హోండా యాక్టివా స్కూటర్ ముందు భాగంలో నాగుపాము కలకలం.. వీడియో వైరల్
పార్కింగ్ చేసిన కార్లు, బైక్‌లలో కొన్నిసార్లు పాములు తలదాచుకుంటాయి. వర్షాకాలం, శీతాకాలంలో ఇలాంటి ఘటనలు ఎక్కువగా జరుగుతుంటాయి. ఈ సమయాల్లో బయట చల్లని వాతావరణం ఉంటుంది. కనుక కాస్త వెచ్చదనం కోసం పాములు బైక్, కార్లు, ఇతర వాహనాల్లోకి వెళ్తుంటాయి. ఇలాంటి వీడియోలు వైరల్ అవుతుంటాయి.
తాజాగా అలాంటి ఘటన కేరళ రాష్ట్రంలో చోటుచేసుకుంది. హాండా యాక్టివా స్కూటర్‌లో పాము కనిపించింది. ఈ వీడియోను ఓ యువకుడు తన ఇన్‌స్టాగ్రాం ద్వారా షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుంది. ఈ వీడియో కాస్త భయాందోళనకు గురిచేస్తుంది.

హాండా యాక్టివా వాహనం హెడ్ భాగంలో కదలికలను గుర్తించిన యజమాని, అక్కడ ఏముందో తెలుసుకొనేందుకు ప్రయత్నం చేశాడు. అయితే కాసేపటికే స్కూటర్ ముందుభాగంలో పాము ఉన్నట్లు నిర్ధారణకు వచ్చాడు. దీంతో వెంటనే ఆందోళనకు గురైన యజమాని.. పాములు పట్టే వ్యక్తికి సమాచారం ఇచ్చారు. కాసేటికి ఘటన స్థలానికి వచ్చిన వ్యక్తి స్కూటర్ హెడ్‌లైట్ నుంచి పామును బయటకు తీశాడు.
ఈ వీడియోలో స్కూటర్ ముందుభాగంలో నాగుపాము ఉండడం గమనించవచ్చు. ఓ వ్యక్తి ఎంతో చాకచక్యంతో పామును బయటకు తీయడం గుర్తించవచ్చు. అనంతరం ఆ నాగుపామును నేలమీద విడిచిపెట్టడం వీడియోలో గమనించవచ్చు. ఆ పామును తర్వాత సమీపంలోని అడవిలో సురక్షితంగా విడిచిపెట్టినట్లు తెలుస్తోంది.
అదృష్టవశాత్తు హోండా యాక్టీవాలో అనుమానాస్పద కదలికలు గుర్తించి, యాజమాని అప్రమత్తంగా వ్యవహరించాడు. లేకుంటే డ్రైవింగ్ చేస్తున్న సమయంలో పాము బయటకు వస్తే.. దానిని చూసి రైడర్ భయందోళనకు గురయ్యే అవకాశం ఉండేది. ఫలితంగా ప్రమాదం జరిగే అవకాశం ఉండేది. ఈ ఘటనలో రైడర్ అప్రమత్తంగా వ్యవహరించాడు.
అయితే వర్షాకాలం, శీతాకాలంలో ఎక్కువ రోజులపాటు బైక్, కార్లు, స్కూటర్లను ఒకే ప్రాంతంలో పార్కింగ్ చేయకుండా చూసుకోండి. అలా ఒకే ప్రాంతంలో ఎక్కువ రోజులు ఉండడం కారణంగా.. పాములు సహా ఇతర పక్షులు వాహనాల్లో నివాసం ఏర్పరచుకొనే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు వాహనాల్లోని ఎలక్ట్రిక్ పరికరాలు దెబ్బతినే అవకాశం ఉంటుంది.
అందువల్ల వాహనాల పార్కింగ్ ప్రాంతాలు శుభ్రంగా ఉండేటట్లు చూసుకోండి. ఎక్కువ రోజులపాటు వాహనాన్ని పార్కింగ్ చేయాల్సి వస్తే.. అందుకు తగిన ఏర్పాట్లు చేయండి. పాములు సహా ఇతర పక్షులు అవాసం ఏర్పాటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే ఇలాంటి విషపూరిత పాములు వాహనాల్లోకి ప్రవేశించకుండా ఉంటాయి.
మీ వాహనాల్లోకి పాములు సహా ఇతర పక్షలు చొరబడినట్లు గుర్తిస్తే.. వాటికి స్వయంగా పట్టుకొనేందుకు ప్రయత్నం చేయవచ్చు. అందుకు ప్రత్యేకమైన నైపుణ్యం అవసరం. వీటిని బయటకు తీసేందుకు స్నేక్ సొసైటీ సహా అటవీ శాఖ అధికారులు సహకారం తీసుకోవడం ఉత్తమం. ఎందుకంటే వీటిలో చాలా విషపూరితమైనవి ఉండవచ్చు. ఫలితంగా ప్రమాదాల బారినపడే అవకాశం ఉంటుంది.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








