Just In
- 22 hrs ago
బైడెన్ ఉపయోగించే 'మృగం' లాంటి కారు గురించి కొన్ని ఆసక్తికర విషయాలు
- 24 hrs ago
మీకు తెలుసా.. ఇది ప్రపంచంలో అత్యంత వేగవంతమైన ట్రైన్ కానుంది
- 1 day ago
నిస్సాన్ మాగ్నైట్ అప్డేట్: 35,000కి పైగా బుకింగ్స్, 2 లక్షలకు పైగా ఎంక్వైరీస్
- 1 day ago
డిసెంబర్లో ఫర్వాలేదనిపించిన బజాజ్; ఏ మోడల్ ఎక్కువగా అమ్ముడైందంటే..
Don't Miss
- Movies
శ్రీరాముడిపై మోనాల్ గజ్జర్ అనుచిత వ్యాఖ్యలు: అందుకే అలాంటోడిని చేసుకోనంటూ షాకింగ్‌గా!
- Lifestyle
సోమవారం దినఫలాలు : ఉద్యోగులు ఈరోజు పనిని సకాలంలో పూర్తి చేయడంలో విఫలమవుతారు...!
- News
ఘోరం: పూజల పేరుతో ఇద్దరు కుమార్తెలను చంపిన తల్లిదండ్రులు, మళ్లీ బతికిస్తాం, కరోనా శివుడి తల నుంచే..
- Sports
Sri Lanka vs England: జోరూట్ జోరు.. శ్రీలంక బేజారు!
- Finance
బడ్జెట్, మొబైల్ యాప్‌లో 14 డాక్యుమెంట్ల పూర్తి వివరాలు
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
'స్కైడ్రైవ్ ఎస్డి-03' ఫ్లయింగ్ కార్ పరీక్షలు విజయవంతం; నెక్స్ట్ ఏంటి?
ఎగిరే కారు కల నిజం కాబోతుందా? ఏమో ఈ జపనీస్ కంపెనీ ప్రయత్నాలు చూస్తుంటే, ఇది నిజమయ్యే అవకాశం కనిపిస్తోంది. జపాన్‌కు చెందిన అర్బన్ మొబిలిటీ సంస్థ స్కైడ్రైవ్ ఐఎన్సి రూపొందించిన ఫ్లయింగ్ కార్ "ఎస్డి-03"ని విజయవంతంగా మనుషులతో పరీక్షించినట్లు కంపెనీ ప్రకటించింది.

స్కైడ్రైవ్ ఐఎన్సి తమ 'ఫ్లయింగ్ కార్' ప్రాజెక్ట్‌ను తొలిసారిగా ఆగస్టు 25, 2020వ తేదీన జపాన్‌లోని ఓ కార్యక్రమం ద్వారా ప్రపంచానికి పరిచయం చేసింది. జపాన్‌లో 2.5 ఎకరాల (10,000 చదరపు మీటర్ల) స్థలంలో ఉన్న టయోటా టెస్ట్ ఫీల్డ్‌లో కంపెనీ విజయవంతమైన మ్యాన్డ్ టెస్ట్ ఫ్లైట్స్‌ను కంపెనీ నిర్వహించింది.

స్కైడ్రైవ్ ఎస్డి-30 ఒక సింగిల్-సీటర్ ఫ్లయింగ్ కారు, టెస్ట్ ఫ్లైట్‌లో భాగంగా ఈ ఫ్లయింగ్ కారును భూమి నుండి కొన్ని అడుగుల ఎత్తులో మొత్తం ఫీల్డ్‌ను నాలుగు నిమిషాల పాటు ఎగిరించారు. ఈ ఫ్లయింగ్ కారు టెస్ట్ ఫ్లైట్‌ను పైలట్ ద్వారా నిర్వహించారు. అయినప్పటికీ, ఇందులో కంప్యూటర్ ఆధారిత కంట్రోల్స్ మరియు సేఫ్టీ సిస్టమ్స్ విమాన స్థిరత్వాన్ని నిర్ధారిస్తాయని కంపెనీ తెలిపింది.
MOST READ:మహీంద్రా మరాజో బిఎస్6 విడుదల - ధర, ఫీచర్లు, వివరాలు

ఈ టెస్టింగ్‌లో వాతావరణ పరిస్థితులు మరియు విమానాల పనితీరును పర్యవేక్షించే ఫీల్డ్‌లోని సాంకేతిక సిబ్బంది కూడా పాల్గొన్నారు. స్కైడ్రైవ్ తెలిపిన వివరాల ప్రకారం, ఎస్డి-03 ఫ్లయింగ్ కారులో డ్రోన్ మాదిరిగా ఎనిమిది ఎలక్ట్రిక్ మోటార్లు, ప్రతి చివర్లో రెండు చొప్పున ఉంటాయి.
ఈ ఎలక్ట్రిక్ మోటార్లకు ఎగువన మరియు దిగువన రెండేసి చొప్పున అమర్చిన రోటర్లు ఒక్కొక్కటిగా వ్యతిరేక దిశల్లో తిరుగుతూ ఇంజన్‌కు శక్తినిస్తాయి. అత్యవసర పరిస్థితుల్లో కూడా భద్రతను నిర్ధారించడం మరియు అవసరమైన అన్ని ప్రమాణాలను పాటించడం కోసం ఇందులో ఎనిమిది ఎలక్ట్రిక్ మోటార్లను ఉపయోగించారు.
MOST READ:హ్యుందాయ్ వెన్యూ ఐఎమ్‌టి స్పోర్ట్ ట్రిమ్ వేరియంట్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ

స్కైడ్రైవ్ ఎస్డి-03 ఫ్లయింగ్ కారు ప్రపంచంలోనే అతి చిన్న ఎలక్ట్రిక్ వెర్టికల్ టేక్-ఆఫ్ మరియు ల్యాండింగ్ (ఇవిటిఓఎల్) మోడల్. సమీప భవిష్యత్తులో ఇది ప్రజా రవాణా సాధనంగా వినియోగించే అవకాశం ఉందని కంపెనీ భావిస్తోంది. దీని కొలతలను గమనిస్తే, ఈ ఎగిరే కారు నాలుగు మీటర్ల పొడవు, నాలుగు మీటర్ల వెడల్పు మరియు రెండు మీటర్ల ఎత్తును కలిగి ఉంటుంది.

డిజైన్ పరంగా చూస్తే, స్కైడ్రైవ్ ఎస్డి -03 ఫ్లయింగ్ కారు సొగసైన ఏరోడైనమిక్ స్టైలింగ్‌ను ఉంటుంది. ఈ వాహనం ముందు భాగంలో రెండు వైట్ లైట్లు, దిగువన రెడ్ లైట్ ఉంటుంది. ఈ రెడ్ కలర్ లైట్ ఆకాశంలో ఫ్లయింగ్ కార్ ఏ మార్గంలో వెళుతుందో నిర్ణయించడంలో సహాయపడుతుంది.
MOST READ:'స్కైడ్రైవ్ ఎస్డి-03' ఫ్లయింగ్ కార్ పరీక్షలు విజయవంతం; నెక్స్ట్ ఏంటి?

స్కైడ్రైవ్ ఇప్పుడు ఈ ఎగిరే కార్ల పరీక్షలను మరింత విస్తరించే దిశలో ఉంది. ఇది దేశంలోని సివిల్ ఏరోనాటిక్స్ చట్టం ప్రకారం, అన్ని భద్రతా చర్యలు మరియు నిబంధనల పాటించేలా, వారి నుండి పూర్తి సమ్మతిని పొందటానికి సాంకేతికతను మరింత మెరుగుపరచడంలో కంపెనీ సహాయపడుతుంది. ఈ ఫ్లయింగ్ కారు పరీక్షలను 2020 చివరి నాటికి తమ ప్లాంట్ పరిమితికి మించి విస్తరించేలా ఆమోదాలు పొందాలని కంపెనీ చూస్తోంది.

స్కైడ్రైవ్ ఐఎన్సి సిఈఒ టోమోహిరో ఫుకిజావా మాట్లాడుతూ.. "ఇలాంటి విమానాలను వాణిజ్యీకరించే లక్ష్యంతో మేము 2018లో స్కైడ్రైవ్‌ను స్థాపించిన రెండు సంవత్సరాలలోనే జపాన్ యొక్క మొట్టమొదటి ఎగిరే కారును విజయవంతంగా పరీక్షించినందుకు మేము చాలా సంతోషిస్తున్నాము. వచ్చే 2023 నాటికి మా ఈ సామాజిక ప్రయోగాన్ని తదుపరి స్థాయికి తీసుకెళ్లాని మేము లక్ష్యంగా పెట్టుకున్నాము మరియు ఆ దిశగా మేము మా సాంకేతిక అభివృద్ధిని మరియు మా వ్యాపార అభివృద్ధిని వేగవంతం చేస్తామని" అన్నారు.
MOST READ:భారత్‌లో ఆడి ఆర్ఎస్ క్యూ8 విడుదల, ధర తెలిస్తే షాక్ అవుతారు!

"ఆకాశంలో ఎగిరే కార్లు రవాణాయోగ్యమైనవిగా మరియు సౌకర్యవంతమైన రవాణా మార్గంగా ఉండే లాంటి సమాజాన్ని సృష్టించాలని మేము ఆకాంక్షిస్తున్నాము. ప్రజలకు సురక్షితమైన మరియు సౌకర్యవంతమైన కొత్త జీవన విధానాన్ని అనుభవించగలిగేలా మా భాగస్వామి సంస్థల సహకారంతో ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లను అభివృద్ధి చేయాలని కూడా మేము కోరుకుంటున్నాము. తద్వారా స్కైడ్రైవ్ సరఫరా చేసే విమానాలతో అర్బన్ ఎయిర్ మొబిలిటీ సొసైటీని కేవలం జపాన్‌లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా రియాలిటీ అవుతుందని" అన్నారు.

జపనీస్ ఫ్లయింగ్ కారుపై డ్రైవ్స్పార్క్ అభిప్రాయం.
ఫ్లయింగ్ కార్లు ప్రస్తుతానికి రియాలిటీకి చాలా దూరంలోనే ఉన్నప్పటికీ, అప్పుడప్పుడూ ఇలాంటి కంపెనీలు చేసే ప్రయత్నాల వలన ఊహలు నిజమవుతాయనిపిస్తుంటుంది. కొన్నేళ్లుగా ‘ఫ్లయింగ్ కార్ల' కోసం చాలా ప్రాజెక్టులు జరిగాయి, కొన్ని అభివృద్ధి దశలో ఆగిపోతే, మరికొన్ని కాన్సెప్ట్ దశలోనే ఆగిపోయాయి. తాజాగా స్కైడ్రైవ్ నుండి ప్రాజెక్ట్ మాత్రం కాస్తంత ఆశాజనకంగానే ఉందని చెప్పాలి.