స్మార్ట్‌ప్లేన్ - స్మార్ట్‌ఫోన్‌తో కంట్రోల్ అయ్యే విమానం

By Ravi

స్మార్ట్ ఫోన్లతో ప్రపంచం అరచేతుల్లోకి వచ్చి చేరింది. ఏది కావాలన్నా స్మార్ట్ ఫోన్లతో సాధించుకునే వెసలుబాటు కలుగుతోంది. అభివృద్ధి చెందిన సాంకేతికతతో ఇప్పటికే కార్లు, బైక్‌లు మొదలైన వాటిని స్మార్ట్ ఫోన్ల సాయంతో కంట్రోల్ చేయటం సాధ్యమైంది. తాజాగా, స్మార్ట్ ఫోన్ సాయంతో కంట్రోల్ చేయగలిగే విమానాన్ని ఓ జర్మన్ కంపెనీ తయారు చేసింది.

అయితే, ఇది నిజమైన విమానం కాదు. రేడియో కంట్రోల్డ్ విమానాల మాదిరిగా ఓ బొమ్మ విమానం. స్మార్ట్‌ప్లేన్‌గా పిలిచే ఈ విమానాన్ని మీ చేతిలో ఉండే స్మార్ట్ ఫోన్ సాయంతో కంట్రోల్ చేయవచ్చు. మీరు ఫోన్‌ను ఎలా తిప్పితే విమానం ఆ దిశగా తిరుగుతుంది. ధృడమైన, సౌకర్యవంతమైన ఈఈపి మెటీరియల్‌ను ఉపయోగించి ఈ స్మార్ట్‌‌ప్లేన్‌ను తయారు చేశారు.

మరింత సమాచారం తర్వాతి సెక్షన్‌లో.. మరిన్ని వివరాలను ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి..!

స్మార్ట్‌ప్లేన్

తర్వాతి స్లైడ్‌లలో ఈ స్మార్ట్‌ప్లేన్‌కు సంబంధించిన మరింత సమాచారాన్ని తెలుసుకోండి.

స్మార్ట్‌ప్లేన్

ఈ విమానం అత్యంత తేలికైనది. దీని బరువు 0.4 ఔన్సులు (11.34 గ్రాములు) మాత్రమే. ఒక్కసారి చార్జ్ చేస్తే, ఇది 15 నిమిషాల వరకు గాలిలో ఎగురుతుంది. ఇది దాదాపు 200 అడుగుల ఎత్తు వరకు ఎగురుతుంది. బ్యాటరీ పూర్తిగా ఖాలీ అయిపోతే కేవలం 13 నిమిషాల్లోనే దీనిని ఫుల్‌గా చార్జ్ చేసుకోవచ్చు.

స్మార్ట్‌ప్లేన్

బ్లూటూత్ సాయంతో ఈ ప్లేన్‌ను మీ స్మార్ట్‌‌ఫోన్‌తో కనెక్ట్ చేసుకోవచ్చు. ఒక్కసారి కనెక్ట్ చేసుకున్న తర్వాత స్మార్ట్ ఫోన్‌లోని స్క్రీన్‌పై మీ చేతివేళ్ల సాయంతో విమానాన్ని కంట్రోల్ చేయవచ్చు. కేవలం ఒక్క చేతితోనే దీనిని ఆపరేట్ చేయవచ్చు. అవుట్‌డోర్‌తో పాటుగా ఇండోర్‌లో కూడా మంచి ఫన్ కోరుకునే వారికి ఇదొక బెస్ట్ ఐటెం.

స్మార్ట్‌ప్లేన్

ఈ స్మార్ట్‌ప్లేన్‌ను ఫుల్-టైమ్ అవుట్‌డోర్ కోసం డిజైన్ చేయబడినది కాదు. ఇది చాలా తేలిగా ఉన్నందను, బయట వీచే గాలి దీనికి అవాంతరంగా మారొచ్చు. ప్రశాంతగా ఉండే ఇండోర్‌లో కూడా చక్కగా ఎగురుతుంది. బ్లూటూత్ వెర్షన్ 4.3 లేదా ఆ తర్వాతి వెర్షన్లను కలిగి ఉన్న ఏ ఆండ్రాయిడ్ ఫోన్‌తో అయినా దీనిని కనెక్ట్ చేసుకోవచ్చు. ఐఫోన్ 4ఎస్, ఐపాడ్ టచ్ 5, ఐప్యాడ్ 3 మోడళ్లను కూడా ఇది సపోర్ట్ చేస్తుంది.

స్మార్ట్‌ప్లేన్

ఈ స్మార్ట్‌ప్లేన్‌కు ఫ్లైట్ అసిస్ట్ మోడ్ కూడా ఉంది, ఇది దాదాపు ఆటో పైలట్ మోడ్ మాదిరిగా పనిచేస్తుంది. ఈ మోడ్‌లో ఉంచినప్పుడు ప్లేన్ ఆటోమేటిక్‌గా కంట్రోల్ అవుతుంది. ఈ ప్లేన్‌లో పనిచేసే ఓ రడ్డర్ కూడా ఉంటుంది, ఇది విమానం టర్న్ తీసుకునేందుకు ఉపయోగపడుతుంది.

స్మార్ట్‌ప్లేన్

ఇన్ని ఫీచర్లు కలిగి ఉన్న ఈ విమానం ధర కేవలం 49 డాలర్లు (రూ.2940) మాత్రమే.

వీడియో

స్మార్ట్‌ప్లేన్ పనితీరును చూపించే వీడియోను ఈ స్లైడ్‌లో వీక్షించండి.

More from DriveSpark

Article Published On: Friday, July 4, 2014, 17:30 [IST]
English summary
Toby Rich, a German company set up in Bremen has come up with something really cool! They have created a one-of-a-kind smartphone-operated aircraft, the Smart-Plane.This company which specialises in creating smart phone gadgets, have made this plane using EEP material, which is strong and flexible at the same time.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+