ఆటోమొబైల్ వ్యాపారంలోకి ప్రవేశించిన స్నాప్‌డీల్
ఎలక్ట్రానిక్స్, హోమ్ నీడ్స్, బట్టలు, అవి ఇవి అంటూ ఈ-కామర్స్ వ్యాపార సంస్థలు చాలా ఉత్పత్తులను తమ పోర్టల్ ద్వారా అమ్మకాలు సాగిస్తున్నారు. అయితే దేశ వ్యాప్తంగా ఆన్‌లైన్ వ్యాపారాలు మెరుగుగా ఉండటంతో ప్రముఖ ఈ-కామర్స్ వ్యాపార దిగ్గజం స్నాప్‌డీల్ ఆటోమొబైల్ వ్యాపారంలోకి అడుగుపెట్టింది. అంటే ఇక నుండి మనకు ఏవైనా వాహనాలు కొనాలంటే షోరూమ్‌కి వెళ్ళాల్సిన పని లేదన్నమాట. మన ఇంటికే కోరిన వాహనాన్ని డెలివరి చేస్తారు.
Also Read: ఈ దీపావలి కోసం ఉత్తమ ఆఫర్లను ప్రకటించిన కార్లు
స్నాప్‌డీల్ ఆటోమొబైల్ వ్యాపారం రంగం గురించి మరిన్ని విషయాలు.....

3,00,000 బైక్స్
స్నాప్‌డీల్ గత సంవత్సరం డిసెంబర్ నెలలో టూవీలర్ల అమ్మకాలను తన వైబ్‌సైట్ ద్వారా ప్రారంభించింది. అప్పటి నుండి ఇప్పటి వరకు స్నాప్‌డీల్ 3,00,000 టూవీలర్లను అమ్మేసింది.

పల్లె ప్రాంతాల నుండి
ఈ మొత్తం టూవీలర్ల అమ్మకాలలో దాదాపుగా 60 నుండి 65 శాతం పల్లె వాసులు టూవీలర్లను కొనుగోలు చేశారని సమాచారం.

ఐదు రకాల కంపెనీల వాహనాలు
స్నాప్‌డీల్ తమ ఈ-కామర్స్ పోర్టల్ ద్వారా దాదాపుగా ఐదు రకాల ఆటోమొబైల్ కంపెనీలతో చేతులు కలిపింది. అవి సుజుకి, డాట్సన్, పియాజియో, మహీంద్రా మరియు హీరో మోటోకార్ప్ మరిన్ని వాహన సంస్థలతో ఒప్పందం కుదుర్చుకునే పనిలో స్నాప్‌డీల్ సంస్థ ఉంది.

టెస్ట్ డ్రైవ్
ఏం మాట్లాడుతున్నారు... టెస్ట్ డ్రైవ్ చేయకుండా వాహనాన్ని కొంటారా అని సందేహిస్తున్నారా ? మిమ్మల్ని స్నాప్‌డీల్ ఎప్పుడో అర్థం చేసుకుంది. ఎందుకంటే మిమ్మల్ని మీకు దగ్గరో ఉన్న డీలర్‌తో సంప్రదింపులు జరిపే అవకాశం కల్పిస్తోంది. డౌన్ పేమెంట్, టెస్ట్ డ్రైవ్, బుకింగ్స్, డెలివరి వంటి వాటికి చెందిన సందేహాలన్ని నివృత్తి చేస్తారు.

బుుణాలు
స్నాప్‌డీల్ కస్టమర్లకు బుుణ సదుపాయం కూడా కల్పిస్తోంది. మరియు తమ పోర్టలో అందించిన ఆఫర్‌లకు అర్హులైన వినియోగదారులందరికి ఆఫర్ యొక్క ప్రతి ఫలాలను అందిస్తామి తెలిపారు.

2 మిలియన్ డాలర్లు
రాబోయే రెండేళ్ల కాలంలో స్నాప్ డీల్ ఈ ఆటోమొబైల్ రంగం ద్వారా 2 మిలియన్ డాలర్లను ఆర్జించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.

- ట్యూబ్ లెస్ టైర్ల యొక్క ప్రయోజనాలు మరియు ప్రతి కూలతలు: నిపుణుల మాటల్లో...
- కారు క్లీనింగ్ కోసం పది అత్భుతమైన చిట్కాలు...
- ఆనంద్ మహీంద్ర గురించి ఆసక్తికరమైన విషయాలు


Click it and Unblock the Notifications