చిట్టీ చిట్టీ బ్యాంగ్ బ్యాంక్ మ్యాజిక్ కారు ప్రస్తుత ఓనర్ ఎవరు?

అయితే, పీటర్ జాక్సన్ ఈ కారును ఎప్పుడు కొనుగోలు చేసింది, ఎంత మొత్తం వెచ్చించి కొనుగోలు చేసిన విషయాలను మాత్రం ఆయన వెల్లడించలేదు. ఈ కారును 1967లో తయారు చేశారు. ఇయాన్ ఫ్లెమింగ్ రాసిన ఓ నావెల్ ఆధారంగా చిట్టీ చిట్టీ బ్యాంగ్ బ్యాంగ్ అనే చిత్రాన్ని రూపొందించారు. ఇది బాలల చిత్రం. కెన్ ఆడమ్, రోలాండ్ ఎమ్మెట్ మరియు ఫోర్డ్ రేసింగ్ టీమ్‌లు ఈ కారును తయారు చేశాయి.
ఈ కారు బానెట్‌ను పాలిష్డ్ అల్యూమినియంతో తయారు చేశారు. బోట్ డెక్‌ను బకింగ్‌హామ్‌షైర్‌లోని పడవలు తయారుచేసే వాళ్లతో పూర్తిగా చేతులతో తయారు చేయించారు. ఇందులో వాడిన బ్రాస్ ఫిట్టింగ్‌లను ఎడ్వర్డియన్ కార్ల నుంచి తెప్పించుకున్నారు. ఈ కారు తయారీ సంబంధించి మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. ఇందులో ఉపయోగించిన అల్లాయ్ డ్యాష్‌బోర్డ్ ప్లేటును బ్రిటీష్ మొదటి ప్రపంచ యుద్ధ విమానం నుంచి సేకరించారు.
ఈ కారు బరువు సుమారు రెండు టన్నులు, ఇది 17 ' అడుగుల పొడవు ఉండి ఫోర్డ్ 3 లీటర్ వీ-6 ఇంజన్‌తో నడుస్తుంది. అప్పట్లోనే ఈ కారును ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్‌తో రూపొందించారు. ఈ కారుకు సంబంధించి మరో ఆసక్తి కరమైన అంశం ఏంటంటే.. 1967లో తయారైన ఈ కారుకు "GEN 11" అనే రిజిస్ట్రేషన్ నంబర్‌ను ఇవ్వడం జరిగింది. 1 అంకెను i గా చదివితే అది జెన్నీ (Genii) అనే శబ్దాన్ని ఇస్తుంది. లాటిన్ పరిభాషలో జెన్నీ అంటే మాయలు తెలిసిన వ్యక్తి లేదా వస్తువు అని అర్థం.
గతేడాది సెప్టెంబర్‌లో కూడా జేమ్స్ బాండ్ చిత్రాలయిన గోల్డ్‌ఫింగర్, థండర్‌బాల్ వంటి చిత్రాల్లో ఉపయోగించిన "ఆస్టన్ మార్టిన్ డిబి5" కారు వేలాడని ఉంచితే 4.1 మిలియన్ డాలర్లు పలికింది. అమెరికాకు చెందిన హ్యారీ ఇయాగ్గీ ఈ కారును సొంతం చేసుకున్నారు. ఈ కారును లండన్‌లోని ఆర్ఎమ్ ఆక్షన్ ఆటోమొబైల్ సంస్థ వేలం వేసింది. అప్పట్లో ఇదే అత్యంత వేగంగా ప్రయాణించే కారు. ఇది గంటకు 143 మైళ్ల (233 కిలోమీటర్ల) వేగంతో ప్రయాణిస్తుంది.


Click it and Unblock the Notifications








