కార్వెట్ మ్యూజియంలో సింక్‌హోల్‌ను అలానే ఉంచుతారట!
గడచిన ఫిబ్రవరి నెలలో జనరల్ మోటార్స్‌కు చెందిన జాతీయ కార్వెట్ మ్యూజియంలో సుమారు 40 అడుగుల వెడల్పు, 30 అడుగుల లోతున్న సింక్‌హోల్ (హఠాత్తుగా ఏర్పడే లోతైన అగాథం) ఏర్పడి, 8 వెలకట్టలేని పురాతన షెవర్లే కార్వెట్ కార్లు ధ్వంసమైన సంగతి తెలిసినదే. అయితే, ఇప్పుడు ఈ సింక్‌హోల్ మంచి పాపులరాటీని దక్కించుంది.
కార్వెట్ మ్యూజియంను సందర్శించడానికి వచ్చే వారి సంఖ్య కన్నా ఈ సింక్‌హోల్‌ను సందర్శించడానికి వచ్చే వారి సంఖ్య ఎక్కువగా ఉందట. ఈ నేపథ్యంలో, జాతీయ కార్వెట్ మ్యూజియం లోపలి వైపు ఏర్పడిన ఈ సింక్‌హోల్‌ను మూసివేయకుండా అలానే ఉంచాలని అధికారులు నిర్ణయించారట. అంతేకాకుండా, సింక్‌హోల్ నుంచి బయటకు తీసిన డ్యామేజ్ అయిన కార్లను కూడా తిరిగి సింక్‌హోల్‌లోనే ఉంచాలని యోచిస్తున్నారట.
మరింత సమాచారం తర్వాతి సెక్షన్‌లో.. మరిన్ని వివరాలను ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి..!

తర్వాతి స్లైడ్‌లలో జనరల్ మోటార్స్‌కు చెందిన జాతీయ కార్వెట్ మ్యూజియంలో ఏర్పడిన సింక్‌హోల్ గురించి తెలుసుకోండి.

ఫిబ్రవరి 12, 2014వ తేదీన ఉదయం 5 గంటల 30 నిమిషాల ప్రాంతంలో ఈ కార్ మ్యూజియంలో సింక్‌హోల్ ఏర్పడటం నెమ్మదిగా ప్రారంభమై ఆ తర్వాత 15 నిమిషాల వ్యవధిలో అతిపెద్ద అగాధంగా మారిపోయింది.

ఈ సింక్‌హోల్ తెల్లవారు జామున ఏర్పడటంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు కానీ, ఈ సింక్‌హోల్ వలన మొత్తం 8 వెలకట్టలేని పురాతన షెవర్లే కార్వెట్ కార్లు మట్టిలో కలిసిపోయాయి.

మొత్త ఎనిమిది కార్లలో ఆరు కార్లు కార్వెట్ మ్యూజియంకి చెందినవి కాగా, మిగిలిన రెండు కార్లు జనరల్ మోటార్స్ నుంచి లోనుపై ఉన్నాయి.

ఈ కార్లలో 1962కి చెందిన నలుపు రంగు కార్వెట్, 1984 మోడల్ పిపిజి పేస్ కార్, 1992 మోడల్ మిలియన్త్ కార్వెట్, 1993 మోడల్ రూబీ రెడ్ 40వ వార్షికోత్సవ కార్వెట్, 2001 మోడల్ మాలెట్ హమ్మర్ కార్వెట్ జెడ్06, 2009 మోడల్ 1.5 మిలియన్త్ కార్వెట్ ఉన్నాయి. ఈ ఆరు మోడళ్లు కార్వెట్ మ్యూజియంకు చెందినవి.

ఇకపోతే 1993 మోడల్ కార్వెట్ జెడ్ఆర్-1 స్పైడర్ మరియు 2009 కార్వెట్‌లు జనరల్ మోటార్స్‌కు చెందినవి.

నేషనల్ కార్వెట్ మ్యూజియంలోని స్కై డోమ్ సెక్షన్‌లో ఈ సింక్‌హోల్ ఏర్పడింది.

ఈ విపత్తులో కేవలం ఒకే ఒక్క పురాతన 1983 మోడల్ కార్వెట్ మాత్రమే మిగిలింది. ఎమెర్జెన్సీ వర్కర్లు ఈ కారును అగాధంలోకి పోకుండా కాపాడగలిగారు.

నేషనల్ కార్వెట్ మ్యూజియం బయటి వైపు నుంచి ఇలా కనిపిస్తుంది.

బయటి నుంచి పసుపు రంగులో కనిపించే స్కైడోమ్‌లో ఈ సింక్‌హోల్ ఏర్పడింది.
వీడియో
నేషనల్ కార్వెట్ మ్యూజియంలో ఏర్పడిన సింక్‌హోల్ వీడియోను ఈ స్లైడ్‌లో వీక్షించండి.


Click it and Unblock the Notifications








