ఇక ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే.. మీ కథ కంచికే.. ఎందుకంటే?

ప్రపంచ వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల వల్ల ప్రతి సంవత్సరం కొన్ని లక్షల మంది మృత్యువాత పడుతున్నారు. దీనిని నివారించడానికి సంబంధింత ప్రభుత్వాలు కూడా అనేక కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నాయి. దీని కోసం లేటెస్ట్ మరియు హై టెక్నాలజీని ఉపయోగిస్తున్నాయి.

ఇక ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే.. మీ కథ కంచికే.. ఎందుకంటే?

ఇందులో భాగంగానే ఆస్ట్రేలియాలోని క్వీన్స్ ల్యాండ్ అధికారులు రోడ్లపై రూల్స్ అతికర్మించే వాహనాలను గుర్తించడానికి స్మార్ట్ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. సీట్‌బెల్ట్ ధరించని మరియు డ్రైవింగ్ చేసేటప్పుడు మొబైల్‌లో మాట్లాడే వాహనదారులను గుర్తించడానికి ఈ కెమెరాలు సహాయపడతాయని అధికారులు స్వయంగా తెలిపారు.

ఇక ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే.. మీ కథ కంచికే.. ఎందుకంటే?

ఇందులో పట్టుబడ్డ వాహనదారులకు మొదటి మూడు నెలల వరకు ఎటువంటి జరిమానా విధించబడదు. అయితే ఇటువంటివి మళ్ళీ కొనసాగించకూడదని వార్ణింగ్ ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ మూడు నెలల తరువాత డ్రైవింగ్ చేసేటప్పుడు, మొబైల్ ఫోన్‌లో మాట్లాడుతుంటే, వారికి $ 1033 జరిమానా విధిస్తారు. అంటే ఇది భారత కరెన్సీ ప్రకారం 56,000 రూపాయలు. ఆస్ట్రేలియాలో ట్రాఫిక్ ఉల్లంఘనలకు విధించే అతిపెద్ద జరిమానా ఇది.

ఇక ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే.. మీ కథ కంచికే.. ఎందుకంటే?

అదేవిధంగా సీట్‌బెల్ట్ ధరించని వాహనదారులకు $ 413 జరిమానా విధించబడుతుంది. ప్రతి రోడ్డుకి ఒక మూలలో స్మార్ట్ కెమెరాలు ఏర్పాటు చేయబడ్డాయి. ఈ కెమెరాలు రోడ్డు దాటుతున్న వాహనాలు మరియు వాటి లోపల డ్రైవర్ల ఫోటోలను షూట్ చేస్తుంది. ఈ కెమెరాలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ అనే వ్యవస్థ ఉంటుంది.

ఇక ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే.. మీ కథ కంచికే.. ఎందుకంటే?

ఈ కెమెరాలు నియమాలను అతిక్రమించిన వాహనదారుల ఫోటోలు తీసిన తరువాత, నేరుగా పోలీసులకు పంపుతుంది. వీటిని పరిగణలోకి తీసుకుని పోలీసులు వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ టెక్నాలజీ వల్ల దాదాపు ఇటువంటి అతిక్రమణ చర్యలు మళ్ళీ జరగకుండా ఉంటాయి.

ఇక ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే.. మీ కథ కంచికే.. ఎందుకంటే?

ఇటువంటి టెక్నాలజీ కలిగిన స్మార్ట్ కెమెరాలు భారతదేశంలో ఇంకా అందుబాటులోకి రాలేదు. అయితే సాధారణ కెమెరాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఈ కెమెరాల ద్వారా నిబంధనలు అతిక్రమించిన వాహనదారుణ్ని త్వరగా గుర్తించలేరు. దీనికి కొంత సమయం అవసరం.

ఇక ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే.. మీ కథ కంచికే.. ఎందుకంటే?

క్వీన్స్‌లాండ్‌లో ఈ నెల నుంచి వచ్చే ఆరు నెలల పాటు స్మార్ట్ టెక్నాలజీని పరీక్షిస్తారు. సీట్‌బెల్ట్ ధరించని డ్రైవర్‌ను గుర్తించడానికి కెమెరాలను ఏర్పాటు చేసిన ప్రపంచంలో మొట్టమొదటి నగరం క్వీన్స్‌ల్యాండ్ మరియు ఆస్ట్రేలియా. ఇక్కడ తప్పు చేసిన వాహనదారులు త్వరగా శిక్షించబడతారు.

ఇక ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే.. మీ కథ కంచికే.. ఎందుకంటే?

డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మొబైల్ వాడుతున్న వాహనదారులను ట్రాక్ చేయడానికి మార్చి 2020 నుండి ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్ వేల్స్‌లో కెమెరాలు ఏర్పాటు చేయబడ్డాయి. ఆ తర్వాత, డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మొబైల్ వాడుతున్న వాహనదారులను గుర్తించడానికి క్వీన్స్‌ల్యాండ్‌లో కెమెరాలు ఏర్పాటు చేయబడ్డాయి.

ఇక ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే.. మీ కథ కంచికే.. ఎందుకంటే?

2023 నుండి, విక్టోరియన్ అధికారులు స్మార్ట్ కెమెరాలను ఉపయోగించి ట్రాఫిక్ ఉల్లంఘకులను ట్రాక్ చేయాలని నిర్ణయించారు. ఇవన్నీ ప్రమాదాల సంఖ్యను బాగా తగ్గించడానికి ఉపయోగపడుతుంది. మనదేశంలో కూడా ఇటువంటి స్మార్ట్ కెమెరాలను ఏర్పాటుచేయడానికి తగిన సన్నాహాలు చేయాలి. అప్పుడే మనదేశంలో కూడా ప్రమాదాలు బాగా తగ్గుతాయి.

NOTE:ఇక్కడ ఉపయోగించిన ఫోటోలు కేవలం రిఫరెన్స్ కోసం మాత్రమే.

Most Read Articles

English summary
Smart Cameras Installed In Queensland Detects Traffic Rules. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X