బెంగళూరు ట్రాఫిక్‌కు బోల్తా పడిన స్మార్ట్ వాచ్.. వైరల్ అవుతున్న నెటిజన్ల కామెంట్స్..
టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ అది మనిషి జీవితంలో ఓ భాగమైపోయింది. ఆధునిక సాంకేతికత సాయంతో మన ఆరోగ్య పరిస్థితులను కూడా తెలుసుకోగలుగుతున్నాం. ఇదివరకు చేతికి వాచ్ జస్ట్ టైమ్ చూసుకోవడానికి మాత్రమే ఉపయోగపడితే.. ఇప్పుడు స్మార్ట్ వాచ్‌ల ద్వారా మన యాక్టివిటీస్‌ని సైతం తెలుసుకుంటున్నాం.
స్మార్ట్ వాచ్‌ల ద్వారా మనం ఇంట్లో ఉన్నప్పుడు మన శరీర ఉష్ణోగ్రత, బీపీ లెవెల్.. అదే బయట ఉన్నప్పుడు ఎలా ఉంది అనేది మనం స్పష్టంగా తెలుసుకోవచ్చు. అదే విధంగా మనం ఆరోజు ఎంత దూరం నడిచామనేది కూడా చెబుతుంది. ఇప్పుడు అందుకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్‌గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

బెంగళూరు ట్రాఫిక్(Bengaluru Traffic) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఐటీ హబ్‌గా పేరొందిన ఆ మహానగరం రోడ్లు నిత్యం ట్రాఫిక్‌తో రద్దీగా ఉంటాయి. అక్కడి ట్రాఫిక్‌పై కామెంట్లు చేస్తూ పలువురి ట్వీట్లు సైతం వైరల్‌గా మారింది. తాజాగా ఓ ట్వీట్ సైతం నెట్టింట్లో నవ్వులు పూయిస్తుంది.
ఓ వ్యక్తి బెంగళూరులో బైక్‌పై వెళుతుండగా అతని స్మార్ట్ వాచ్‌లో సైకిల్ తొక్కుతున్నట్లుగా చూయించింది. అవాక్కయిన ఆ వ్యక్తి తన స్మార్ట్ వాచ్‌లో సైక్లిస్ట్ అని చూపించడాన్ని ఫొటో తీసి ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. అందుకు సంబంధించిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బెంగుళూరులో అధ్వాన్నంగా ఉన్న ట్రాఫిక్‌ను ఉద్దేశించి పలువురు ఈ ట్వీట్‌పై విమర్శలు చేస్తున్నారు.
బెంగళూరు మహానగరం రోడ్లపై దాదాపు పది కిలోమీటర్లు ప్రయాణించాలంటే గంటపాటు ప్రయాణం చేయాల్సి వస్తుంది. దీంతో నగర వాసులు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. బెంగళూరులో రద్దీ కారణంగా ఈ సమస్య ఎక్కువగా ఉంది. ప్రజా రవాణాను ఉపయోగించకుండా సొంత వాహనాల్లో వెళ్లడమే ఇందుకు కారణంగా చెప్పవచ్చు.
ఈ సందర్భంలో బెంగళూరుకు చెందిన ఓ వ్యక్తి తన ట్విట్టర్ పేజీలో బెంగళూరు ట్రాఫిక్ గురించి షేర్ చేసిన ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. చాలా మంది దీన్ని షేర్ చేస్తూ విమర్శలు చేస్తున్నారు. దీనిపై సోషల్ మీడియాలో చర్చ మొదలైంది.
ట్వీట్‌ను పోస్ట్ చేసిన గావాల్ ఓప్రా బెంగళూరు ట్రాఫిక్‌లో బైక్ నడుపుతుండగా, అతను వ్యాయామం చేస్తున్నాడని, అంతే కాకుండా బయట సైక్లింగ్ చేస్తున్నాడని స్మార్ట్ వాచ్ చూపించింది. ఇందుకోసం వర్క్ అవుట్ వివరాలను కూడా డిస్‌ప్లే చేసింది. సాధారణంగా స్మార్ట్ వాచ్ పెట్టుకున్నప్పుడు మన శరీర కదలికలను పర్యవేక్షిస్తుంది. ఈ సంఘటనలో ఆ వ్యక్తి బెంగళూరులోని రద్దీగా ఉండే ప్రాంతంలో నెమ్మదిగా బైక్ నడుపుతుండటంతో అతను సైక్లింగ్ చేస్తున్నట్లుగా భావించింది.
ఆ వివరాలను చూసి ఒకింత ఆశ్చర్యాన్ని గురైన గావాల్ ఓప్రా.. బెంగళూరు ట్రాఫిక్ పరిస్థితి ఇదంటూ సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. ట్రాఫిక్ లేకుండా రోడ్డుపై ప్రయాణించాలంటే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా రోడ్డు నిబంధనలు పాటించాలని అధికారులు చెబుతున్నారు. కొందరు వ్యక్తులు రోడ్డు నిబంధనలను ఉల్లంఘించడం వల్ల పెద్ద ట్రాఫిక్ సమస్య ఏర్పడుతుంది. బెంగళూరు వంటి మెట్రోపాలిటన్ నగరాల్లో ఈ సమస్య పెద్ద తలనొప్పిగా ఉంది.
అయితే ఈ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేసింది. దీనికి పరిష్కారం కావాలంటే ప్రజా రవాణా వైపు ప్రజల ఆలోచన మారాలి. తాజాగా బెంగళూరులో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించడానికి కర్ణాటక ప్రభుత్వం అతి పెద్ద టన్నెల్ రోడ్డును నిర్మించాలని భావించింది. దాదాపు 99 కి.మీ మేర ఈ రోడ్డు విస్తరించనుంది. ఇదే కనుక పూర్తయితే బెంగళూరు వాసులకు ట్రాఫిక్ కష్టాలు తీరినట్లే.


Click it and Unblock the Notifications








