ఊహించని ప్రమాదం.. నేరుగా చెరువులోకి దూసుకెళ్లిన కారు.. కారణం అదేనా?
హైవేలపై నిత్యం రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయి. చిన్న చిన్న పొరపాట్ల వల్ల చాలా ప్రమాదాలు పెద్ద ప్రమాదాలకు దారి తీస్తున్నాయి. ఎక్కువ ప్రమాదాలు అతి వేగం వల్లనే జరుగుతున్నాయి. ముఖ్యంగా వర్షాకాలంలో వచ్చినప్పుడు రోడ్డుపై జరిగే ప్రమాదాలు అత్యంత ప్రమాదకరంగా మారుతున్నాయి. తాజాగా ఓ హైవేపై వేగంగా వచ్చిన స్కోడా కుషాక్ ఎస్‌యూవీ తడి రోడ్డుపై ఓవర్ టేక్ చేసే ప్రయత్నంలో అదుపుతప్పిన చెరువులోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదానికి సంబంధించిన మొత్తం విజువల్స్ సీసీటీవీ కెమెరాలో రికార్డు అయ్యాయి.
తాజాగా జరిగిన ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియోను నిఖిల్ రానా తన యూట్యూబ్‌లో షేర్ చేశాడు. ఈ ప్రమాదం ఎక్కడ జరిగిందో తెలియరాలేదు. అయితే ఈ ఇది కచ్చితంగా దక్షిణ భారతదేశంలో జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఎస్‌యూవీ ప్రమాద సమయంలో వర్షం పడటం మరియు రహదారి పూర్తిగా తడిగా ఉండటాన్ని మనం చూడవచ్చు. అంతే కాకుడా రద్దీగా ఉండే రహదారిగా ఉంది. వీడియో ప్రకారం వాహనాలు ఎక్కువగానే ప్రయాణిస్తున్నాయి.

ఈ వీడియోలో విజువల్స్ ప్రకారం హైవేపై ఒక వైట్ కలర్‌లోని ఎస్‌యూవీ వేగంగా వెళ్తుండటాన్ని మనం గమనించవచ్చు. ముందు వెలుతున్న కారుని ఓవర్‌టేక్ చేసే క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. ముందు కారుని అధిగమించే ప్రయత్నంలో ఆ కారు నియంత్రణను కోల్పోయింది. వెంటనే డివైడర్‌ని ఢీకొని రోడ్డు నుంచి ఎడమచేతి వైపుకు వచ్చింది. కారుని కంట్రోల్ చేసే క్రమంలో హైవే గుండా వెళుతున్న మరో రెండు వాహనాలను ఢీకొట్టబోయింది.
ఎస్‌యూవీ అదుపు తప్పి హైవే అవతలి వైపుకు వెళ్లింది. ఎస్‌యూవీ స్పీడ్ ఎక్కువగా ఉండటంతో కంట్రోల్ చేయలేక పోయాడు. వెంటనే లెఫ్ట్ సైడ్‌కి వస్తూ హైవే నుంచి అదుపుతప్పి పక్కనే ఉన్న చెరువులో పడిపోయింది. ప్రమాదం జరిగిన సమయంలో కారులో నలుగురు ఉన్నట్లు వీడియోలో ఉంది. వారందరినీ రక్షించి, స్వల్ప గాయాలతో సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

చెరువులోని నీరు ఉండటం వల్ల పెను ప్రమాదం తప్పిందని చెబుతున్నారు. అందువల్లే వారి ప్రాణాలతో బయటపడినట్లు స్థానికులు చెప్పారు. కారు అడుగు భాగాన్ని లేదా రోడ్డుపై ఉన్న మరో వాహనాన్ని ఢీకొట్టి ఉంటే ప్రమాద తీవ్రత వేరే విధంగా ఉండేదని అన్నారు. ఆగి ఉన్న వాహనాన్ని లేదా చెట్టును కారు ఢీకొట్టి ఉంటే అది కూడా పెద్ద ప్రమాదానికి దారి తీసేది అంటున్నారు.
ఆక్వాప్లానింగ్ కారణమా?: ఈ ప్రమాదానికి ఆక్వాప్లానింగ్ అనేది సింపుల్ ఆన్సర్ అని చెప్పవచ్చు. టైర్ మరియు రోడ్డు మధ్య సన్నని నీటి పొర ఏర్పడటాన్ని ఆక్వాప్లానింగ్ అంటారు. ఇది జరిగినప్పుడు, రహదారికి ఏకైక కాంటాక్ట్ పాయింట్ అయిన టైర్, స్టీరింగ్ ఫీడ్‌బ్యాక్‌కి ప్రతిస్పందించడం ఆపివేస్తుంది దీంతో కారు నియంత్రణను కోల్పోతుంది. వాహనం వేగం పెరిగే కొద్దీ ఆక్వాప్లానింగ్ ప్రమాదం పెరుగుతుంది.
ఆక్వాప్లానింగ్ అధిక వేగంతో డ్రైవింగ్ చేస్తుంటే తడి రోడ్లపై జరిగే అవకాశం ఉంటుంది. అందువల్ల వేగంగా వెళ్లకూడదు. అలా వెళ్లడం వల్ల టైర్‌పై గల త్రెడ్స్ (దారాలు) నీటిని బయటకు నెట్టివేయడానికి పట్టును (గ్రిప్‌ని) అందించదు. ఇలాంటి సందర్భాల్లో కారుని కంట్రోల్ చేయడం ఎక్స్‌పర్ట్స్ వల్ల కూడా కాదు. దీనిని ప్రతి ఒక్కరూ మైండ్‌లో పెట్టుకుని డ్రైవ్ చేయాలి.
ఏం చేయాలి?: మీకు ఎప్పుడైనా ఇలాంటి పరిస్థితి ఎదురైతే వెంటనే యాక్సిలరేటర్ నుంచి మీ పాదాన్ని తీసీవేయడం ఉత్తమం. కారు వేగం తగ్గినప్పుడు టైర్లు రహదారిపై ఉండి నియంత్రణలోకి వస్తుంది. అలాగే స్పీడ్‌గా వెళ్తే మీ కారు పల్టీలు కొట్టే అవకాశం ఉంటుంది. వేగం ఎక్కువగా ఉంటే స్టీరింగ్ కూడా స్పందించదు. ఇక ఆఖరుగా వర్షాకాలానికి ముందు మీ కారు టైర్ల కండిషన్ చెక్ చేసుకోండి.


Click it and Unblock the Notifications








