పుట్టలో ఉండాల్సిన పాము బైక్ స్పీడోమీటర్‌లో చేరిపోయింది.. తెగ వైరల్ అవుతున్న వీడియో
అసలే వర్షాకాలం.. పాములు మరియు తేళ్ల వంటి విషపూరిత జీవులు ఎక్కడపడితే అక్కడ కనిపిస్తాయి. వాటిని దూరం నుంచి చూస్తేనే గుండె గుభేలుమంటుంది. అలాంటిది మనం రైడ్ చేసే బైకులోనో లేదా కారులోనే కనిపిస్తే ఇక ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఇలాంటి సంఘటనే ఇటీవల మధ్యప్రదేశ్ లో జరిగినట్లు వెలుగులోకి వచ్చింది. దీని గురించి మరింత సమాచారం ఈ కథనంలో తెలుసుకుందాం.. రండి.

నివేదికల ప్రకారం, ఈ సంఘటన మధ్యప్రదేశ్‌లోని నార్సింగ్‌పూర్‌లో జరిగినట్లు తెలుస్తోంది. నజీర్‌ఖాన్ అనే వ్యక్తి తన బైకుని ఇంటివద్దనే రాత్రి పార్క్ చేసి ఉందయం తీసుకెళ్తున్న సమయంలో ఒక పాము ఆ బైక్ యొక్క ఓడోమీటర్ లో కనిపించింది. అది అక్కడికి ఎలా వచ్చిందో అని ఒక్కసారిగా భయానికి లోనయ్యాడు. వెంటనే ఆ బైకుని పక్కకు ఆపేసాడు.

బైక్ స్పీడోమీటర్‌లో పాము ఇరుక్కుపోయి ఉండడంతో ఆ పక్కనే ఉన్న చాలామంది దానిని బయటకు తీయడానికి ప్రయాణించారు. కానీ ప్రయోజనం లేకుండా పోయింది. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియావైలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోలో అక్కడున్న పాము నాగుపాము అని ఖచ్చితంగా తెలుస్తోంది.

వీడియోలో మీరు స్పష్టంగా గమనించినట్లయితే పాము కదులుతున్న సన్నివేశాలు కూడా చూడవచ్చు. నిజానికి ఈ వీడియో చూడగానే తప్పకుండా భయం వేస్తుంది. ఎందుకంటే ఆ సమయంలో ఆ పరిస్థితుల్లో మనం ఉంటే అని ఆలోచిస్తేనే ఒక్కసారిగా షాక్ అవుతాము.

చివరకు ఆ సమీపంలో ఉన్న వ్యక్తులు స్పీడోమీటర్‌లోంచి పామును బయటకు తీయడానికి స్పీడోమీటర్ యొక్క అద్దం పగులగొట్టాల్సి వచ్చింది. ఆ అద్దం పగులగొట్టి చివరకు అందులో ఇరుక్కున్న పామును బయటకు తీసేసారు. మొత్తానికి ఎవరికీ ఎటువంటి హాని జరగలేదు, కాబట్టి అందరూ ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు.

వర్షాకాలంలో ఎక్కువగా పాములు వెచ్చగా ఉండే ప్రదేశాల కోసం వెతుక్కుని అక్కడ ఉండిపోవడానికి ప్రయత్నిస్తాయి. ఇలాంటి క్రమంలోనే పాములు బైకుల్లో లేదా కార్లలో ప్రవేశించడానికి ప్రయత్నిస్తాయి. అంతే కాకుండా ఇళ్లలోకి కూడా ప్రవేసించి ఫ్రీజ్ మరియు ఎయిర్ కూలర్‌లో కూడా దూరేసే సంఘటనలు కూడా చాలానే జరిగాయి. మరికొన్ని సందర్భాల్లో కాళ్లకు వేసుకునే షుస్‌లో కూడా పాములు దూరి భయబ్రాంతులకు గురిచేస్తుంటాయి.
అయితే ఈ సంఘటనలో కనిపిస్తున్న బైకు హీరో కంపెనీకి చెందిన హోండా అని తెలుస్తోంది. నిజానికి కంపెనీ యొక్క ఈ బైక్ ప్రారంభం నుంచి మంచి ఆదరణ పొంది, మంచి అమ్మకాలను పొందగలిగింది. ఇది మంచి మైలేజ్ కూడా అందిస్తుంది. కావున ఇప్పటికి కూడా ఈ పాత హీరో బైక్ అక్కడక్కడా కనిపిస్తూ ఉంటుంది.

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:
సాధారణంగా బైకులు లేదా కార్లను సురక్షితమైన ప్రదేశాల్లో పార్క్ చేయాలి. అంతే కాకుండా మీరు వాటిని ఉపయోగించే ముందు మొత్తం పరీక్షించాలి. లేకుంటే ఇలాంటి ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి. గతంలో కూడా హోండా యాక్టివా స్కూటర్ లో పాము చేరిన సంఘటన కూడా వెలుగులోకి వచ్చింది. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకోవడంతోపాటు ఎప్పటికప్పుడు మార్కెట్లో విడుదలయ్యే కొత్త బైకులు మరియు కార్లను గురించి తెలుసుకోవడానికి తెలుసుకోవడానికి తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఛానల్ చూస్తూ ఉండండి.


Click it and Unblock the Notifications








