కార్ నెంబర్ కోసం రూ. 28 లక్షలు వెచ్చించిన ఫెమస్ సింగర్.. ఆ నెంబర్ ఏదో ఇక్కడ చూడండి

యో యో హనీ సింగ్ లేదా "హనీ సింగ్" గురించి సంగీత ప్రేమికులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎందుకంటే భారతదేశంలో చెప్పుకోదగ్గ ప్రముఖ ర్యాపర్లలో అతను ఒకడు. ఇతడు మంచి సింగర్, రాపర్, పాటల రచయిత మాత్రమే కాకుండా యాక్టర్ కూడా. ఇటీవల హనీ సింగ్ తన కారు కోసం రూ. 28 లక్షలు చెల్లించి ఫ్యాన్సీ నెంబర్ ప్లేట్ సొంతం చేసుకున్నారు. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

కార్ నెంబర్ కోసం రూ. 28 లక్షలు వెచ్చించిన 'హనీ సింగ్'.. ఇంతకీ ఆ నెంబర్ ఏదో ఇక్కడ చూడండి

నివేదికల ప్రకారం, హానీ సింగ్ యొక్క ఆడి ఆర్ 8 సూపర్ కారు కోసం ఇంత మొత్తం చెల్లించి రిజిస్ట్రేషన్ నంబర్ ఎంహెచ్ 04 ఎఆర్ 8 అనే నెంబర్ కొనుగోలు చేసాడు. ఇది మహారాష్ట్రలో రిజిస్టర్ చేసినట్లు మనకు స్పష్టంగా తెలుస్తోంది. అయితే తన సూపర్ కారు కోసం చాలా డబ్బు కాచు పెట్టినట్లు సింగ్ తెలిపాడు. దీనికి సంబంచింది వీడియో కూడా మీరు ఈ కథనంలో చూడవచ్చు.

కార్ నెంబర్ కోసం రూ. 28 లక్షలు వెచ్చించిన 'హనీ సింగ్'.. ఇంతకీ ఆ నెంబర్ ఏదో ఇక్కడ చూడండి

హానీ సింగ్ గ్యారేజిలో చాలా ఖరీదైన కార్లు ఉన్నాయి. ఇందులో ఆడి క్యూ 5, క్యూ 7, జాగ్వార్ ఎక్స్ఎఫ్ వంటి చాలా ఖరీదైన కార్లను కలిగి ఉన్నారు. సింగ్ గ్యారేజీలో ఉన్న అత్యంత ఖరీదైన కార్లలో 'ఆడి ఆర్8' ఒకటి. ప్రస్తుతం కంపెనీ ఈ మోడల్ ఉత్పత్తిని నిలిపివేసినప్పటికీ మార్కెట్లో మాత్రం అందుబాటులో ఉంది. ఇది ఎక్కువమంది సెలబ్రటీలు కోరుకునే అత్యంత ఖరీదైన మరియు సూపర్ కారు.

కార్ నెంబర్ కోసం రూ. 28 లక్షలు వెచ్చించిన 'హనీ సింగ్'.. ఇంతకీ ఆ నెంబర్ ఏదో ఇక్కడ చూడండి

హానీ సింగ్ ఆడి ఆర్8 బ్లాక్ కలర్ లో చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. దీని ధర భారతీయ మార్కెట్లో సుమారు రూ .2.30 కోట్లు (ఎక్స్-షోరూమ్). ఈ సూపర్ కారు అద్భుతమైన గ్రౌండ్ క్లియరెన్స్ కలిగి ఉంటుంది. అంతే కాకుండా సీట్ల ముందు మరియు వెనుక స్టోరేజ్ కంపార్ట్మెంట్స్ కూడా కలిగి ఉంది. అయితే 2019 చివరి నాటికి కంపెనీ దీని ఉత్పత్తిని నిలిపివేసింది.

కార్ నెంబర్ కోసం రూ. 28 లక్షలు వెచ్చించిన 'హనీ సింగ్'.. ఇంతకీ ఆ నెంబర్ ఏదో ఇక్కడ చూడండి

ఆడి ఆర్8 అనేది 2 డోర్స్ కలిగి నాలుగు సీట్లు కలిగిన కారు. కావున ఇందులో నలుగురు వ్యక్తులు ప్రయాణించవచ్చు. ఈ కారు అద్భుతమైన డిజైన్ కలిగి ఉండటమే కాకుండా అనేక లగ్జరీ ఫీచర్స్ కూడా పొందుతుంది. ఇది మంచి పనితీరుని అందించడానికి కావాల్సిన విధంగా రూపొందించబడి ఉంటుంది. కావున పనితీరు పరంగా ఉత్తమంగా ఉంటుంది.

కార్ నెంబర్ కోసం రూ. 28 లక్షలు వెచ్చించిన 'హనీ సింగ్'.. ఇంతకీ ఆ నెంబర్ ఏదో ఇక్కడ చూడండి

ఒక ఇంటర్వ్యూలో హానీ సింగ్ మాట్లాడుతూ.. ఒకప్పుడు తనకు ఖరీదైన కార్లను కొనుగోలు చేయడం చాలా ఇష్టమని, ఆ తరువాత ఈ ఆసక్తి క్రమంగా తగ్గిపోయిందని చెప్పాడు. అతడు కార్ల కొనుగోలుపైన ఎంత ఆసక్తి చూపుతాడో.. ఆ కార్ల కోసం నెంబర్ ప్లేట్స్ ఎంచుకోవడంలో కూడా అంతే ఆసక్తి చూపుతాడు. ఈ కారణంగానే తన ఆడి ఆర్8 కారు నెంబర్ ప్లేట్ కోసం రూ. 28 లక్షలు ఖర్చు చేశారు.

కార్ నెంబర్ కోసం రూ. 28 లక్షలు వెచ్చించిన 'హనీ సింగ్'.. ఇంతకీ ఆ నెంబర్ ఏదో ఇక్కడ చూడండి

గత కొంత కాలంగా హానీ సింగ్ అనారోగ్యంతో బాధపడుతున్న కారణంగా ఇప్పుడు కార్లను కొనుగోలు చేయడం లేదని, అంతే కాకుండా ఇప్పటికే తన గ్యారేజిలో ఉన్న చాలా కార్లను విక్రయించినట్లు కూడా చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం డ్రైవింగ్ ఆస్వాదించలేకపోతున్నట్లు ఆయన పేర్కొన్నారు.

సెలబ్రెటీలు తమ కార్లకు ఫ్యాన్సీ నంబర్స్ కోసం ఎక్కువ డబ్బు వెచ్చించడం ఇదే మొదటి సారి కాదు. ఇలాంటి కథనాలు గతంలో కూడా చాలా సార్లు తెలుసుకున్నాం. గతంలో జూనియర్ ఎన్టీఆర్ తన లంబోర్ఘిని ఉరుస్ కారు కోసం TS09 FS 9999 రిజిస్ట్రేషన్ నంబర్ సొంతం చేసుకున్నారు. ఈ ఫ్యాన్సీ నెంబర్ ఖరీదు ఏకంగా రూ. 17 లక్షలు.

కార్ నెంబర్ కోసం రూ. 28 లక్షలు వెచ్చించిన 'హనీ సింగ్'.. ఇంతకీ ఆ నెంబర్ ఏదో ఇక్కడ చూడండి

అంతే కాకుండా ప్రముఖ మలయాళీ స్టార్ మమ్ముట్టి వద్ద చాలా ఖరీదైన కార్లు ఉన్నాయి. అయితే ఈయన వద్ద అన్ని కార్ల నెంబర్స్ 369 అని ఉండటం విశేషం. కావున మమ్ముట్టి కార్ కలెక్షన్ కి ఒక ప్రత్యేకత ఉంది. అంతే కాకుండా కొంత తమకు ఇష్టమైన నంబర్స్ కొనుగోలు చేయడానికి ఇంకా ఎక్కువ మొత్తంలో ఖర్చు చేయడానికి కూడా వెనుకాడరు. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడానికి తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఛానల్ చూస్తూ ఉండండి.

NOTE:ఈ కథనంలో రెండవ ఫొటోలో కనిపిస్తున్న కారు హనీ సింగ్ ఆడి ఆర్8, పాఠకులు గమనించగలరు.

More from DriveSpark

Article Published On: Saturday, January 7, 2023, 12:04 [IST]
English summary
Singer honey singh paid rs 28 lakhs for audi a8 telugu details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+