్, ఐడిల్ స్టార్ట్ స్టాప్ టెక్నాలజీ, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ మరియు ఏబీఎస్ విత్ ఈబిడి వంటి సేఫ్టీ ఫీచర్స్ అందుబాటులో ఉన్నాయి.

ప్రమాదానికి గురైన టాటా పంచ్: సురక్షితంగా బయటపడిన నటి 'సోమా లైశ్రామ్'

Tata Punch వయోజన భద్రత విషయంలో 5 స్టార్ రేటింగ్, పిల్లల భద్రత విషయంలో 4 స్టార్ రేటింగ్ కైవసం చేసింది. ఇది వయోజన భద్రతలో 16.453 పాయింట్లు మరియు పిల్లల భద్రత కోసం 40.891 పాయింట్లను సొంతం చేసుకోగలిగింది. మొత్తం మీద సేఫ్టీలో 5 స్టార్ రేటింగ్ పొంది అత్యంత సురక్షితమైన వాహనంగా నిలిచింది.

ప్రమాదానికి గురైన టాటా పంచ్: సురక్షితంగా బయటపడిన నటి 'సోమా లైశ్రామ్'

టాటా పంచ్ గురించి వివరంగా:

టాటా పంచ్ విషయానికి వస్తే, ఇది నాలుగు వేరియంట్లలో అందుబాటులో ఉంది. అవి ప్యూర్, అడ్వెంచర్, ఆకాంప్లిస్డ్ (Accomplished) మరియు క్రియేటివ్‌ వేరియంట్స్. అదే సమయంలో ఇది ఓర్క్స్ వైట్, అటామిక్ ఆరెంజ్ ,డేటోనా గ్రే, మెటోర్ బ్రాంజ్, కాలిప్సో రెడ్, ట్రాపికల్ మిస్ట్ మరియు టోర్నాడో బ్లూ అనే 7 కలర్ ఆప్సన్స్ లో అందుబాటులో ఉంది.

ప్రమాదానికి గురైన టాటా పంచ్: సురక్షితంగా బయటపడిన నటి 'సోమా లైశ్రామ్'

ఈ SUV లో సిగ్నేచర్ గ్రిల్, బ్రాండ్ లోగో ఎల్ఈడీ డిఆర్ఎల్ కి కనెక్ట్ చేయబడి మధ్యలో ఉంటుంది. హెడ్‌లైట్ ఇరువైపులా ఉంది. ఫాగ్ లైట్ దాని క్రింద ఉంచబడింది. సైడ్ ప్రొఫైల్ ఫోర్-స్పోక్ 16 ఇంచెస్ అల్లాయ్ వీల్స్, ORVM లపై టర్న్ ఇండికేటర్‌లు, డ్యూయల్ టోన్ ఎక్స్‌టీరియర్ ఉన్నాయి.

ప్రమాదానికి గురైన టాటా పంచ్: సురక్షితంగా బయటపడిన నటి 'సోమా లైశ్రామ్'

ఇక ఇంటీరియర్ డ్యూయల్-టోన్ థీమ్‌లో చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఇందులో బ్లాక్ అండ్ వైట్ కలర్ ఉపయోగించబడింది. ఇదే డ్యూయెల్ టోన్ కలర్ దాని డాష్‌బోర్డ్‌లో కనిపిస్తుంది. ఇది కాకుండా, దానిలో కనిపించే AC వెంట్‌లపై బ్లూ హైలైట్‌లు మరియు లోపలి డోర్ హ్యాండిల్స్‌లో వైట్ ఇన్సర్ట్‌లు ఉపయోగించబడ్డాయి. ఇవన్నీ కూడా చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటాయి.

ప్రమాదానికి గురైన టాటా పంచ్: సురక్షితంగా బయటపడిన నటి 'సోమా లైశ్రామ్'

టాటా పంచ్ మైక్రో SUV 1.2-లీటర్, త్రీ-సిలిండర్, రివోట్రాన్ పెట్రోల్ ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. ఈ ఇంజన్ 6,000 ఆర్‌పిఎమ్ వద్ద 85 బిహెచ్‌పి పవర్ మరియు 3,300 ఆర్‌పిఎమ్ వద్ద 113 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్సన్స్ పొందుతుంది.

ప్రమాదానికి గురైన టాటా పంచ్: సురక్షితంగా బయటపడిన నటి 'సోమా లైశ్రామ్'

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

భారతీయ మార్కెట్లో అత్యంత సురక్షితమైన్ వాహనాలు కలిగిన కంపెనీగా 'టాటా మోటార్స్' ప్రసిద్ధి చెందింది. ఈ కారణంగానే ఎక్కువ మంది ప్రజలు టాటా వాహనాలను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతుంటారు. గతంలో కూడా చాలాప్రమాదాలలో ప్రయాణికులను ప్రాణాలతో బయటపడిన ఘనత టాటా మోటార్స్ కి ఉంది. అయితే ఇది మరొక్కసారి ఋజువైంది.ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలతో పాటు, కొత్త కార్లు మరియు బైకుల గురించి మరింత సమాచారం తెలుసుకోవడానికి తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఛానల్ చూస్తూ ఉండండి.

Most Read Articles

English summary
Singer and actress soma laishram tata punch mets accident near mizoram
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X