Just In
- 1 min ago కేవలం రూ. 8,999లకే డ్యాష్‌క్యామ్.. ఈ BIS కెమెరా కార్లకు పెట్టుకుంటే చాలు!!
- 14 hrs ago గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- 15 hrs ago 5 రూపాయల గొడవ.. చిర్రెత్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ప్రయాణికుడు.. అసలేం జరిగిందంటే.!!
- 17 hrs ago జనాలు ఎక్కువగా కొంటున్న టాప్-3 SUVలు ఇవే.. జాబితాలో లేని టాటా కార్లు!!
Don't Miss
- News అక్కడ.. యుద్ధ వాతావరణం: భారీగా దాడులు
- Movies Karthika Deepam 2 నా బిడ్డకు దూరంగా ఉండు.. కార్తీక్‌కు దీప షాక్
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్‌తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్‌నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్‌బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
జర్మన్ లగ్జరీ కార్ కొన్న ఇండియన్ ప్లేబ్యాక్ సింగర్ KK: దీని ధర రూ. 1 కోటికి పైమాటే..
సాధారణంగా సినీపరిశ్రమలో హీరోలు, హీరోయిన్స్, క్రికెటర్లు మరియు పారిశ్రామిక వేత్తలు ఎక్కువ సంఖ్యలో లగ్జరీ కార్లను మరియు బైకులను ఎప్పటికప్పుడు కొనుగోలు చేస్తూ ఉంటారు. ఇందులో భాగంగానే ఇటీవల ప్రముఖ ఇండియన్ ప్లేబ్యాక్ సింగర్ మరియు KK గా ప్రసిద్ధి చెందిన 'కృష్ణకుమార్ కున్నత్' జర్మన్ లగ్జరీ బ్రాండ్ అయిన 'ఆడి ఆర్ఎస్5 స్పోర్ట్‌బ్యాక్' కొనుగోలు చేశారు. దీని గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.
RS5 స్పోర్ట్‌బ్యాక్ వి6 2.9-లీటర్ టిఎఫ్ఎస్ఐ ట్విన్-టర్బో ఇంజిన్ కలిగి ఉంటుంది. ఈ ఇంజన్ 6,700 ఆర్‌పిఎమ్ వద్ద 443 బిహెచ్పి పవర్ మరియు 5,000 ఆర్‌పిఎమ్ వద్ద 600 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ 8 స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది. సెల్ఫ్-లాకింగ్ సెంటర్ డిఫరెన్షియల్‌తో బ్రాండ్ యొక్క క్వాట్రో పర్మినెంట్ ఆల్-వీల్ డ్రైవ్ ద్వారా పవర్ నాలుగు చక్రాలకు సెట్ చేయబడింది. మెరుగైన పనితీరు కోసం ఆడి డ్రైవ్ సెలెక్ట్, ఆర్ఎస్ స్పోర్ట్స్ సస్పెన్షన్ మరియు ఆర్ఎస్ స్టీల్ బ్రేక్‌లతో కూడా ఈ సెడాన్ అందించబడుతుంది.
కొత్త ఆర్ఎస్5 స్పోర్ట్ బ్యాక్ హానీకూంబ్ గ్రిల్‌తో మంచి దూకుడు వైఖరిని కలిగి ఉంటుంది. అంతే కాకూండా ఈ సెడాన్ యొక్క దూకుడు రూపాన్ని పెంచడానికి యాక్టివ్ ఏరో మరియు ఫ్రంట్ లిప్తో అగ్రెసివ్ బంపర్‌ను కూడా కలిగి ఉంది. అంతే కాకుండా ఇందులో ఎల్ఈడీ మాట్రిక్స్ హెడ్ లాంప్ విత్ డిఆర్ఎల్, ఎల్ఈడీ టెయిల్‌ల్యాంప్‌లు, 19 ఇంచెస్ అల్లాయ్ వీల్స్, రియర్ స్పాయిలర్, ఫ్రేమ్‌లెస్ డోర్స్ మరియు బాడీ-కలర్ ఎక్స్టీరియర్ మిర్రర్ హౌసింగ్ వంటివి ఉన్నాయి.
RS5 స్పోర్ట్ బ్యాక్ లోని ఇంటీరియర్ విషయానికి వస్తే, ఇందులో పెర్ఫార్మెన్స్ సెలూన్ అల్కాంటారా మరియు లెదర్‌తో పాటు డ్యాష్‌బోర్డ్ మరియు క్యాబిన్ అంతటా అల్యూమినియం ఉంటుంది. ఇందులో స్పోర్ట్ సీట్లు, త్రీ-స్పోక్ లెదర్ స్టీరింగ్ వీల్, పాడిల్ షిఫ్టర్లు, స్టెయిన్లెస్ స్టీల్ పెడల్స్ & ఫుట్‌రెస్ట్ మరియు ఆర్ఎస్ స్కఫ్ ప్లేట్లు ఉన్నాయి.
స్పోర్టీ ఇంటీరియర్లతో పాటు, ఆర్ఎస్5 స్పోర్ట్‌బ్యాక్ 12.3 ఇంచెస్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌తో బ్రాండ్ యొక్క వర్చువల్ కాక్‌పిట్ ప్లస్‌తో సహా అనేక ఫీచర్స్ తో లోడ్ చేయబడి ఉంటుంది. వీటితో పాటు 10.1 ఇంచెస్ టచ్‌స్క్రీన్ డిస్ప్లే, ఆపిల్ కార్ప్లే & ఆండ్రాయిడ్ ఆటో, 3-జోన్ ఎయిర్ కండిషనింగ్, యాంబియంట్ లైటింగ్, క్రూయిజ్ కంట్రోల్ సిస్టమ్, పవర్డ్ టెయిల్‌గేట్, పనోరమిక్ సన్‌రూఫ్, 10-స్పీకర్ ఆడియో సిస్టమ్ మరియు ఎమ్ఎమ్ఐ నావిగేషన్ ప్లస్ వంటి ఫీచర్స్ ఉన్నాయి. కొత్త ఆడి ఆర్ఎస్5 స్పోర్ట్‌బ్యాక్ 465 లీటర్ల బూట్ స్పేస్ కలిగి ఉంటుంది.
ఆర్ఎస్5 స్పోర్ట్‌బ్యాక్ అద్భుతమైన సేఫ్టీ ఫీచర్స్ కూడా పొందుతుంది. ఇందులో 6 ఎయిర్‌బ్యాగులు, ISOFIX చైల్డ్ సీట్ యాంకర్లు, యాంటీ-థెఫ్ట్ వీల్ బోల్ట్‌లు, హోల్డ్ అసిస్ట్, ఆటో-డిమ్మింగ్ రియర్-వ్యూ మిర్రర్, స్టెబిలిటీ కంట్రోల్ మరియు ఏబీఎస్ విత్ ఈబిడి వంటివి ఉన్నాయి. ఇవన్నీ కూడా వాహన వినియోగదారుల భద్రతను నిర్ధరిస్తాయి.
ఆడి ఆర్ఎస్5 స్పోర్ట్‌బ్యాక్ మంచి పర్ఫామెన్స్ మరియు ప్రాక్టికాలిటీని కలిగి ఉన్న ఫోర్ డోర్స్ సెడాన్. ఇది వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది. దేశీయ మార్కెట్లో కొత్త ఆడి ఆర్ఎస్5 స్పోర్ట్‌బ్యాక్, మెర్సిడెస్ బెంజ్ ఎఎమ్‌జి మరియు బీఎండబ్ల్యూ ఎమ్3 వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.